24 వసంతాల పూరి జగన్నాథ్ వివాహ బంధం

Director Puri Jagannadh Shares An Adorable Picture With His Wife

సూపర్ హిట్ “బద్రి ” మూవీ తో దర్శకుడిగా టాలీవుడ్కు పరిచయం అయిన పూరి జగన్నాథ్ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. “అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి ” మూవీ కి బెస్ట్ డైలాగ్ రైటర్ గా నంది అవార్డ్ , బ్లాక్ బస్టర్ “పోకిరి “మూవీ కి బెస్టుడైరెక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ పూరి జగన్నాథ్ అందుకున్నారు. సూపర్ హిట్ “చిరుత ” మూవీ తో హీరో రామ్ చరణ్ ను హీరో గా పరిచయం చేసిన పూరి జగన్నాథ్ సీనియర్ హీరోలు బాలకృష్ణ , నాగార్జున లతో పాటు యువ హీరోలు మహేష్ బాబు , ప్రభాస్ , ఎన్టీఆర్ , అల్లు అర్జున్ , రవితేజ, రామ్ లతో హిట్ మూవీస్ రూపొందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

1996 సంవత్సరంలో సెప్టెంబర్ 6వ తేదీ లావణ్య తో పూరి జగన్నాథ్ వివాహం జరిగింది. 24 వ వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా పూరి జగన్నాథ్ .. తన వైఫ్ లావణ్య పెళ్ళి అయిన నాటి నుండీ తనకు చాలా సపోర్టివ్ గా ఉన్నారనీ , మూవీస్ తో తాను బిజీగా ఉండడంతో తమ కిడ్స్ ను ఫుడ్ , ఎడ్యుకేషన్ వంటి విషయాల పై శ్రద్ధ తీసుకుని వారి ఆలనా పాలనా చూసుకునేవారని , తమ రిలేషన్ షిప్ లో బాడ్ పర్సన్ తానేనని అంటూ తామిద్దరి ఫొటో ను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశారు. బ్లాక్ బస్టర్ “ఇస్మార్ట్ శంకర్ ” మూవీ తరువాత రైటర్ , నిర్మాత , దర్శకుడు పూరి జగన్నాథ్ ప్రస్తుతం విజయ్ దేవర కొండ హీరోగా పాన్ ఇండియా “ఫైటర్ ” మూవీ రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ తో విజయ్ దేవరకొండ బాలీవుడ్ కు హీరోగా పరిచయం అవుతున్నారు.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen + 14 =