వెంకీ 75 పై క్లారిటీ ఇచ్చిన నిర్మాత

Venky 75 Movie Producer Gives Clarity On Movie Updates

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో హీరో వెంకటేష్ ప్రధాన పాత్రలో తమిళ్ సూపర్ హిట్ మూవీ ‘అసురన్’ తెలుగు రీమేక్ నారప్ప సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే స్టార్ట్ అయి కొంత చిత్రీకరణ కూడా పూర్తి చేసుకుంది. కరోనా వల్ల ప్రస్తుతం షూటింగ్ కు బ్రేక్ పడింది. ఇక ఈ సినిమా నుండి ఇప్పటికే పలు పోస్టర్ లను రిలీజ్ చేశారు. ప్రియమణి కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్, వి క్రియేషన్స్ సంస్థల్లో సురేష్ బాబు, కళైపులి ఎస్ థాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఇది వెంకీకి 74వ సినిమా.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా వెంకీ 75 సినిమాపై గత కొద్దిరోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమా రూపొందిస్తారని వార్తలు వస్తున్నాయి. నిజానికి వెంకీ హీరోగా రెండేళ్ళ క్రితమే త్రివిక్రమ్‌ దర్శకత్వంలో సినిమా రావాల్సి ఉంది. హారికా అండ్‌ హాసినీ క్రియేషన్‌ ఈ సినిమాని అధికారికంగానూ ప్రకటించింది. కానీ అనుకోకుండా ఆ సినిమా పట్టాలెక్కలేదు. వెంకీ ఇతర ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండటం… మరోవైపు త్రివిక్రమ్‌ కూడా వేరే హీరోలతో సినిమాలతో బిజీగా ఉండటంతో ప్రాజెక్ట్ పక్కకు వెళ్ళింది. అయితే ఇప్పుడు అదే సినిమాని వెంకీ 75వ సినిమాగా రానుందని అంటున్నారు. అయితే ఈ విషయం మీద హారికా అండ్‌ హాసినీ క్రియేషన్‌ నిర్మాత వంశీ క్లారిటీ ఇచ్చాడు. `వెంకటేష్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లోని సినిమా గురించి మీ ఆసక్తిని అర్థం చేసుకోగలం. అయితే వెంకీ 75వ సినిమా గురించి వస్తున్న వార్తల్లో నిజం లేదు. మా తర్వాతి ప్రాజెక్టు గురించి మా అధికారిక సోషల్ మీడియా ఖాతాల నుంచి ప్రకటిస్తాం. అప్పటివరకు వేచి ఉండండ`ని ట్వీట్ చేశాడు.

 

కాగా వెంకీతో సినిమా కోసం పలువురు డైరెక్టర్స్ లైన్ లోనే వున్నారు. ఇప్పటికే యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ప్రస్తుతం వెంకీ కోసం ఓ కథ సిద్ధం చేస్తున్నాడు. ఈ విషయాన్ని తరుణ్ భాస్కర్ కూడా చెప్పాడు. మరి చూద్దాం వెంకీ 75 సినిమా తీసే అవకాశం ఎవరికి దక్కుతుందో.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 − 2 =