ఈ వారం మూవీ అప్ డేట్స్ – డోంట్ మిస్..!

Check Out The Movie Updates For This Week47634

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ లో జరిగే లేటెస్ట్ అప్ డేట్స్ ను “దితెలుగుఫిలింనగర్.కమ్” సైట్ ద్వారా ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉన్నాం. అయితే వారం మొత్తం మీద జరిగిన విశేషాలను, మెయిన్ హైలైట్స్ ను ఈ వీక్లీ రౌండప్ లో మరోసారి మీ ముందు ఉంచుతున్నాం. మీరు కూడా ఒక లుక్కేయండి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

క్రిష్-వైష్ణవ్ తేజ్- రకుల్ సినిమా లాంచ్

క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్- రకుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్లుగా సినిమా కన్ఫామ్ అయింది. ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది. తొందరగానే షూటింగ్ ను మొదలు పెట్టి.. సింగిల్ షెడ్యూల్ లో షూటింగ్ పూర్తి చేయాలని చూస్తున్నాడట.

సాయి తేజ్ కొత్త సినిమా ప్రకటన

సాయితేజ్ తన కొత్త సినిమా ప్రకటించాడు. కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు సుకుమార్ స్క్రీన్ ప్లే అందిస్తుండగా.. శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. మిస్టికల్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించనున్నారు.

 


నిహారిక నిశ్చితార్థం

మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక నిశ్చితార్థం ఆగష్ట్ 15న జరిగింది. గుంటూరుకి చెందిన జొన్నలగడ్డ చైతన్యతో ఎంగేజ్‌మెంట్ కార్యక్రమం హైదరాబాద్‌లో నిరాడంబరంగా జరిగింది. కోవిడ్ నిబంధనలతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మెగా, అల్లు కుటుంబాలతోపాటు.. చైతన్య తరపు కొంతమంది బంధువులు మాత్రమే హాజరయ్యారు.

హిందీ లోకి దూకుడు ..’అప్పట్లో ఒకడుండేవాడు’..సినిమాలు

సూపర్ హిట్ తెలుగు మూవీస్ “జెర్సీ “, అల.. వైకుంఠపురములో.. “, “HIT ” మూవీస్ బాలీవుడ్ లో రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు బ్లాక్ బస్టర్ “దూకుడు “మూవీ హిందీ లో రీమేక్ కానుంది. దర్శకుడు శ్రీను వైట్ల దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందిన యాక్షన్ , కామెడీ ఎంటర్ టైనర్ దూకుడు.

అరన్ మీడియా వర్క్స్ బ్యానర్ పై నారా రోహిత్ , శ్రీవిష్ణు , తాన్యా హోప్ ప్రధాన పాత్రలలో సాగర్ K చంద్ర దర్శకత్వంలో 1990 ల నాటి వాస్తవ సంఘటన ఆధారంగా రూపొందిన క్రైమ్ , యాక్షన్ ఎంటర్ టైనర్ “అప్పట్లో ఒకడుండేవాడు”. ఈ సినిమా ఘనవిజయం సాధించింది. ఇప్పుడు ఈ మూవీ బాలీవుడ్ లో రీమేక్ కానుందని సమాచారం.

దేవా కట్టా ‘ఇంద్రప్రస్థం’

“మహాప్రస్థానం “మూవీ తో సంచలనం సృష్టించిన దర్శకుడు దేవా కట్టా మరో సంచలనానికి తెర తీశారు. మాజీ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు , వై ఎస్ రాజశేఖరెడ్డి స్నేహంపై సినిమా తీయనున్నారు. ఇంద్రప్రస్థం అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను ప్రోడోస్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ మూవీ టైటిల్ లోగో ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఆ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

అనారోగ్యానికి గురైన సంజయ్ దత్

బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కు అనారోగ్యానికి గురయ్యారు. కరోనా కోసం చేసిన పరీక్షల్లో నెగిటివ్ రాగా.. అయితే అదే సమయంలో జరిపిన పరీక్షల్లో ఆయనకు లంగ్ కాన్సర్ ఉన్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో చికిత్స కోసం అమెరికాకు వెళ్లనున్నారు. అయితే అనవసరమైన వార్తలకు కంగారు పడొద్దు.. మీ ప్రేమతో త్వరలోనే వస్తాను అని తెలిపారు.

 

కరోనా పాజిటివ్

ఆర్‌ఎక్స్‌ 100 డైరెక్టర్ అజయ్ భూపతికి కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే తన ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. తనకు కూడా కరోనా పాజిటివ్ వచ్చేసిందని.. త్వరలోనే వస్తా .. ప్లాస్మా దానం చేస్తానని ట్వీట్ లో పేర్కొన్నాడు.

హన్సిక “మహా ” మూవీ కొత్త పోస్టర్ రిలీజ్

ఎట్సెట్రా ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై యు ఆర్ జమీల్ దర్శకత్వంలో హన్సిక ప్రధాన పాత్రలో “మహా ” తమిళ మూవీ రూపొందుతుంది. థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ మూవీ లో తమిళ స్టార్ హీరో శింబు అతిథి పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీ కి గిబ్రాన్ సంగీతం అందించారు. హన్సిక బర్త్ డే సందర్భంగా చిత్ర యూనిట్ ఒక కొత్త పోస్టర్ ను రిలీజ్ చేసింది. రక్తం తో తడిచిన చేతులతో హన్సిక ఫేస్ కవర్ చేసిన ఆ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుని మూవీ పై ఆసక్తిని కలిగించింది.

‘అమ్మ కోసం’ చిరు చేప‌ల వేపుడు

లాక్ డౌన్ లో చిరు ఇంట్లో ఉంటూ బాగానే కాలక్షేపం చేస్తున్నారు. తనతల్లి కోసం మరో వంటను చేసి ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వంట ఏదో కాదు చేపల వేపుడు. చిన్నప్పుడు మా కోసం అమ్మ చింతకాయ తొక్కుతో చేసిన చిన్న చేపల వేపుడు చేస్తున్నా అని ఆ వంట వీడియోను సోషల్ మీడియాలో అభిమానుల కోసం పంచుకున్నారు.

 

 

View this post on Instagram

 

#SundaySavors

A post shared by Chiranjeevi Konidela (@chiranjeevikonidela) on

విక్రాంత్ రోనాగా ‘సుదీప్‌’

అనూప్ భండారీ దర్శకత్వంలో కన్నడ సూపర్ స్టార్ సుదీప్ హీరోగా ఫాంటమ్ కన్నడ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమానుండి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. పోస్టర్ ను బట్టి చూస్తుంటే ఫాంట‌మ్ చిత్రంలో విక్రాంత్ రోనా అనే పాత్ర పోషిస్తున్నట్టుతెలుస్తుంది. ఇందులో సుదీప్ చేతిలో గ‌న్ ప‌ట్టుకొని రాయ‌ల్‌గా కూర్చొని ఉన్నారు. ఇక ఇప్పుడు ఈ ఫోటో నెటిజ‌న్స్‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది.

 

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.