సోనాలీ నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ , అమిగో క్రియేషన్స్ బ్యానర్స్ పై ఫీల్ గుడ్ మూవీస్ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య , సాయి పల్లవి జంటగా రొమాంటిక్ ఎంటర్ టైనర్ “లవ్ స్టోరీ “మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. పోసాని , రావు రమేష్ , దేవయాని ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఈ మూవీ కి పవన్ సి హెచ్ సంగీతం అందించారు. కొంత షూటింగ్ పార్ట్ బ్యాలెన్స్ ఉండగా కరోనా కారణంగా షూటింగ్ నిలిచిపోయింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“లవ్ స్టోరీ “మూవీ షూటింగ్ ఈ రోజు పునః ప్రారంభం అయ్యింది. కొవిడ్ -19 పరిస్థితులకు అనుగుణంగా కొన్ని నిబంధనలతో షూటింగ్ కొనసాగుతుంది. 15 మంది టీమ్ మెంబర్స్ , నటీ నటులు , టీమ్ మెంబర్స్ ఆయా రోజు షూటింగ్ ముగిసేవరకూ సెట్ విడిచి వెళ్ళకూడదు , సోషల్ డిస్టెన్స్ , మాస్క్ లు ధరించడం , స్క్రీనింగ్ టెస్ట్ లు చేయడం , రాష్ట్ర ప్రభుత్వం గైడ్ లైన్స్ తో సింగిల్ షెడ్యూల్ లో షూటింగ్ కంప్లీట్ చేయడానికై చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. బ్లాక్ బస్టర్ “ఫిదా “మూవీ తరువాత దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న “లవ్ స్టోరీ “మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: