విశ్వనట చక్రవర్తి.. అంతర్జాతీయ అవార్డు అందుకున్న మొదటి హీరో ఎస్వీ రంగారావు

Tuesday Trivia: Interesting Fact about Legendary Actor SVR

కొంతమంది నటుల గురించి చెప్పాలంటే మనకున్న అనుభవం చాలా తక్కువ అనిపిస్తుంది. అలాంటి నటుడే ఎస్వీ రంగారావు. ఈ నటన గురించి చెప్పాలంటే.. ఎంత చెప్పినా తక్కువే. పాత్ర ఏదైనా అందులో పరకాయ ప్రవేశం చేసి .. ఆ పాత్రకు పరిపూర్ణ న్యాయం చేయగలిగిన నటుడు ఆయన. ఆ ఆహార్యం.. స్వరంలో గాంభీర్యం.. డైలాగ్ డెలివరీ.. అభినయంలో ఆయనకు ఆయనే సాటి. ఆయనకు సరిరారు ఎవ్వరూ. నటజీవితంలో అనేక పాత్రలకు తన అభినయంతో జీవం పోసారు అందుకే ఆయనకు విశ్వనట చక్రవర్తి అని బిరుదు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సాంఘిక సినిమాల్లో నటన ఒక ఎత్తయితే పౌరాణిక సినిమాల్లో ఎస్వీఆర్ నటన మరొక ఎత్తు. ‘పాతాళ భైరవి’లో నేపాళ మాంత్రికుడు.. ‘పాండవ వనవాసం’లో దుర్యోధనుడు..‘మాయా బజార్‌’లో ఘటోత్కచుడు..‘నర్తనశాల’లో కీచకుడు..‘సంపూర్ణ రామాయణం’లో రావణుడు..‘భక్త ప్రహ్లాద’లో హిరణ్యకశ్యపుడిగా ఆయన నటనను కళ్లార్పకుండా చూస్తాం మనం ఇప్పటికీ. ఈతరం నటులకు ఆయన సినిమాలు ఒక గ్రంధాలయం లాంటివి.

ముఖ్యంగా నర్తనశాల సినిమాలో కీచక పాత్ర అయితే ఆయన నటనా కౌశలానికి నిదర్శనం అని చెప్పొచ్చు. ఎస్వీ రంగారావు కోసం ఆ పాత్ర పుట్టినట్టుంటుంది. అందుకే నర్తనశాలలో పోషించిన కీచక పాత్రకు గాను జకార్తా లో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఉత్తమ నటుడిగా బహుమతి అందుకున్నాడు ఎస్వీఆర్. ఎన్టీఆర్, సావిత్రి లాంటి దిగ్గజ నటులు ఆ సినిమాలో నటించినా ఈ అవార్డును అప్పటి ఇండోనేషియా అధ్యక్షుడు సుకర్ణో చేతులు మీదుగా అందుకున్నారు ఎస్వీఆర్. అప్పట్లో అంతర్జాతీయ స్థాయిలో పురస్కారం అందుకున్న… తొలి భారతీయ నటుడు ఎస్వీఆర్ అంటేనే ఆయన నటన ఏ స్థాయిలో ఉంటుందో చెప్పొచ్చు.

తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో 300పైగా సినిమాలు చేసారు ఆయన. 1974 జూలై 18న ఆయన కన్నుమూసారు. ఆయన భౌతికంగా ఇక్కడ లేకపోయినా.. సినిమా బతికి వున్నంత వరకు ఆయన బ్రతికే వుంటారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − eleven =