బిగ్ బాస్ 4 – మాస్క్ ముఖానికి.. ఎంటర్ టైన్మెంట్ ‌కి కాదు..!

Bigg Boss Season 4 Show Kickstarts To Entertain Us Amdist Corona Virus Crisis

అనుకుంటుండగానే బిగ్ బాస్ 4 వచ్చేసింది. బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్ బాస్ సీజన్ 4 స్టార్ట్ అయిపోయింది. వరుసగా రెండోసారి బిగ్ బాస్‌కి హోస్ట్ చేస్తూ.. ‘ది బ్లాక్ బస్టర్ షో బిగ్ బాస్ బిగెన్.. మాస్క్ ముఖానికి అవసరం, ఎంటర్ టైన్మెంట్‌కి కాదు’ అంటూ ఎంట్రీ ఇచ్చాడు నాగార్జున. అయితే ఈసారి నాగ్ డ్యూయల్ రోల్ చేశారు. వృద్ధుడైన తండ్రిగా, కుమారుడిగా ద్విపాత్రాభినయం చేస్తూ వినోదం అందించే ప్రయత్నం చేశారు. ఇక సీజన్ సీజన్ కు బిగ్ బాస్ హౌస్ లో భారీ మార్పులే వస్తాయి. ఇక ఈసారి బిగ్ బాస్ ఇల్లు గత సీజన్లలో ఎప్పుడూ లేనంత రిచ్ గా కనిపిస్తోంది. డైనింగ్ టేబుల్, హాల్, బెడ్ రూములు, స్విమ్మింగ్ పూల్… ఇలా ప్రతి అంశం కలర్ ఫుల్ గా కనిపిస్తోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక కంటెస్టెంట్ ల విషయానికి వస్తే ఈసారి మాత్రం పేర్లు బయటకి రాకుండా బాగానే జాగ్రత్తలు పడ్డారు. కానీ చాలా మంది పేర్లు ముందుగానే తెలిసిపోయాయి. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ 4 కంటెస్టెంట్ లు ఎవరో ఒకసారి చూద్దాం.

మోనాల్‌ గజ్జర్‌
మొదటి కంటెస్టెంట్‌గా హీరోయిన్‌ మోనాల్‌ గజ్జర్‌ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టింది. సుడిగాడు సినిమాతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన మోనల్‌ గజ్జర్‌ తెలుగు, తమిళ్‌, మళయాళం, గుజరాతీ భాషల్లో హీరోయిన్‌గా నటించింది. బాలీవుడ్‌లోనూ సినిమాలు చేసింది.

సూర్యకిరణ్
డైరెక్టర్‌ సూర్యకిరణ్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. తెలుగులో తొలి చిత్రం సత్యంతోనే మంచి హిట్‌ అందుకున్నారు. హీరోయిన్‌ కళ్యాణి భర్తే సూర్యకిరణ్

యాంకర్‌ లాస్య
మూడో కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి ఎంటరయ్యారు యాంకర్‌ లాస్య. వివాహం అయిన తర్వాత లాస్య టీవీకి దూరమైయ్యారు. ఇప్పుడు బిగ్‌బాస్‌ 4తో మళ్లీ రిఎంట్రీ ఇచ్చింది.

అభిజిత్‌
బిగ్ బాస్ 4 లో నాలుగో కంటెస్టెంట్ గా హౌస్ లోకి అడుగుపెట్టాడు అభిజిత్. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వహించిన లైఫ్‌ ఈజ్‌ బ్యూటీవుల్‌ సినిమాలో హీరోగా తెలుగు తెరకు పరిచయమయ్యాడు అభిజిత్‌.

సుజాత
ఐదో కంటెస్టెంట్ యాంకర్‌ సుజాత. తెలంగాణ యాసతో పాపులర్‌ అయిన న్యూస్‌ యాంకర్స్‌లో సుజాత ఒకరు.

మెహబూబ్‌ దిల్‌సే
ఆరో కంటెస్టెంట్‌గా మెహబూబా దిల్‌ సే ఎంట్రీ ఇచ్చాడు. మెహబూబా టిక్ టాక్ వీడియోస్, యూ ట్యూబ్ వీడియోస్, షార్ట్ ఫిలింస్ ద్వారా చాలా ఫేమస్ అయ్యాడు.

దేవి నాగవల్లి
హైలైట్ ఏంటంటే ‌టీవీ9 యాంకర్‌ దేవి నాగవల్లి కూడా బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేయడం. ఏడో కంటెస్టెంట్ గా హౌస్ లోకి వెళ్ళారు దేవి నాగవల్లి. రాజమండ్రికి చెందిన దేవి నాగవల్లి..మాస్ కమ్యునికేషన్‌లో డిప్లమో చేసి టీవీ 9తో కెరియర్ మొదలుపెట్టారు. అతి తక్కువ కాలంలోనే పాపులర్ న్యూస్ ప్రజెంటర్‌గా పాపులర్ అయ్యారు.

దేత్తడి హారిక
ఎనిమిదో కంటెస్టెంట్స్‌గా యూట్యూబ్‌ స్టార్‌ దేత్తడి హారిక ఎంట్రీ ఇచ్చింది. హైదరాబాద్‌కి చెందిన హారిక అతి తక్కువ సమయంలో టాప్‌ యూ ట్యూబ్‌ స్టార్స్‌లో ఒకరు గా ఎదిగారు.

సయ్యద్ సోహైల్
తొమ్మిదో కంటెస్టెంట్‌గా టీవీ నటుడు సయ్యద్ సోహైల్ వచ్చాడు. ఈ ఏడాది విడుదలైన యురేకా చిత్రంలో సోహెల్‌ నటించారు. ఇస్మార్ట్‌ సొహెల్‌గా గుర్తింపు పొందారు.

అరియానా గ్లోరీ
జెమినిలో ప్రసారమయ్యే కెవ్వు కామెడీ యాంకర్‌గా ఫేమస్ అయిన అరియానా గ్లోరీ పదో కంటెస్టెంట్‌గా వచ్చింది. అయితే సోహైల్‌,అరియానా గ్లోరీలను బిగ్‌బాస్‌లోకి కాకుండా సీక్రెట్ హౌజ్‌లోకి పంపారు.

అమ్మ రాజశేఖర్‌
11వ కంటెస్టెంట్ డైరెక్టర్‌ అమ్మ రాజశేఖర్‌. కొరియోగ్రాఫర్‌గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి దర్శకుడుగా మారి గోపిచంద్‌ రణం, రవితేజ ఖతర్నాక్‌, నితిన్‌ టక్కరి చిత్రాలకు దర్శకత్వం వహించారు అమ్మా రాజశేఖర్‌.

కరాటే కల్యాణి
12 వ కంటెస్టెంట్‌గా కరాటే కల్యాణి ఎంట్రీ ఇచ్చింది. కృష్ణ సినిమాలోని బా..బీ.. డైలాగ్‌తో ఆమె ఫేమస్‌ అయ్యారు. తనను తాను తెలుసుకోవడానికే బిగ్‌బాస్‌లోకి వస్తున్నానని చెప్పింది. నాగార్జున కోసం బిగ్‌బాస్‌పై హరికథ చెప్పి హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.

నోయల్‌
13వ కంటెస్టెంట్‌ సింగర్‌ నోయల్. ర్యాపర్ గా.. యాక్టర్ గా నోయల్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. ‌ది షేక్‌ గ్రూప్‌ పేరుతో ఒక తెలుగు బ్యాండ్‌ని కూడా నిర్వహిస్తున్నాడు నోయల్.

దివి
14వ కంటెస్టెంట్‌గా దివి వచ్చేసింది. నటన అంటే ఇష్టంతో మోడలింగ్‌ చేసి, అట్నుంచి నటిగా మారినట్టు దివి చెప్పుకొచ్చారు. పలు వెబ్‌ సిరీస్‌ లలో నటించిన దివి… ఇప్పుడు సినిమాలు చేస్తున్నానని తెలిపింది.

అఖిల్‌
15వ కంటెస్టెంట్‌గా నటుడు అఖిల్‌ ఎంటరయ్యాడు. నాగ్‌ నటించిన `సిసింద్రి`సినిమా విడుదలైన మరుసటి రోజు జన్మించానని అందుకే తనకు అఖిల్‌ పేరు పెట్టారని తెలిపాడు.

గంగవ్వ
బిగ్ బాస్ 4 లో మరో హైలైట్ ఏదైనా వుంది అంటే అది గంగవ్వే. 16వ కంటెస్టెంట్‌గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది గంగవ్వ. గంగవ్వ టాప్‌ యూ ట్యూబ్‌ స్టార్స్‌లో ఒకరు. మై విలేజ్‌ షో అనే యూట్యూబ్‌ వీడియోస్ తో గంగవ్వ చాలా ఫేమస్ అయింది.

ఇక సోమవారం-శుక్రవారం వరకూ రాత్రి 9.30 గంటలకు బిగ్ బాస్ ప్రసారం కాబోతుంది. శని ఆది వారాల్లో రాత్రి 9 గంటలకు ప్రసారం కానుంది. 15 వారాల పాటు పదహారు మందితో సాగే ఈ షో.. రేపటి నుంచి కంటెస్టెంట్ల ఆట పాటలతోనే.. గొడవలు, కోపాలు, ఎమోషన్స్ ఇలా అన్ని రసాలను చూపిస్తూ ఎంటెర్టైన్
చేయడానికి రెడీ అవుతున్నారు..

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − 15 =