‘V’ చేయడానికి చాలా రీజన్స్ ఉన్నాయి

Actor Sudheer Babu Reveals The Reasons Behind Accepting His Role In V Movie

ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో నాని,సుధీర్ బాబు,నివేద థామస్, అదితి రావు హైదరి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘వి’ సినిమా అమెజాన్ ప్రైమ్ లో సెప్టెంబర్ 5న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఇక ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగానే ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు చిత్ర బృందం. దీనిలో భాగంగా సుధీర్ బాబు ది తెలుగుఫిలింనగర్.కమ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూ లో పాల్గొని పలు ఇంటరెస్టింగ్ విషయాలు తెలిపారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వి సినిమా చేయడానికి కారణం..ఏ అంశం మిమ్మల్ని కన్విన్స్ చేసింది అన్న ప్రశ్నకు .. స్క్రిప్ట్, నా పాత్ర ఇంకా ఇంద్రగంటి గారు ఈ సినిమాకు దర్వకత్వం వహించడం.. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి.. ముందు మాత్రం ఇవి.. ఇంకా దిల్ రాజు గారు ప్రొడ్యూస్ చేయడం.. నాని, నివేద థామస్, అదితి లాంటి స్టార్ కాస్టింగ్ ఒక్కటని చెప్పడం కష్టం. ఇంకా యాక్షన్ జోనర్.. అది కూడా మీనింగ్ ఫుల్ యాక్షన్ సీక్వెన్సెస్.. మంచి డ్రామా.. ఇద్దరి పాత్రలను బ్యాలన్స్ చేసిన విధానం.. అనుకున్నది సాధించడానికి ఏదైనా చేసే ఇద్దరి పాత్రల మధ్య వుండే పోటీ.. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే యాక్షన్ సినిమాలో కాప్…కిల్లర్ లాంటి రెండు ముఖ్యమైన పాత్రలు.. రెండు పాత్రలు జస్టిఫై అవ్వడం. నో చెప్పడానికి కూడా ఏం లేదు.. నిజంగా ఈ సినిమా నాకు చాలా ఫ్రెష్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందని ఖచ్చితంగా చెప్పొచ్చు.

ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో నాని, సుధీర్ బాబు ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘వి’. నాని నెగిటివ్ షేడ్ లో నటించడం.. పవర్ ఫుల్ ఆఫీసర్ గా సుధీర్ బాబు…వాటికి తోడు మంచి థ్రిల్లింగ్ అండ్ సస్పెన్స్ ఎలిమెంట్స్ తో టీజర్,ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. నివేదా థామస్, అదితి రావ్ హైదరీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. జగపతిబాబు, నాజర్, వెన్నెల కిశోర్, శ్రీనివాస్ అవసరాల కీలక పాత్రల్లో నటించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై శిరీష్‌, హ‌ర్షిత్ రెడ్డి రూపొందిస్తున్న ఈ సినిమాకు అమిత్ త్రివేది సంగీతం అందించగా…థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు. సెప్టెంబ‌ర్ 5న ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుద‌ల చేయనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − eight =