‘ఆదిపురుష్’ టీమ్ రాపిడ్ స్పీడ్ లో దూసుకుపోతుంది. ఈ సినిమాను అధికారికంగా ప్రకటించిన దగ్గరనుండి ఏదో ఒక అప్ డేట్ ఇస్తూ ప్రభాస్ ఫ్యాన్స్ ను కుష్ చేస్తున్నారు. ఎందుకంటే బాహుబలి సినిమా తర్వాత, సాహో సినిమాలకు అప్ డేట్స్ ఎంత లేట్ గా వచ్చాయో తెలుసు. రాధే శ్యామ్ సినిమాకు అయితే ఫ్యాన్స్ ఒక రేంజ్ లో ఆగ్రహం వ్యక్తం చేశారు. అలా చేస్తేకాని ఆ టైటిల్ పోస్టర్ పోస్టర్.. ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. అలాంటిది ఇప్పుడు ‘ఆదిపురుష్’ టీం మాత్రం వరుస అప్ డేట్స్ ఇస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మొన్ననే ఈ సినిమాలో సైఫ్ లంకేశ్వరునిగా నటిస్తున్నట్టు ప్రకటించారో లేదో అప్పుడే వర్క్ స్టార్ట్ చేసినట్టు సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. కరోనా నిబంధనలతో ప్రీ షూటింగ్ వర్క్ స్టార్ట్ చేసినట్టు తెలిపారు. అంతేకాదు ఫొటోలను కూడా షేర్ చేసాడు.
ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్న ఈ ‘ఆదిపురుష్’ మూవీని భారీ బడ్జెట్ కేటాయించి పాన్ ఇండియా మూవీగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. హిందీ, తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం భాషల్లో గుల్షన్ కుమార్, టి-సిరీస్ ఫిల్మ్స్ సమర్పణలో భూషణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఓం రౌత్, క్రిషణ్ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ సహ నిర్మాతలు. 3D మూవీగా రూపొందనున్న ఈ సినిమాను 2022లో విడుదల చేసేలా ప్లాన్ చేశారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: