“పొన్నియిన్ సెల్వన్ ” మూవీ అప్ డేట్

Ponniyin Selvan Latest Schedule Update

మద్రాస్ టాకీస్ , లైకా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో కల్కి కృష్ణ మూర్తి నవల “పొన్నియిన్ సెల్వన్ ” ఆధారంగా హిస్టారికల్ డ్రామా “పొన్నియిన్ సెల్వన్ ” మూవీ రెండు భాగాలుగా రూపొందుతున్న విషయం తెలిసిందే. చియాన్ విక్రమ్ , జయం రవి , కార్తీ , ఐశ్వర్య రాయ్ , త్రిష , శోభిత ధూళిపాళ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ఈ మూవీ కి ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ థాయ్ ల్యాండ్ లో జరుపుకున్న “పొన్నియిన్ సెల్వన్ ” మూవీ షూటింగ్ సెకండ్ షెడ్యూల్ పుదుచ్చేరి లో జరుపుకుంది. కరోనా కారణం గా ఈ మూవీ షూటింగ్ వాయిదా పడింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో రాజ రాజ చోళన్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న “పొన్నియిన్ సెల్వన్ ” మూవీ ఫస్ట్ పార్ట్ 2021 సంవత్సరంలో రిలీజ్ కానుంది. అక్టోబర్ నెల నుండి “పొన్నియిన్ సెల్వన్ ” మూవీ షూటింగ్ శ్రీలంకలో జరపాలని దర్శకుడు మణిరత్నం ప్లాన్ చేశారని సమాచారం . తక్కువ టీమ్ మెంబర్స్ తో షూటింగ్ జరపడానికి దర్శకుడు నిర్ణయించారు. దర్శకుడు మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్టు గా రూపొందుతున్న ఈ మూవీ కరోనా టైమ్ లో షూటింగ్ జరుపుకోనున్న ఫస్ట్ బిగ్ మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది. హీరో విక్రమ్ “పొన్నియిన్ సెల్వన్ ” మూవీ తోపాటు “కోబ్రా “, “మహావీర్ కర్ణ “, “విక్రమ్ 60 ” వంటి భారీ చిత్రాలలో నటిస్తున్నారు.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 − 1 =