ఎమ్ ఎమ్ కీరవాణి ప్లాస్మా డొనేషన్

Music Director MM Keeravani Donates Plasma Along With His Son Kala Bhairava At Kims Hospital

“మనసు మమత “(1990 ) మూవీ తో సంగీత దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయం అయిన ఎమ్ ఎమ్ కీరవాణి మూడు దశాబ్దాలుగా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ కు సంగీతం అందిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఒక నేషనల్ , 8 ఫిల్మ్ ఫేర్ , 11 నంది అవార్డ్స్ ను కీరవాణి అందుకున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ గానే కాకుండా సింగర్ , లిరిసిస్ట్ గా ప్రేక్షకులను అలరిస్తున్నారు. కీరవాణి ప్రస్తుతం “రౌద్రం రణం రుధిరం “మూవీ కి సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కరోనా మహమ్మారి కి వ్యాక్సిన్ లేకపోవడం తో ప్రజల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. కరోనా వ్యాధి నుండి కోలుకున్న వారి ప్లాస్మాతో కరోనా బారిన పడిన వారిని రక్షించడం బాధితులకు ఉపశమనం గా మారింది. కరోనా నుండి కోలుకున్న సాధారణ ప్రజలతో పాటు సెలబ్రిటీస్ కూడా ప్లాస్మా డొనేట్ చేస్తున్నారు. ఇప్పుడు సంగీత దర్శకుడు కీరవాణి తన తనయుడు కాలభైరవ (సింగర్ , మ్యూజిక్ డైరెక్టర్ ) తో కిమ్స్ హాస్పిటల్ లో ప్లాస్మా డొనేట్ చేశారు. తన తనయుడితో కలసి ప్లాస్మా డొనేట్ చేసినందుకు సంతోషంగా ఉందని, బ్లడ్ డొనేషన్ వంటిదే ప్లాస్మా డొనేషన్ అనీ , భయపడాల్సిన అవసరం లేదనీ కీరవాణి ట్వీట్ చేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 + 15 =