ఇలియానా డిజిటల్ ఎంట్రీ

Star Heroine Ileana To Make Her Entry In To Digital Space Through Bollywood.

ప్రజల వినోద సాధనం సినిమా. పండితులతో పాటు పామరులు కూడా సినిమాలు చూసి ఎంజాయ్ చేస్తారు. కరోనా మహమ్మారి కారణం గా థియేటర్స్ బంద్ కావడంతో థియేటర్స్ కు ప్రత్యామ్నాయంగా OTT ప్లాట్ ఫార్మ్స్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. సినిమాలతో పాటు వెబ్ సిరీస్ కూడా ప్రసారం అయ్యి ప్రేక్షకులను అలరిస్తున్నాయి. హిందీ , తెలుగు , తమిళ భాషలలో పలు వెబ్ సిరీస్ రూపొందుతున్న విషయం తెలిసిందే. స్టార్ హీరోయిన్స్ సమంత , శృతి హాసన్ , కాజల్ అగర్వాల్ , అంజలి , తమన్నా వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

టాలీవుడ్ , బాలీవుడ్ లలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన గోవా బ్యూటీ ఇలియానా ఇప్పుడు డిజిటల్ ప్లాట్ ఫార్మ్ కు ఎంటర్ అవుతున్నారు. ఇంగ్లీష్ లో రూపొందిన “లూథర్ “టీవీ సిరీస్ ప్రేక్షకాదరణ పొందింది. ఈ టీవీ సిరీస్ ను స్టార్ హీరో అజయ్ దేవగన్ కథానాయకుడిగా బాలీవుడ్ లో ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ రీమేక్ చేయనుంది. ఈ రీమేక్ వెబ్ సిరీస్ లో అజయ్ దేవగన్ కు జోడీ గా ఇలియానా ఎంపిక అయ్యారు. ఇలియానా ప్రస్తుతం అభిషేక్ బచ్ఛన్ హీరోగా రూపొందుతున్న “ది బిగ్ బుల్ ” మూవీ లో నటిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven + 11 =