భల్లాలదేవ మళ్లీ వర్క్ మోడ్ లోకి వచ్చేసాడు. అసలు పెళ్లి చేసుకుంటాడా అన్న క్వశ్చన్ మార్క్ ను తీసేసి అందరికీ షాకిస్తూ లాక్ డౌన్ సమయంలో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాడు రానా. ఇన్ని రోజులు పెళ్లి హడావుడిలో ఉన్న రానా ఇక ఇప్పుడు సినిమాలపై ఫోకస్ చెప్పాడుపెట్టాడు. రానా ప్రస్తుతం వేణు ఊడుగుల దర్శకత్వంలో విరాటపర్వం 1992 అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే కొంత పూర్తిచేసుకుంది. కరోనా వల్ల ప్రస్తుతం షూట్ కు బ్రేక్ పడింది. రానా పొలిటికల్ లీడర్ గా కనిపించనున్న ఈ సినిమాను సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
దీనితో పాటు ప్రభు సోలమన్ దర్శకత్వంలో రానా దగ్గుబాటి, జోయా హుస్సేన్ జంటగా “హాథీ మేరే సాథీ ” అనే సినిమా చేస్తున్న సంగతి కూడా తెలిసిందే. తెలుగులో ‘అరణ్య’, తమిళ్‌లో కదన్ పేరుతో రిలీజ్ కానుంది. ఈ సినిమా కూడా ఏప్రిల్ లో రిలీజ్ కావాల్సి ఉంది. తెలిసిందే కదా ఎందుకు రిలీజ్ కాలేదో. ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తుంది.
ఇక ఇప్పుడు తాజాగా మరో సినిమాకు రానా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. మిలింద్ రౌ దర్శకత్వంలో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నట్టు టాక్ వినిపిస్తోంది. మిలింద్ ఇప్పటికే రానాకు కథ వినిపించగా.. రానాకు కూడా స్టోరీ నచ్చిందట. సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ నేపథ్యంలో యాక్షన్ అడ్వంచర్ గా ఈ మూవీ తెరకెక్కనున్నట్టు తెలుస్తుంది. సురేష్ ప్రొడక్షన్స్ తో కలిసి ఆచంట గోపినాథ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారట. మరి ఈ వార్తల్లో ఎంతవరకు వాస్తవముందనే విషయం తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: