ఓపికతో ఉండండి.. టీజర్స్, ట్రైలర్స్ అన్నీ వస్తాయి

Director Radha Krishna Posts An Interesting Tweet Regarding RadheShyam Movie Teasers and Trailer Release

జిల్ ఫేమ్ రాధా కృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ రాధేశ్యామ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని రోజులు యూరప్ లో షూటింగ్ లు జరుపుకోగా కరోనా వల్ల ఇక్కడకు వచ్చేసారు. మళ్ళీ షూటింగ్ ను సెప్టెంబర్ సెకండ్ వీక్ నుండి మొదలుకానుందని ఇటీవలే తెలియచేసారు. ఇక ఈ సినిమా అప్ డేట్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఎదురుచూడగా.. ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఇదిలా ఉండగా రాధా కృష్ణ తన ట్విట్టర్ ద్వారా అభిమానులను ఈ సినిమా గురించి ముఖ్యమైన ప్రశ్నలు అడగమని చెప్పగా ఇంకా అభిమానులు పలు ప్రశ్నలు అడుగగా వాటిలో కొన్నిటికి రాధా కృష్ణ సమాధానాలు తెలిపారు. ఆ సమాధానాలు ఇవే..

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

1. అవును డార్లింగ్ ప్రభాస్ తో చేయడం నా డ్రీం. ఆయనతో పనిచేయడం నా అదృష్టమే.
2. వచ్చే సంవత్సరం ఖచ్చితంగా థియేటర్స్ లో చూద్దాం
3. రాధే శ్యామ్ సినిమాకు ప్రభాస్ లుక్కే పెద్ద అసెట్..
4. అవును పూజా హెగ్డేనే రాధేశ్యామ్ సినిమాకు ఫస్ట్ ఛాయిస్
5. మోషన్ పోస్టర్స్, టీజర్స్, ట్రైలర్స్ అన్నీ వస్తాయి.. కొంచం ఓపికతో వుండండి..కరెక్ట్ సమయంలో అన్ని సర్ ప్రయిజ్ లు వస్తాయి అని తెలిపాడు.

 

కాగా పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమాను గోపికృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తెలుగు, మలయాళం, హిందీ, తమిళ భాషల్లో తెరకెక్కుతోన్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.

ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ 21 మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ తో చేస్తున్నాడు. ఈ రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ తో పాటు ప్రభాస్ తన 22వ సినిమాను కూడా ఇటీవలే ప్రకటించాడు. గుల్షన్ కుమార్, టి సిరీస్ ఫిలిమ్స్ సమర్పణలో రెట్రోఫైల్స్ ప్రొడక్షన్, టి సిరీస్ ఫిలిమ్స్ బ్యానర్ పై తానాజీ ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కబోతుంది. మైథలాజికల్ సోషియో ఫాంటసీ ఎంటెర్టైనెర్ గా రెడీ అవుతున్న ఈ చిత్రానికి “ఆది పురుష్” అనే టైటిల్ ఫిక్స్ చేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 4 =