మహానటి సినిమా తర్వాత కీర్తి సురేష్ పలు ప్రాజెక్ట్స్ ను లైన్ లో పెట్టింది. ఇటీవలే పెంగ్విన్ సినిమా ఓటీటీలో రిలీజ్ కాగా దానికి మంచి రెస్పాన్సే వచ్చింది. ఇక ప్రస్తుతం మూడునాలుగు ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉంది. వాటిలో నగేష్ కుకునూర్ దర్శకత్వంలో వస్తున్న గుడ్ లక్ సఖి సినిమా కూడా ఒకటి. ఇక ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది కొద్దిరోజుల షూటింగ్ మాత్రమే మిగలగా కరోనా వల్ల బ్రేక్ పడింది. ఇప్పటికే ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా అందులో కీర్తి సురేష్ గ్రామీణ ప్రాంత యువతిగా కనిపించిన విషయం తెలిసిందే. రీసెంట్ గానే టీజర్ ను కూడా రిలీజ్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఈ మూవీకి సంబంధించిన ఒక చిన్న షెడ్యూల్ పెండింగ్‌లో ఉండగా.. తాజాగా ఆ షూటింగ్ పూర్తి అయ్యింది. ఈ విషయాన్ని నిర్మాతల్లో ఒకరైన శ్రావ్య వర్మ సోషల్ మీడియాలో వెల్లడించారు. ఇక చిత్రీకరణ పూర్తి అవ్వడంతో.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేయాల్సి ఉందని తెలిపింది. ఈ సందర్భంగా ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో నటిస్తున్న ఆదిపినిశెట్టి కూడా తన ట్విట్టర్ ద్వారా చిత్రయూనిట్ ను మిస్ అవుతున్నట్టు తెలిపాడు. గోలి రాజు పాత్రను తప్పకుండా మిస్ అవుతున్నాను.. గ్రేట్ టీం వర్క్.. ఈ ఎక్స్పీరియన్స్ ఇచ్చినందుకు చాలా థాంక్స్ అంటూ ట్వీట్ చేసాడు.
Super happy to announce that the shoot for #goodlucksakhi is now completely WRAPPED as of yesterday ❤️ this was one beautiful roller coaster ride . @KeerthyOfficial @AadhiOfficial @sudheerbza @ThisIsDSP @chirucam #nageshkukunoor pic.twitter.com/W1P8d3Cxwi
— shravya varma (@shravyavarma) September 6, 2020
కాగా ఆదిపినిశెట్టి, జగపతిబాబు, రాహుల్ రామకృష్ణ, రమాప్రభ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. వర్త్ ఎ షాట్ మోషన్ ఆర్ట్స్ బ్యానర్‌పై సుధీర్ చంద్ర పాదిరి, శ్రావ్య వర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఒకేసారి తెలుగు, తమిళ, మలయాళం భాషల్లో రూపొందిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా.. చిరంతన్ దాస్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు.
ఇంకా ఈ సినిమాతో పాటు నరేంద్ర నాథ్ అనే కొత్త డైరెక్టర్ తో ‘మిస్ ఇండియా’.. అమిత్ శర్మ దర్శకత్వంలో ‘మైదాన్’ సినిమాలో నటిస్తుంది. ‘మహానటి’ సినిమాతో విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకుంది కీర్తి సురేష్.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: