రీషూట్ కు రెడీ అవుతున్న సందీప్ కిషన్

Actor Sundeep Kishan To Join The Movie Shooting Of A1 Express After Lockdown

ఇప్పుడప్పుడే ఈ కరోనా ప్రభావం పోదని ఫిక్స్ అయిపోయినట్టున్నారు మన హీరోలు. అందుకే చిన్నగా షూటింగ్స్ మళ్లీ మొదలుపెడుతున్నారు. మొదట ప్రభుత్వం షూటింగ్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా రిస్క్ ఎందుకులే అని ఛాన్స్ తీసుకోలేదు. కానీ ఇప్పుడు ఎన్ని నెలలు ఉన్నా పరిస్థితి ఇలానే ఉంటుందని ఆలోచించుకొని షూటింగ్స్ మొదలు పెట్టేస్తున్నారు. నిన్ననే మెగా హీరో సాయి తేజ్ సోలో బ్రతుకే సో బెటరు సినిమా షూటింగ్ మళ్లీ స్టార్ట్ చేసినట్టు తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు. ఇప్పుడు మరో హీరో కూడా తిరిగి షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు. ఆ హీరో ఎవరో కాదు సందీప్ కిషన్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రస్తుతం A1 ఎక్స్ ప్రెస్ సినిమా చేస్తున్నాడు సందీప్ కిషన్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, వెంకటాద్రి టాకీస్ బ్యానర్స్ పై డెన్నిస్ జీవన్ కనుకొలను దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. ఇక ఈ సినిమా ఇప్పటికే కొంతవరకూ షూటింగ్ ను పూర్తి చేసుకుంది. కరోనా వల్ల బ్రేక్ వచ్చింది. అయితే ఇప్పుడు మళ్లీ షూట్ ను మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో సందీప్ కిష‌న్ సిక్స్ ప్యాక్ బాడీని చూపిస్తూ.. షూటింగ్ ను తిరిగి ప్రారంభిస్తున్నామని.. చాలా ఎగ్జైట్ గా ఉందని అంకిత భావంతో ప‌నిచేసే ఇలాం‌టి టీం దొరకడం ఆశీర్వాదంగా భావిస్తున్నాని సందీప్ కిష‌న్ ట్వీట్ చేశాడు.

 

కాగా లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో మురళీశర్మ, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. హిప్ హాప్ తమిళ సంగీతం అందిస్తున్నాడు.

రామ్‌ అబ్బరాజు దర్శకత్వంలో మరో సినిమాను కూడా చేస్తున్నాడు సందీప్ కిషన్. వెంకటాద్రి టాకీస్‌, సోల్జర్స్‌ ఫ్యాక్టరీ, ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్ పతాకాలపై రూపొందనున్న ఈ సినిమాను సందీప్‌ కిషన్‌, శినీష్, కిరణ్‌ నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. వివాహ భోజనంబు అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 + 4 =