ప్రజలకు హెచ్చరిక గా “సింహా ” మూవీ డైలాగ్

Police Department Makes Use Of Simha Movie Dialogue To Promote Awareness In Public Regarding Drunk & Driving

బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ “సింహా ” మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మూవీ లో హీరో బాలకృష్ణ పవర్ ఫుల్ డైలాగ్స్ తో ప్రేక్షకులను అలరించారు. బ్లాక్ బస్టర్ “సింహా ” మూవీ లోని “నేను మాట్లాడుతున్నప్పుడు నీ చెవులు మాత్రమే పని చేయాలి , కాదని ఏ పని చేసినా నీకు నెక్స్ట్ బర్త్ డే ఉండదు ” డైలాగ్ ను పోలీసులు కొంత మార్చి సోషల్ మీడియా లో ప్రచారం చేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మద్యం మత్తు లో వాహనాలు నడిపి ప్రమాదాలకు గురి అయ్యి ప్రజలు ప్రాణాలు పోగొట్టుకుంటున్న విషయం తెలిసిందే. ప్రజలకు హెచ్చరిక గా “పండగలని , పబ్బాలని , సెలవులకి తాగి బండి నడిపితే నీకు నెక్స్ట్ బర్త్ డే ఉండదు”అంటూ ” సింహా “మూవీ డైలాగ్ ను మార్చి పోలీసులు ప్రచారం చేస్తున్నారు. పోలీసుల వినూత్న ప్రచార డైలాగ్ కు విశేష స్పందన లభించింది. హీరో బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న “BB3 “మూవీ లో నటిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.