మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, మెగా మేనల్లుడు సాయి తేజ్ ఇద్దరూ ఒకరికొకరు కామెడీ చేసుకుంటారన్న సంగతి తెలిసిందే. స్వతహాగా వరుణ్ తేజ్, సాయితేజ్ బావ, బావమరుదులు కాబట్టి ఆటపట్టించుకోవడం సహజం. ఇక ఇప్పుడు తాజాగా మరోసారి ఇద్దరూ సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు కామెడీ చేసుకున్నారు. తాజాగా వరుణ్ తేజ్ తన ట్విట్టర్ లో సాయి తేజ్, తను కలిసి ఉన్న చిన్నప్పటి ఫొటో పోస్ట్ చేసి…ఆ ఫోటోలో ఉన్న సాయితేజ్ ను ఉద్దేశించి… నీ హెయిర్ స్టయిల్ అంటే నాకు ఇష్టం సాయితేజ్ అంటూ ట్వీట్ చేశాడు. మరి ట్వీట్ చూసి సాయి తేజ్ ఊరుకుంటాడా.. వెంటనే మరో ట్వీట్ తో కౌంటర్ ఇచ్చాడు. వరుణ్ తేజ్ ఫొటో ను పోస్ట్ చేస్తూ.. నీ గడ్డం స్టయిల్ నాకు బాగా నచ్చుతుంది అంటూ ట్వీట్ చేశారు. ఇక వీరిద్దరి ట్వీట్లను మెగా ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నెటిజన్స్ కూడా కామెడీ గా కామెంట్స్ చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Love your beard style @IAmVarunTej 😋🤣🤣 #vintagebeard https://t.co/pft9EYK8eO pic.twitter.com/K31DYpPlgY
— Sai Dharam Tej (@IamSaiDharamTej) September 1, 2020
ప్రస్తుతం సుబ్బు దర్శకత్వంలో సాయి తేజ్’సోలో బ్రతుకే సో బెటర్’ సినిమాచేస్తున్నాడు. కరోనా వల్ల ఇన్ని రోజులు షూటింగ్ కు బ్రేక్ పడగా.. మళ్ళీ షూటింగ్ ను స్టార్ చేశారు. `ఇస్మార్ట్ శంకర్` భామ నభా నటేష్ హీరోయిన్ గా రొమాంటిక్ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్నాడు. థమన్ సంగీతం అందిస్తున్నాడు.
ఇక వరుణ్ నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో వరుణ్ బాక్సర్ గా నటించనున్నాడు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణ లో రినైస్సన్స్ పిక్చర్స్, బ్లూ వాటర్స్ క్రియేటివ్ బ్యానర్స్ పై అల్లు బాబీ, సిద్దు ముద్దలు నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు… హాలీవుడ్ స్టంట్ మాస్టర్ లార్నెల్ స్టోవాల్ ఫైట్స్ ను కంపోజ్ చేస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: