డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యా అన్న డైలాగ్ చాలా సార్లు వినే ఉంటాం. అందరికేమో కానీ.. సాయి పల్లవికి మాత్రం ఈ డైలాగ్ కరెక్ట్ గా సరిపోతుంది. సినిమాల్లోకి రాకముందే సాయిపల్లవి జార్జియాలో వైద్య విద్యను అభ్యసించింది. డాక్టర్ అయిన తర్వాతే యాక్టర్‌గా మారిందని చెప్పొచ్చు. చదువు మధ్యలో ఉండగా ఈమెకు అవకాశాలు వచ్చినా.. ఈమె తన మెడిసిన్ పూర్తైన తర్వాతనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది సాయి పల్లవి. చేసింది తక్కువ సినిమాలే అయినా మంచి క్రేజ్ సంపాదించుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా కూడా తన చదువును నిర్లక్ష్యం చేయలేదు సాయి పల్లవి. విదేశాల్లో వైద్య విద్యను పూర్తి చేసిన సాయి పల్లవి ఇటీవల నేషనల్ బోర్డు ఆఫ్ ఎగ్జామినేషన్ నిర్వహించే ఫారీన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ ( FMGE)పరీక్షకు హాజరయ్యారు. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, స్టేట్ మెడికల్ కౌన్సిల్‌లో డాక్టర్‌గా రిజిస్టర్ చేసుకోవాలంటే ఈ పరీక్షలో తప్పనిసరిగా ఉత్తీర్ణులవ్వాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో తిరుచ్చిలోని ఎంఏఎం కాలేజీలో జరిగిన పరీక్షకు హాజరయ్యారు. ఈ సందర్భంగా పరీక్ష రాయడానికి వచ్చిన సాయి పల్లవిని చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. అంతేకాదు ఆమెతో ఫోటోలు దిగారు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కాగా ప్రస్తుతం వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా, సాయిపల్లవి కాంబినేషన్లో విరాటపర్వం 1992 అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా కొంత షూటింగ్ ను కూడా పూర్తిచేసుకుంది. లాక్ డౌన్ వల్ల షూట్ కు బ్రేక్ పడింది. ఇక ఈ సినిమాలో రానా పొలిటికల్ లీడర్ గా.. సాయి పల్లవి నక్సలైట్ గా కనిపించనున్న సంగతి కూడా విదితమే. దీనితోపాటు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘లవ్ స్టోరీ’ సినిమాలో కూడా నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ కూడా చివరి దశకు వచ్చింది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: