కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Latest Tollywood News

ట్యాగ్ · 4439 కథనాలు · పేజీ 142

Actor Nithiin Attributes His Next Movie Title To Power Star Pawan Kalyan
సినిమా వార్తలు

హీరో నితిన్ "దిల్ ఖుషి "

యంగ్ హీరో నితిన్ ఈ సంవత్సరం "భీష్మ " మూవీ తో విజయం సాధించి ఆనందం గా ఉన్నారు. వరుస మూవీస్ తో నితిన్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. నితిన్ ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న "రంగ్ దే "మూవీ లో నటిస్తున్నారు. ఈ మూవీ లో కీర్తి సురేష్ కథానాయిక. దర్శకులు చంద్ర శేఖర్ యేలేటి , మేర్లపాక గాంధీ , కృష్ణ చైతన్య మూవీస్ కు నితిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పుడు మరో మూవీ ని అనౌన్స్ చేయనున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

పవర్ స్టార్ కు సూపర్ స్టార్ బర్త్ డే శుంభాకాంక్షలు

ఈ రోజు (సెప్టెంబర్ 2 ) పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా సినీ , రాజకీయ ప్రముఖులతో పాటు అభిమానుల శుభాకాంక్షలు సోషల్ మీడియా లో వెల్లువెత్తాయి. పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా "వకీల్ సాబ్ " మూవీ మోషన్ పోస్టర్ రిలీజ్ అయ్యింది. ఆ పోస్టర్ ప్రేక్షక , అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. హీరో పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీ గా రూపొందుతున్న "వకీల్ సాబ్ " మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ఫ్యాన్స్ మరణంపై పవన్ స్పందన- ఇది మాటలకు అందని విషాదం

తమ అభిమాన హీరో పుట్టిన రోజును పండుగలా జరుపుకుందామని అభిమానాలు అనుకునేలోపే అనుకోని విషాదం జరిగిపోయింది. ప‌వ‌న్‌క‌ల్యాణ్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా చిత్తూరు జిల్లా కుప్పం.. శాంతిపురం మండ‌లం ఏడ‌వ‌మైలు గ్రామంలో అభిమానులు 25 అడుగుల ఎత్తుండే క‌టౌట్ క‌ట్టే ప్ర‌య‌త్నం చేశారు. ఆ స‌మ‌యంలో విద్యుత్ వైర్లు త‌గ‌ల‌డంతో ఒక్క‌సారిగా కరెంట్ షాక్ కు గురై సోమ‌శేఖ‌ర్‌, అరుణాచ‌ల‌నం, రాజేంద్ర అనే ముగ్గురు వ్యక్తులు అక్క‌డిక‌క్క‌డే చ‌నిపోయారు. మరి కొంతమంది చికిత్స పొందుతున్నారు. ఇక అభిమానుల మరణ వార్త విన్న పవన్ అభిమానుల మృతి ప‌ట్ల సంతాపాన్ని వ్యక్తం చేస్తూ ప్రకటనను విడుదల చేశారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

పవన్ కళ్యాణ్ కు సమంత బర్త్ డే శుభాకాంక్షలు

తెలుగు , తమిళ బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ సమంత స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ సమంత తన జీవిత విశేషాలను అభిమానులతో పంచుకుంటున్నారు. గార్డెనింగ్ పై ఆసక్తితో సేంద్రియ పద్ధతిలో వెజిటబుల్స్ పండిస్తున్నారు. ఆ వీడియోస్ ను సోషల్ మీడియా లో షేర్ చేస్తూ సమంత అభిమానులను ఇన్ స్పైర్ చేస్తున్నారు.

Team TFNవాట్సాప్
ఫస్ట్ లుక్

‘ది చేజ్’ అంటున్న కార్తీక్ రాజు - ఫస్ట్ లుక్ రిలీజ్

సందీప్ కిష‌న్ తో నిను వీడ‌ని నీడ‌ను నేనే అనే సినిమా తీసి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు కార్తీక్ రాజు. ప్రస్తుతం రెజీనా ప్రధానపాత్రలో 'నేనే నా' మూవీని తెర‌కెక్కిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగానే మరో సినిమాను లైన్ లో పెట్టాడు. తమిళ్ లో హిట్టైన ‘‘ప్యార్ ప్రేమ కాదల్’’మూవీ ఫేం ‘‘రైజా విల్సన్’’ మెయిన్ లీడ్ గా ‘ది చేజ్’ అనే తెలుగు,తమిళ బైలింగ్వల్ మూవీని రూపొందిస్తున్నాడు. ఇక తాజాగా ఈ సినిమా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసాడు. చూడటానికి మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా వుంది ఫస్ట్ లుక్.

TFN Adminవాట్సాప్
స్పెషల్

ఒకరినొకరు టీజ్ చేసుకుంటున్న మెగా హీరోలు

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, మెగా మేనల్లుడు సాయి తేజ్ ఇద్దరూ ఒకరికొకరు కామెడీ చేసుకుంటారన్న సంగతి తెలిసిందే. స్వతహాగా వరుణ్ తేజ్, సాయితేజ్ బావ, బావమరుదులు కాబట్టి ఆటపట్టించుకోవడం సహజం. ఇక ఇప్పుడు తాజాగా మరోసారి ఇద్దరూ సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు కామెడీ చేసుకున్నారు. తాజాగా వరుణ్ తేజ్ తన ట్విట్టర్ లో సాయి తేజ్, తను కలిసి ఉన్న చిన్నప్పటి ఫొటో పోస్ట్ చేసి...ఆ ఫోటోలో ఉన్న సాయితేజ్ ను ఉద్దేశించి... నీ హెయిర్ స్టయిల్ అంటే నాకు ఇష్టం సాయితేజ్ అంటూ ట్వీట్ చేశాడు. మరి ట్వీట్ చూసి సాయి తేజ్ ఊరుకుంటాడా.. వెంటనే మరో ట్వీట్ తో కౌంటర్ ఇచ్చాడు. వరుణ్ తేజ్ ఫొటో ను పోస్ట్ చేస్తూ.. నీ గడ్డం స్టయిల్ నాకు…

TFN Adminవాట్సాప్
ఓటీటీ

ఇలియానా డిజిటల్ ఎంట్రీ

ప్రజల వినోద సాధనం సినిమా. పండితులతో పాటు పామరులు కూడా సినిమాలు చూసి ఎంజాయ్ చేస్తారు. కరోనా మహమ్మారి కారణం గా థియేటర్స్ బంద్ కావడంతో థియేటర్స్ కు ప్రత్యామ్నాయంగా OTT ప్లాట్ ఫార్మ్స్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. సినిమాలతో పాటు వెబ్ సిరీస్ కూడా ప్రసారం అయ్యి ప్రేక్షకులను అలరిస్తున్నాయి. హిందీ , తెలుగు , తమిళ భాషలలో పలు వెబ్ సిరీస్ రూపొందుతున్న విషయం తెలిసిందే. స్టార్ హీరోయిన్స్ సమంత , శృతి హాసన్ , కాజల్ అగర్వాల్ , అంజలి , తమన్నా వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

అందుకే ప్లాస్మా డొనేట్ చేయలేదు - క్లారిటీ ఇచ్చిన జక్కన్న

దర్శక ధీరుడు రాజమౌళి కుటుంబానికి కరోనా వచ్చిన సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం అందరూ కోలుకున్నారు. అంతేకాదు కరోనా నుండి కోలుకున్న తర్వాత ప్లాస్మా దానం చేస్తామని చెప్పిన సంగతి కూడా గుర్తుండే ఉంటుంది కదా. ఇక చెప్పినట్టే ఈరోజు కీర‌వాణి, ఆయ‌న త‌న‌యుడు కాల‌భైర‌వ ప్లాస్మా డొనేట్ చేశారు. కిమ్స్ హాస్పిట‌ల్‌లో ఈ రోజు ప్లాస్మాను డొనేట్ చేసినట్టు ఒక ఫొటో ను పోస్ట్ చేస్తూ కీరవాణి సోషల్ మీడియా ద్వారా తెలిపారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

పెళ్లి పీటలెక్కబోతున్న విద్యుల్లేఖ రామన్

విద్యుల్లేఖ రామన్.. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. తెలుగులో రాజు గారి గది, సరైనోడు, భాగమతి వంటి పలు చిత్రాల్లో తనదైన కామెడీ తో నవ్వించింది. ఇక ఇదిలా ఉండగా విద్యుల్లేఖ రామన్ త్వరలో పెళ్లి పీఠలు ఎక్కబోతుంది. ఫిట్ నెస్ ట్రైనర్ అయిన సంజయ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని విద్యుల్లేఖ రామన్ తన ఇన్ స్ట్రాగ్రమ్ లో తెలిపింది. త‌న‌కి కాబోయే భ‌ర్త ఫోటోని షేర్ చేసింది.

TFN Adminవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

రీషూట్ కు రెడీ అవుతున్న సందీప్ కిషన్

ఇప్పుడప్పుడే ఈ కరోనా ప్రభావం పోదని ఫిక్స్ అయిపోయినట్టున్నారు మన హీరోలు. అందుకే చిన్నగా షూటింగ్స్ మళ్లీ మొదలుపెడుతున్నారు. మొదట ప్రభుత్వం షూటింగ్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా రిస్క్ ఎందుకులే అని ఛాన్స్ తీసుకోలేదు. కానీ ఇప్పుడు ఎన్ని నెలలు ఉన్నా పరిస్థితి ఇలానే ఉంటుందని ఆలోచించుకొని షూటింగ్స్ మొదలు పెట్టేస్తున్నారు. నిన్ననే మెగా హీరో సాయి తేజ్ సోలో బ్రతుకే సో బెటరు సినిమా షూటింగ్ మళ్లీ స్టార్ట్ చేసినట్టు తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు. ఇప్పుడు మరో హీరో కూడా తిరిగి షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు. ఆ హీరో ఎవరో కాదు సందీప్ కిషన్.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ఎమ్ ఎమ్ కీరవాణి ప్లాస్మా డొనేషన్

"మనసు మమత "(1990 ) మూవీ తో సంగీత దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయం అయిన ఎమ్ ఎమ్ కీరవాణి మూడు దశాబ్దాలుగా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ కు సంగీతం అందిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఒక నేషనల్ , 8 ఫిల్మ్ ఫేర్ , 11 నంది అవార్డ్స్ ను కీరవాణి అందుకున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ గానే కాకుండా సింగర్ , లిరిసిస్ట్ గా ప్రేక్షకులను అలరిస్తున్నారు. కీరవాణి ప్రస్తుతం "రౌద్రం రణం రుధిరం "మూవీ కి సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Rana Daggubati To Act In Super Natural Thriller Movie Bankrolled By Suresh Productions
సినిమా వార్తలు

మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్.. సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ నేపథ్యంలో..!

భల్లాలదేవ మళ్లీ వర్క్ మోడ్ లోకి వచ్చేసాడు. అసలు పెళ్లి చేసుకుంటాడా అన్న క్వశ్చన్ మార్క్ ను తీసేసి అందరికీ షాకిస్తూ లాక్ డౌన్ స‌మయంలో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాడు రానా. ఇన్ని రోజులు పెళ్లి హడావుడిలో ఉన్న రానా ఇక ఇప్పుడు సినిమాలపై ఫోకస్ చెప్పాడుపెట్టాడు. రానా ప్రస్తుతం వేణు ఊడుగుల దర్శకత్వంలో విరాటపర్వం 1992 అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే కొంత పూర్తిచేసుకుంది. కరోనా వల్ల ప్రస్తుతం షూట్ కు బ్రేక్ పడింది. రానా పొలిటికల్ లీడర్ గా కనిపించనున్న ఈ సినిమాను సురేష్ బాబు, సుధాక‌ర్ చెరుకూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

విశ్వనట చక్రవర్తి.. అంతర్జాతీయ అవార్డు అందుకున్న మొదటి హీరో ఎస్వీ రంగారావు

కొంతమంది నటుల గురించి చెప్పాలంటే మనకున్న అనుభవం చాలా తక్కువ అనిపిస్తుంది. అలాంటి నటుడే ఎస్వీ రంగారావు. ఈ నటన గురించి చెప్పాలంటే.. ఎంత చెప్పినా తక్కువే. పాత్ర ఏదైనా అందులో పరకాయ ప్రవేశం చేసి .. ఆ పాత్రకు పరిపూర్ణ న్యాయం చేయగలిగిన నటుడు ఆయన. ఆ ఆహార్యం.. స్వరంలో గాంభీర్యం.. డైలాగ్ డెలివరీ.. అభినయంలో ఆయనకు ఆయనే సాటి. ఆయనకు సరిరారు ఎవ్వరూ. నటజీవితంలో అనేక పాత్రలకు తన అభినయంతో జీవం పోసారు అందుకే ఆయనకు విశ్వనట చక్రవర్తి అని బిరుదు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

తనయుడికి ప్రేమతో బర్త్ డే విషెస్

సూపర్ స్టార్ మహేష్ బాబు తనయుడు గౌతమ్ ఈ రోజు 14వ వ‌సంతంలోకి అడుగు పెట్టాడు. ఈ సందర్భంగా తనయుడికి మహేష్, నమ్రత పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేసారు. మహేష్ తన ఇన్స్టా, ట్విట్టర్ లలో పసికందు గౌతమ్ ను ఎత్తుకున్న ఫొటో ను పోస్ట్ చేస్తూ.. 14వ వ‌సంతంలోకి అడుగు పెట్టినందుకు సంతోషంగా ఉంది... హ్యాపీ 14.. నువ్వు యువ‌కుడిగా ‌ ఎదుగుతున్నందుకు గ‌ర్వంగా ఉంది. డోరేమాన్ నుంచి అపెక్స్ లెజెండ్స్ వ‌ర‌కు నీతో క‌లిసి చేసిన ప్ర‌యాణం ప్ర‌త్యేకమైన‌ది. నీకు బెస్ట్ బ‌ర్త్‌డే విషెస్‌. ల‌వ్ యూ గౌత‌మ్" అని రాసుకొచ్చారు.

TFN Adminవాట్సాప్
Cute Picture of Superstar Mahesh Babu & Sitara
సినిమా వార్తలు

చిరు నవ్వులతో మహేష్ బాబు , సితార

వరుస బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ సక్సెస్ ఫుల్ చిత్ర హీరోగా మహేష్ బాబు టాలీవుడ్ లో దూసుకుపోతున్నారు. మహేష్ బాబు కు తనయుడు గౌతమ్ , తనయ సితార ఉన్న విషయం తెలిసిందే. సితార తన క్యూట్ డ్యాన్స్ స్టెప్స్ తో వీడియోస్ రూపొందించి ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేస్తూ ప్రేక్షక , అభిమానులను ఆకట్టుకుంటున్నారు . కుటుంబానికి అధిక ప్రాధాన్యత నిచ్చే మహేష్ బాబు లాక్ డౌన్ సమయాన్ని తన కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తూ టైమ్ స్పెండ్ చేస్తున్నారు.

Team TFNవాట్సాప్
Tollywood Actor Nagarjuna Shares His Excitement With Audience On Joining Shoot of Bigg Boss Season 4
షూటింగ్ అప్‌డేట్

మళ్లీ షూటింగ్ కు వెళ్తున్నా

లాక్ డౌన్ వల్ల షూటింగ్ లకు బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. సెలబ్రిటీస్ అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఇప్పుడిప్పుడే ధైర్యం చేసి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్ లు మొదలుపెడుతున్నారు. ఇక కింగ్ నాగార్జున కూడా తిరిగి వర్క్ మోడ్ లోకి వెళ్లనున్నట్టు తెలుపుతున్నారు. ఈ రోజు త‌న 61వ బ‌ర్త్ డే జ‌రుపుకుంటున్న సంగతి తెలిసిందే కదా. ఈ సందర్భంగా నాగార్జున వైల్డ్ డాగ్ నుండి స్పెషల్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. 'వైల్డ్ డాగ్' బృందంలో స‌భ్యులైన అలీ రెజా (ఫీల్డ్ ఏజెంట్ - ఎన్ఐఏ), ఆర్యా పండిట్ (స్పెష‌ల్ ఏజెంట్ - రా), కాలెబ్ మాథ్యూస్ (ఫీల్డ్ ఏజెంట్ - ఎన్ఐఏ), రుద్రా గౌడ్ (ఫీల్డ్ ఏజెంట్ - ఎన్ఐఏ), హ‌ష్వంత్ మ‌నోహ‌ర్…

TFN Adminవాట్సాప్
Tollywood Actor Naga Shaurya Flaunts His 8 Pack Abs In A Workout Pic Shared Recently On Social Media.
సినిమా వార్తలు

8 ప్యాక్ అబ్స్ తో నాగశౌర్య

శ్రీ వెంకటేశ్వర సినిమాస్ , నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై సంతోష్ జాగర్లమూడి దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా విలువిద్య నేపథ్యంలో స్పోర్ట్ డ్రామా "#NS20"మూవీ రూపొందనుంది. ఈ మూవీ లో నాగశౌర్య ఆర్చర్ గా నటిస్తున్నారు. ఆ క్యారెక్టర్ కు తగ్గట్టుగా నాగశౌర్య తన బాడీ ని మౌల్డ్ చేసుకుంటున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన "#NS20"మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

Team TFNవాట్సాప్
Actress Kangana Ranaut To Play Air Force Pilot In Tejas Movie
సినిమా వార్తలు

ఎయిర్ ఫోర్స్ ఫైటర్ పైలట్ పాత్రలో కంగనా రనౌత్

సూపర్ హిట్ "గ్యాంగ్ స్టర్ " మూవీ తో బాలీవుడ్ లో సినీ కెరీర్ ప్రారంభించిన కంగనా రనౌత్ "ఫ్యాషన్ ", "తను వెడ్స్ మను ", "క్రిష్ 3", "క్వీన్ ", "తను వెడ్స్ మను రిటర్న్స్ ", " మణికర్ణిక" వంటి సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. "ఏక్ నిరంజన్ "తెలుగు మూవీ లో కంగనా రనౌత్ నటించారు. కంగనా రనౌత్ ప్రస్తుతం లెజెండరీ యాక్ట్రెస్ , పొలిటికల్ లీడర్ జయలలిత బయోపిక్ మూవీ "తలైవి "తమిళ మూవీ లో జయలలిత పాత్రలో నటిస్తున్నారు. "తలైవి " మూవీ పలు భాషలలో రిలీజ్ కానుంది. కంగనా ఇప్పుడు ఒక బాలీవుడ్ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Team TFNవాట్సాప్
Samantha Akkineni Gives A Fun Counter To Question Asked By Audience On Instagram Live Chat
సినిమా వార్తలు

2017 నుంచే ప్రెగ్నెంట్ గా ఉన్నా- సామ్ కౌంటర్

సోషల్ మీడియాలో సెలబ్రిటీస్ కు విచిత్రమైన ప్రశ్నలు ఎదురవుతూనే ఉంటాయి. మన సెలెబ్రిటీస్ ఏమన్నా తక్కువా.. వారి ప్రశ్నలకు తగ్గట్టే రివర్స్ లో కౌంటర్లు వేస్తుంటారు. ఇప్పుడు అలాంటి ఒక ప్రశ్నకే సమంతకు ఎదురవ్వగా.. సమంత ఇచ్చిన కౌంటర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సోషల్ మీడియా క్వీన్ సామ్ ఎప్పుడూ యాక్టీవ్ గా ఉంటుంది. తన వ్యక్తిగత విషయాలను, సినిమా విశేషాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా తెలియచేస్తూనే ఉంటుంది. అప్పుడప్పుడు తన అభిమానులతో కూడా ముచ్చటిస్తూనే ఉంటుంది. అలానే తాజాగా ఇన్‌స్టాలో `ఆస్క్ సమంత` సెషన్‌ లో పాల్గొంది. ఈ సందర్భంగా.. అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమంత తనదైన శైలిలో…

TFN Adminవాట్సాప్
Naga Chaitanya New Movie Thank You Title Poster Is Out On Nagarjuna Birthday
ఫస్ట్ లుక్

నాగ్ బర్త్ డే - చైతు కొత్త సినిమా టైటిల్ ప్రకటన

టాలీవుడ్‌ కింగ్‌, మన్మధుడు అక్కినేని నాగార్జున ఈ రోజు పుట్టిన రోజును జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ రోజుతో ఆయన 60 సంవత్సరాలు పూర్తి చేసుకొని 61 వసంతంలోకి అడుగు పెడుతున్నాడు. ఈ సందర్భంగా నాగ్‌కు అభిమానుల నుంచి సెలబ్రిటీల వరకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

TFN Adminవాట్సాప్

షేర్