కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Latest Tollywood News

ట్యాగ్ · 4439 కథనాలు · పేజీ 141

సినిమా వార్తలు

వెంకీ 75 పై క్లారిటీ ఇచ్చిన నిర్మాత

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో హీరో వెంకటేష్ ప్రధాన పాత్రలో తమిళ్ సూపర్ హిట్ మూవీ 'అసురన్' తెలుగు రీమేక్ నారప్ప సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే స్టార్ట్ అయి కొంత చిత్రీకరణ కూడా పూర్తి చేసుకుంది. కరోనా వల్ల ప్రస్తుతం షూటింగ్ కు బ్రేక్ పడింది. ఇక ఈ సినిమా నుండి ఇప్పటికే పలు పోస్టర్ లను రిలీజ్ చేశారు. ప్రియమణి కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్, వి క్రియేషన్స్ సంస్థల్లో సురేష్ బాబు, కళైపులి ఎస్ థాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఇది వెంకీకి 74వ సినిమా.

TFN Adminవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

'గుడ్ లక్ సఖి' షూటింగ్ పూర్తి

మహానటి సినిమా తర్వాత కీర్తి సురేష్ పలు ప్రాజెక్ట్స్ ను లైన్ లో పెట్టింది. ఇటీవలే పెంగ్విన్ సినిమా ఓటీటీలో రిలీజ్ కాగా దానికి మంచి రెస్పాన్సే వచ్చింది. ఇక ప్రస్తుతం మూడునాలుగు ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉంది. వాటిలో న‌గేష్ కుకునూర్ దర్శకత్వంలో వస్తున్న గుడ్ లక్ సఖి సినిమా కూడా ఒకటి. ఇక ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది కొద్దిరోజుల షూటింగ్ మాత్రమే మిగలగా కరోనా వల్ల బ్రేక్ పడింది. ఇప్పటికే ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా అందులో కీర్తి సురేష్ గ్రామీణ ప్రాంత యువ‌తిగా క‌నిపించిన విషయం తెలిసిందే. రీసెంట్ గానే టీజర్ ను కూడా రిలీజ్ చేశారు.

TFN Adminవాట్సాప్
సాంగ్

'క్రాక్' సాంగ్స్ అప్ డేట్ ఇచ్చిన థమన్

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మాస్ మహారాజ్ రవితేజ హీరోగా క్రాక్ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కూడా చివరి దశలో ఉండగా కరోనా వల్ల బ్రేక్ పడింది. ఇక ఇప్పటీకే విడుదల చేసిన ర‌వితేజ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌కు, టీజ‌ర్‌కు చాలా మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. రెండు రోజుల క్రితమే ఈ సినిమా నుండి రవితేజ కొత్త స్టిల్‌ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. అంతే కాదు ఇంకా 15 రోజుల షూటింగ్ మిగిలి ఉన్న నేపథ్యంలో చివరి షెడ్యూల్ ను జరపడానికి ప్లాన్ చేస్తున్నారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

హీరో ప్రభాస్ అడ్వాన్స్ బర్త్ డే సీడీపీ రిలీజ్

"ఈశ్వర్ " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన ప్రభాస్ "వర్షం " మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి సెన్సేషనల్ హీరోగా సినీ మా అవార్డ్ అందుకున్నారు. "ఛత్రపతి ", "బిల్లా ", "Mr పర్ ఫెక్ట్", "మిర్చి " వంటి మూవీస్ తో ప్రభాస్ ప్రేక్షకులను అలరించారు. బ్లాక్ బస్టర్ "బాహుబలి ", "బాహుబలి 2" మూవీస్ తో ప్రభాస్ ప్రపంచవ్యాప్తం గా గుర్తింపు పొందారు. దక్షిణాది తో పాటు ఉత్తరాది లో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ అధికంగా ఏర్పడింది. బాలీవుడ్ లో హీరో ప్రభాస్ పై క్రేజ్ పెరిగింది. ప్రభాస్ హీరోగా నటించిన స్టైలిష్ మూవీ "సాహో " బాలీవుడ్ లో ఘనవిజయం సాధించింది.

Team TFNవాట్సాప్
ట్రైలర్ & టీజర్

ఓపికతో ఉండండి.. టీజర్స్, ట్రైలర్స్ అన్నీ వస్తాయి

జిల్ ఫేమ్ రాధా కృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ రాధేశ్యామ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని రోజులు యూరప్ లో షూటింగ్ లు జరుపుకోగా కరోనా వల్ల ఇక్కడకు వచ్చేసారు. మళ్ళీ షూటింగ్ ను సెప్టెంబర్ సెకండ్ వీక్ నుండి మొదలుకానుందని ఇటీవలే తెలియచేసారు. ఇక ఈ సినిమా అప్ డేట్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఎదురుచూడగా.. ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఇదిలా ఉండగా రాధా కృష్ణ తన ట్విట్టర్ ద్వారా అభిమానులను ఈ సినిమా గురించి ముఖ్యమైన ప్రశ్నలు అడగమని చెప్పగా ఇంకా అభిమానులు పలు ప్రశ్నలు అడుగగా వాటిలో కొన్నిటికి రాధా కృష్ణ సమాధానాలు తెలిపారు. ఆ సమాధానాలు ఇవే..

TFN Adminవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

"లవ్ స్టోరీ " మూవీ షూటింగ్ ఈ రోజు పునః ప్రారంభం

సోనాలీ నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ , అమిగో క్రియేషన్స్ బ్యానర్స్ పై ఫీల్ గుడ్ మూవీస్ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య , సాయి పల్లవి జంటగా రొమాంటిక్ ఎంటర్ టైనర్ "లవ్ స్టోరీ "మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. పోసాని , రావు రమేష్ , దేవయాని ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఈ మూవీ కి పవన్ సి హెచ్ సంగీతం అందించారు. కొంత షూటింగ్ పార్ట్ బ్యాలెన్స్ ఉండగా కరోనా కారణంగా షూటింగ్ నిలిచిపోయింది.

Team TFNవాట్సాప్
బిగ్ బాస్

బిగ్ బాస్ 4 - మాస్క్ ముఖానికి.. ఎంటర్ టైన్మెంట్ ‌కి కాదు..!

అనుకుంటుండగానే బిగ్ బాస్ 4 వచ్చేసింది. బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్ బాస్ సీజన్ 4 స్టార్ట్ అయిపోయింది. వరుసగా రెండోసారి బిగ్ బాస్‌కి హోస్ట్ చేస్తూ.. ‘ది బ్లాక్ బస్టర్ షో బిగ్ బాస్ బిగెన్.. మాస్క్ ముఖానికి అవసరం, ఎంటర్ టైన్మెంట్‌కి కాదు’ అంటూ ఎంట్రీ ఇచ్చాడు నాగార్జున. అయితే ఈసారి నాగ్ డ్యూయల్ రోల్ చేశారు. వృద్ధుడైన తండ్రిగా, కుమారుడిగా ద్విపాత్రాభినయం చేస్తూ వినోదం అందించే ప్రయత్నం చేశారు. ఇక సీజన్ సీజన్ కు బిగ్ బాస్ హౌస్ లో భారీ మార్పులే వస్తాయి. ఇక ఈసారి బిగ్ బాస్ ఇల్లు గత సీజన్లలో ఎప్పుడూ లేనంత రిచ్ గా కనిపిస్తోంది. డైనింగ్ టేబుల్, హాల్, బెడ్ రూములు…

TFN Adminవాట్సాప్
Director Puri Jagannadh Shares An Adorable Picture With His Wife
సినిమా వార్తలు

24 వసంతాల పూరి జగన్నాథ్ వివాహ బంధం

సూపర్ హిట్ "బద్రి " మూవీ తో దర్శకుడిగా టాలీవుడ్కు పరిచయం అయిన పూరి జగన్నాథ్ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. "అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి " మూవీ కి బెస్ట్ డైలాగ్ రైటర్ గా నంది అవార్డ్ , బ్లాక్ బస్టర్ "పోకిరి "మూవీ కి బెస్టుడైరెక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ పూరి జగన్నాథ్ అందుకున్నారు. సూపర్ హిట్ "చిరుత " మూవీ తో హీరో రామ్ చరణ్ ను హీరో గా పరిచయం చేసిన పూరి జగన్నాథ్ సీనియర్ హీరోలు బాలకృష్ణ , నాగార్జున లతో పాటు యువ హీరోలు మహేష్ బాబు , ప్రభాస్ , ఎన్టీఆర్ , అల్లు అర్జున్ , రవితేజ, రామ్ లతో హిట్ మూవీస్ రూపొందించారు.

Team TFNవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

కరోనా నిబంధనలతో ప్రీ షూటింగ్ వర్క్ స్టార్ట్ చేసిన 'ఆదిపురుష్' టీమ్

'ఆదిపురుష్' టీమ్ రాపిడ్ స్పీడ్ లో దూసుకుపోతుంది. ఈ సినిమాను అధికారికంగా ప్రకటించిన దగ్గరనుండి ఏదో ఒక అప్ డేట్ ఇస్తూ ప్రభాస్ ఫ్యాన్స్ ను కుష్ చేస్తున్నారు. ఎందుకంటే బాహుబలి సినిమా తర్వాత, సాహో సినిమాలకు అప్ డేట్స్ ఎంత లేట్ గా వచ్చాయో తెలుసు. రాధే శ్యామ్ సినిమాకు అయితే ఫ్యాన్స్ ఒక రేంజ్ లో ఆగ్రహం వ్యక్తం చేశారు. అలా చేస్తేకాని ఆ టైటిల్ పోస్టర్ పోస్టర్.. ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. అలాంటిది ఇప్పుడు 'ఆదిపురుష్' టీం మాత్రం వరుస అప్ డేట్స్ ఇస్తుంది.

TFN Adminవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

పూజాహెగ్డే ఫీలింగ్స్

బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుని పూజాహెగ్డే టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ చిత్ర కథానాయికగా కొనసాగుతున్నారు. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. పూజాహెగ్డే ప్రస్తుతం రెండు తెలుగు మూవీస్ లో కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ లో రెండు మూవీస్ లో పూజాహెగ్డే హీరోయిన్ గా ఎంపిక అయ్యారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

బాలు హెల్త్ అప్ డేట్ - సోమ‌వారం శుభవార్త వింటారు

కరోనా వైరస్ సోకడంతో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆగస్టు 5న చెన్నైలోని ఎంజీఎం హాస్పిటల్‌లో చేరిన విషయం తెలిసిందే. అప్పటినుండి బాలుకి చికిత్స పొందుతూనే ఉన్నారు. ఇన్ని రోజుల్లో బాలు ఆరోగ్యం నిలకడగా ఉందని కొన్నిసార్లు.. ఆరోగ్యం క్షీణించిందని ఇలా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇక ఈ రూమర్స్ పై బాలు తనయుడు ఎస్పీ చరణ్ స్పందించి నాన్న ఆరోగ్యంపై వచ్చే వార్తలను నమ్మకండి.. నేనే అప్ డేట్స్ ఇస్తా అని క్లారిటీ ఇచ్చారు. ఆ రోజు నుండి తనే అప్ డేట్స్ ఇస్తున్నాడు.

TFN Adminవాట్సాప్
Police Department Makes Use Of Simha Movie Dialogue To Promote Awareness In Public Regarding Drunk & Driving
సినిమా వార్తలు

ప్రజలకు హెచ్చరిక గా "సింహా " మూవీ డైలాగ్

బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ "సింహా " మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మూవీ లో హీరో బాలకృష్ణ పవర్ ఫుల్ డైలాగ్స్ తో ప్రేక్షకులను అలరించారు. బ్లాక్ బస్టర్ "సింహా " మూవీ లోని "నేను మాట్లాడుతున్నప్పుడు నీ చెవులు మాత్రమే పని చేయాలి , కాదని ఏ పని చేసినా నీకు నెక్స్ట్ బర్త్ డే ఉండదు " డైలాగ్ ను పోలీసులు కొంత మార్చి సోషల్ మీడియా లో ప్రచారం చేస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

'V' చేయడానికి చాలా రీజన్స్ ఉన్నాయి

ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో నాని,సుధీర్ బాబు,నివేద థామస్, అదితి రావు హైదరి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన 'వి' సినిమా అమెజాన్ ప్రైమ్ లో సెప్టెంబర్ 5న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఇక ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగానే ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు చిత్ర బృందం. దీనిలో భాగంగా సుధీర్ బాబు ది తెలుగుఫిలింనగర్.కమ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూ లో పాల్గొని పలు ఇంటరెస్టింగ్ విషయాలు తెలిపారు.

TFN Adminవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

"పొన్నియిన్ సెల్వన్ " మూవీ అప్ డేట్

మద్రాస్ టాకీస్ , లైకా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో కల్కి కృష్ణ మూర్తి నవల "పొన్నియిన్ సెల్వన్ " ఆధారంగా హిస్టారికల్ డ్రామా "పొన్నియిన్ సెల్వన్ " మూవీ రెండు భాగాలుగా రూపొందుతున్న విషయం తెలిసిందే. చియాన్ విక్రమ్ , జయం రవి , కార్తీ , ఐశ్వర్య రాయ్ , త్రిష , శోభిత ధూళిపాళ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ఈ మూవీ కి ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ థాయ్ ల్యాండ్ లో జరుపుకున్న "పొన్నియిన్ సెల్వన్ " మూవీ షూటింగ్ సెకండ్ షెడ్యూల్ పుదుచ్చేరి లో జరుపుకుంది. కరోనా కారణం గా ఈ మూవీ షూటింగ్ వాయిదా పడింది.

Team TFNవాట్సాప్
ఫస్ట్ లుక్

"బొమ్మ బ్లాక్ బస్టర్ " మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్

సూపర్ హిట్ "100% లవ్ " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన నందు "శివరంజని ", "సవారి " మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. నందు హీరోగా ప్రస్తుతం "బొమ్మ బ్లాక్ బస్టర్ " మూవీ లో నటిస్తున్నారు. విజయీభవ ఆర్ట్స్ బ్యానర్ పై రాజ్ విరాఠ్ దర్శకత్వంలో నందు , ప్రముఖ యాంకర్ , నటి రష్మీ గౌతమ్ జంటగా "బొమ్మ బ్లాక్ బస్టర్ " మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ప్రశాంత్ R విహారి సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ఎగ్జామ్ హాల్లో సాయి పల్లవి - అభిమానుల హంగామా

డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యా అన్న డైలాగ్ చాలా సార్లు వినే ఉంటాం. అందరికేమో కానీ.. సాయి పల్లవికి మాత్రం ఈ డైలాగ్ కరెక్ట్ గా సరిపోతుంది. సినిమాల్లోకి రాకముందే సాయిపల్లవి జార్జియాలో వైద్య విద్యను అభ్యసించింది. డాక్టర్‌ అయిన తర్వాతే యాక్టర్‌గా మారిందని చెప్పొచ్చు. చదువు మధ్యలో ఉండగా ఈమెకు అవకాశాలు వచ్చినా.. ఈమె తన మెడిసిన్ పూర్తైన తర్వాతనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది సాయి పల్లవి. చేసింది తక్కువ సినిమాలే అయినా మంచి క్రేజ్ సంపాదించుకుంది.

TFN Adminవాట్సాప్
Anasuya Bharadwaj Urges Everyone To Donate Plasma To Save Life Of People Affected With Corona Virus
సినిమా వార్తలు

ప్లాస్మా దానానికై అనసూయ పిలుపు

కరోనా వ్యాధి నుండి కోలుకున్న వారి ప్లాస్మా తో మరికొంతమంది కరోనా బాధితులను కాపాడవచ్చని తెలిసిన విషయమే. సైబరాబాద్ సి పి సజ్జనార్ ప్లాస్మా దానానికై ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. సాధారణ ప్రజల తో పాటు సెలబ్రిటీస్ కూడా ప్లాస్మా డొనేట్ చేస్తున్నారు. బ్లడ్ డొనేషన్ వంటిదే ప్లాస్మా డొనేషన్ అనీ, భయపడాల్సిన అవసరం లేదనీ ప్రముఖ యాంకర్ అనసూయ ప్లాస్మా డొనేషన్ కై పిలుపు నిచ్చారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

'ఆదిపురుష్' - లంకేశునిగా సైఫ్ అలీఖాన్

ప్రభాస్ 22 సినిమా 'ఆదిపురుష్' అప్ డేట్స్ మాత్రం వెంట వెంటనే ఇచ్చేస్తున్నారు చిత్రయూనిట్. అనవసరమైన గాసిప్స్ రావడంకంటే ముందే క్లారిటీ ఇస్తే ఓ పనైపోతుంది అనుకుంటున్నారేమో కానీ సినిమా ప్రకటించిన దగ్గర నుండి ఏదో ఒక అప్ డేట్ ఇస్తూ.. ఏదో ఒక క్లారిటీ ఇస్తూనే వున్నారు. ఇక ఇప్పుడు తాజాగా మరో విషయంలో కూడా క్లారిటీ ఇచ్చేసారు.

TFN Adminవాట్సాప్
ఫస్ట్ లుక్

"ఉప్పెన "మూవీ స్పెషల్ పోస్టర్ రిలీజ్

మైత్రీ మూవీ మేకర్స్ , సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ , కృతి శెట్టి జంటగా రూపొందిన "ఉప్పెన "మూవీ ఏప్రిల్ నెలలో రిలీజ్ కావాల్సింది కానీ కరోనా కారణం గా రిలీజ్ వాయిదా పడింది. హీరో సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ తేజ్ "ఉప్పెన "మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. తమిళ హీరో విజయ్ సేతుపతి ఒక కీలక పాత్రలో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
బిగ్ బాస్

'బిగ్ బాస్ 4' లో లేను.. ఫ్యూచర్ లో కూడా ఉండను

బుల్లితెరపై ఎన్ని రియాలిటీ షోలు వచ్చినా బిగ్ బాస్ కు ఉండే క్రేజ్ మాత్రం వేరు అని చెప్పొచ్చు. సెప్టెంబర్ 6 నుండి బిగ్ బాస్ సీజన్ 4 ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ప్రేక్షకులు కూడా ఈ షో కోసం ఆసక్తిగానే ఎదురుచూస్తున్నారు. ఇక ఇదిలా ఉండగా ఈ షోలో పాల్గొనబోయే కంటెస్టెంట్ లపై ఇప్పటికే పలు వార్తలు వచ్చిన సంగతి కూడా విదితమే. పలానా సెలబ్రిటీలు ఈ షోలో పాల్గొంటున్నారంటూ కొన్ని పేర్లు కూడా బయటకు వస్తున్నాయి. హీరో కార్తికేయ, తరుణ్ లతో పాటు కొంతమంది సెలబ్రిటీస్ ఇప్పటికే ఆవార్తలపై స్పందించి తాము బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేయట్లేదని క్లారిటీ కూడా ఇచ్చారు. మొన్నటికి మొన్న సినీనటి కల్పిక గణేశ్ కూడా…

TFN Adminవాట్సాప్

షేర్