కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Latest Tollywood News

ట్యాగ్ · 4439 కథనాలు · పేజీ 138

సినిమా వార్తలు

అన్నాత్తే.. 'రజినీ' కి విలన్ గా..!

శివ దర్శకత్వంలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా అన్నాత్తే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ ముందే ఈ సినిమా షూటింగ్ చాలావరకు పూర్తయింది. అయితే ఇంకా కొంత భాగం షూటింగ్ మిగిలివుంది. మిగిలిన భాగాన్ని కూడా పూర్తి చేస్తే ఓ పని అయిపోద్దని భావిస్తున్నారట చిత్రయూనిట్. దీనిలో భాగంగానే త్వరలోనే షూట్ ను ప్రారంభించడానికి ప్లాన్ చేస్తున్నారు.

TFN Adminవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

మీతో షూటింగ్ కోసం ఎదురుచూస్తున్నా..!

ప్రస్తుతం వరుణ్ నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో వరుణ్ బాక్సర్ గా నటించనున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలైన సంగతి తెలిసిందే. అయితే లాక్ డౌన్ వల్ల షూటింగ్ కు బ్రేక్ పడింది. ఇదిలా ఉండగా ఈ సినిమాలో క‌న్నడ స్టార్ హీరో ఉపేంద్ర కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు.

TFN Adminవాట్సాప్
ఫస్ట్ లుక్

'గమనం' నుండి నిత్యామీనన్ ఫస్ట్ లుక్ రిలీజ్

సుజ‌నా రావు దర్శకత్వంలో శ్రియ ప్ర‌ధాన పాత్ర‌లో వస్తున్న సినిమా ‘గ‌మ‌నం’. చాలా గ్యాప్ తర్వాత శ్రియ ఈ సినిమాతో రీఎంట్రీ ఇవ్వబోతుంది. ఇక రీసెంట్ గానే శ్రియ పుట్టిన‌రోజు సందర్భంగా ఈ సినిమా నుండి శ్రియ ఫ‌స్ట్ లుక్ ను విడుదల చేశారు. ఇక ఇప్పుడు ఈ సినిమాలో మరో కీలక పాత్రలో నటిస్తున్న నిత్యా మీనన్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో నటిస్తోన్న నిత్యామీనన్‌ లుక్‌ను హీరో శర్వానంద్‌ తన ట్విట్టర్‌ ద్వారా విడుదల చేశారు. నిత్యా శైలపుత్రీదేవి అనే శాస్త్రీయ సంగీత గాయని పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక నిత్యామీనన్‌ లుక్‌ అందరినీ ఆకట్టుకుంటోంది.

TFN Adminవాట్సాప్
Actor Sundeep Kishan Gives Update About His Latest Movies On Social Media
షూటింగ్ అప్‌డేట్

A1 ఎక్స్ ప్రెస్, వివాహ భోజనంబు షూటింగ్ అప్ డేట్స్

డెన్నిస్ జీవన్ కనుకొలను దర్శకత్వంలో సందీప్ కిషన్ A1 ఎక్స్ ప్రెస్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ ముందే చాలా వరకూ ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. కరోనా వల్ల ఇన్నిరోజులు షూట్ కు బ్రేక్ చెప్పాల్సి వచ్చింది. అయితే ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ను తిరిగి ప్రారంభించారు. సందీప్ కిషన్ కూడా కరోనా నిబంధనలు పాటిస్తూ కాస్త ధైర్యం చేసి షూటింగ్ లను మొదలు పెట్టాడు.

TFN Adminవాట్సాప్
ఫస్ట్ లుక్

మోదీ బయోపిక్ 'మ‌నో విరాగి' ఫస్ట్ లుక్ రిలీజ్

టాలీవుడ్..కోలీవుడ్..బాలీవుడ్ ఒక్క సినీ ఇండస్ట్రీ అని కాదు..అన్ని సినీ ఇండస్ట్రీల్లోనూ బయోపిక్ ల హవా సాగుతుంది. పొలిటికల్ నేపథ్యంలో తెలుగులో ఎన్టీఆర్ మహానాయకుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి తో పాటు మరికొంతమంది బయోపిక్ లు తెరకెక్కాయి.. రిలీజ్ కూడా అయ్యాయి. తమిళంలో జయలలిత బయోపిక్ కూడా రానుంది. ఇప్పుడు భారత ప్రధాని నరేంద్ర మోదీ జీవితం ఆధారంగా మరో బయోపిక్ తెరకెక్కుతుంది.

TFN Adminవాట్సాప్
ట్రైలర్ & టీజర్

స్పెషల్ డే రోజు కె.జి. ఎఫ్ 2 టీజర్..?

దేశవ్యాప్తంగా సినీ లవర్స్ ఎదురుచూస్తున్న సినిమాల్లో కె.జి. ఎఫ్ 2 సినిమా కూడా ఒకటని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమా కోసం ఎంతగా ఎదురుచూసారో.. అంత లేట్ అయింది. అయితే కావాలని లేట్ చేయలేదులెండి. కరోనా వల్ల సినిమా షూటింగ్ లు ఆగిపోవడం వల్ల ఈ సినిమా షూటింగ్ కు కూడా బ్రేక్ పడింది. మళ్లీ కొద్దిరోజుల క్రితమే షూటింగ్ ను మొదలు పెట్టారు.

TFN Adminవాట్సాప్
Director Krish Shares An Adorable Pic From Formal Meeting Of Tollywood Movie Directors
సినిమా వార్తలు

ఒకేచోట టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్

టాలీవుడ్ స్టార్ దర్శకులంతా ఒకే చోట కలిసి ఉండటం.. చిన్న పార్టీ చేసుకొని అందరూ కలిసీ తినడం చాలా అరుదుగా జరిగే విషయాలు. ఎప్పుడో ఏదైనా విషయం ఉంటే తప్పా కలుసుకునే అవకాశం ఉండదు. దానికి తోడు ఇప్పుడు కరోనా. కరోనా వల్ల ఎవరికి ఎంత నష్టం జరిగిందో తెలియదు కానీ... సినీ పరిశ్రమకు మాత్రం చాలా నష్టమే కలిగింది. షూటింగ్స్ ఆగిపోయాయి. థియేటర్స్ మూతపపడ్డాయి. ఒక పక్క సినీ సెలబ్రిటీస్ ఒకరి తర్వాత ఒకరు కరోనా బారిన పడుతున్నారు. ఒకరి నొకరు కలుసుకునే అవకాశం లేకుండా పోయింది. గత ఆరు నెలలుగా ఇళ్లకే పరిమితమవ్వగా.. ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఒక ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

TFN Adminవాట్సాప్
Naga Shaurya NS20 Movie Shooting Kickstarts.
షూటింగ్ అప్‌డేట్

#NS20 మూవీ షూటింగ్ ప్రారంభం

సోనాలి నారంగ్ సమర్పణ లో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ , నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై సంతోష్ జాగర్లమూడి దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా ప్రాచీన విలువిద్య నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామా " #NS20 "మూవీ షూటింగ్ నిన్న (బుధవారం ) హైదరాబాద్ లో ప్రారంభం అయ్యింది. ఈ మూవీ లో ఆర్చర్ గా నటిస్తున్న నాగశౌర్య కు జోడీగా "రొమాంటిక్ " మూవీ ఫేమ్ కేతిక శర్మ నటిస్తున్నారు. ఈ మూవీ లో తన క్యారెక్టర్ కై నాగశౌర్య సిక్స్ ప్యాక్ అబ్స్ ట్రై చేశారు.

Team TFNవాట్సాప్
Tollywood Actor Venkatesh Urges Everyone To Follow COVID19 Safety Measures Strictly To Stay Safe From Corona Virus
సినిమా వార్తలు

ప్ర‌తి ఒక్క‌రికీ ఇదే నా విజ్ఞ‌ప్తి అంటున్న వెంకీ

రోజులు గడుస్తూనే ఉన్నాయి కానీ కరోనా ప్రభావం మాత్రం ఏమాత్రం తగ్గలేదు. తగ్గలేదు సరికదా రోజు రోజుకు కేసులు ఎక్కువవుతున్నాయి తప్పా తగ్గే సూచనలు కనిపించట్లేదు. సామాన్యుల దగ్గరనుండి సెలబ్రిటీస్ వరకూ అందరూ కరోనా బారిన పడుతున్నారు. ఇక టాలీవుడ్ సెలబ్రిటీస్ కూడా చాలా మంది కరోనా బారిన పడ్డారు. ఈ నేపథ్యంలో ప్రజ‌లంతా అప్ర‌మ‌త్తంగా ఉండి..జాగ్ర‌త్త‌లు తీసుకోవాలంటున్నాడు విక్టరీ వెంకటేష్.

TFN Adminవాట్సాప్
Bollywood Actor Sonu Sood Spreads The Message Of Giving Back To Society With His Philanthropic Activities
సినిమా వార్తలు

సమాజానికి ఎంతో కొంత ఇవ్వాలి..!

రీల్ లైఫ్ లో విలన్ పాత్రల్లో నటించినా రియల్ లైఫ్ లో మాత్రం హీరో అనిపించుకుంటున్నాడు సోనూ సూద్. ఎన్నో ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీలో ఉన్నా.. ఎన్నో మంచి మంచి సినిమాలు చేసినా కూడా రాని గుర్తింపు ఒక్కసారిగా కరోనా తెచ్చిపెట్టింది సోనూ సూద్ కి. తనలోని మరో మనిషిని బయటి ప్రపంచానికి చూపించాడు సోనూ సూద్. లాక్‌డౌన్ ముందు వరకు సోనూసూద్‌ను మాములు నటుడిగానే చూసారు చాలా మంది. లాక్‌డౌన్ లో ఎంతో మందిని ఆదుకొని దేవుడయ్యాడు. ఇక సోనూ సూద్ ఈ లాక్ డౌన్ లో చేసిన మంచి పనులు గురించి చెప్పాలంటే పెద్ద లిస్టే వస్తుంది. ఇప్పుడు కూడా ఎంతో మందికి సహాయం చేస్తున్నాడు. స్టార్‌లే ఆశ్చర్యపోయే రీతిలో సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు.

TFN Adminవాట్సాప్
Rebel Star Prabhas Is A Highly Committed Person Says Radhe Shyam Director Radhakrishna Kumar
సినిమా వార్తలు

ప్రభాస్ కమిట్ మెంట్ లెవల్స్ పీక్స్

'జిల్' ఫేమ్ రాధా కృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ ప్రధాన పాత్రలో రాధే శ్యామ్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. 1970 బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడిక‌ల్ ల‌వ్‌స్టోరీగా ఈ సినిమా రూపుదిద్దుకుంటుంది. ఇక ఈ సినిమా షూటింగ్ కూడా త్వరలోనే ప్రారంభించనున్నారు చిత్రయూనిట్. ఇప్పటికే ఈ సినిమా నుండి టైటిల్ ను, ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా.. సోషల్ మీడియాలో ఎన్ని కొత్త రికార్డ్స్ క్రియేట్ చేసిందో చెప్పనక్కర్లేదు. 6.3 మిలియన్ల ట్వీట్స్ తో ఇంతకు ముందున్న ట్విట్టర్ రికార్డులను చెరిపేసింది.

TFN Adminవాట్సాప్
When Vijay Deverakonda Visited The Pre Release Event Of His Favorite Actor Super Mahesh Babu Movie Maharshi
సినిమా వార్తలు

అభిమాన హీరో సినిమాకే గెస్ట్ గా వచ్చిన వేళ

విజయ్ దేవరకొండ.. టాలీవుడ్ లో యూత్ లో మంచి క్రేజ్ ఉన్న హీరో అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో ఎక్కడో కనిపించీ కనిపించని చిన్నపాత్రలో నటించి... ఆ తరువాత ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో నాని ఫ్రెండ్ గా కనిపించి కొంచెం నోటెడ్ అయ్యాడు. ఇక ఆ తరువాత వచ్చిన పెళ్లి చూపులు సినిమాతో మంచి హిట్ కొట్టి అందరి కంట్లో పడ్డాడు. పెళ్లి చూపులు సినిమా తరువాత అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ టాక్ ఆఫ్ ద టౌన్ అయ్యాడు. యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు.

TFN Adminవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

'సూపర్ మచ్చి' ఆఖరి షెడ్యూల్ ప్రారంభం

విజేత చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్. ఇదిలా ఉండగా ఇక ఇప్పుడు మరో డిఫరెంట్ సినిమాతో వస్తున్నాడు దేవ్. పులి వాసు దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమాను తెలుగుతో పాటు కన్నడలో కూడా రిలీజ్ చేయనున్నారు. తెలుగులో 'సూపర్ మచ్చి' అనే టైటిల్ తో తెరకెక్కుతుండగా.. కన్నడలో ‘మీనాక్షి’ అనే టైటిల్‌ తో వస్తుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

నాన్న ఆరోగ్యం మెరుగుపడుతుంది - ఎస్పీ చరణ్

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం రోజు రోజుకు మెరుగుపడుతుంది. ఆయన అభిమానులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు చేసిన ప్రార్ధనలు ఫలిస్తున్నాయి. ఇక బాలు హెల్త్ అప్ డేట్స్ గురించి తనయుడు చరణ్ ఎప్పటికప్పుడు అప్ డేట్ ఇస్తూనే ఉన్నాడు. తాజాగా మరో అప్ డేట్ ఇచ్చారు. ప్ర‌స్తుతం త‌న తండ్రి ఆరోగ్యం నిల‌క‌డ‌గానే ఉన్న‌ద‌ని ఎస్పీ చ‌ర‌ణ్ తెలిపారు. తన తండ్రి ఈసీఎంవో సపోర్టుతో ఉన్నారని.. ఫిజియోథెరపీలో చురుకుగా పాల్గొంటున్నారని ఎస్పీ చ‌ర‌ణ్‌ పేర్కొన్నారు. తన తండ్రి త్వరగా కోలుకోవడం కోసం శ్ర‌మించిన ఆస్ప‌త్రి వైద్యుల‌కు, ఆయన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

డైరెక్షన్ పై నిఖిల్ క్లారిటీ - ఇప్పుడే డైరెక్ట్ చేయను

హీరో నిఖిల్ డైరెక్టర్ గా మారబోతున్నాడని.. ఒక ఎక్స్పెరిమెంటల్ చిల్డ్రన్ సినిమాను డైరెక్ట్ చేయనున్నాడని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. అయితే ఇప్పుడు ఆవార్తలపై స్పందించిన నిఖిల్ తన డైరెక్షన్ పై క్లారిటీ ఇచ్చాడు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

కుక్క పిల్లలను రక్షించిన ఆది పినిశెట్టి

కేవలం హీరోగా మాత్రమే కాదు విలన్ గా.. మరోపక్క సపోర్టింగ్ రోల్స్ లో నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు ఆది పినిశెట్టి. తను ప్రతి సినిమాకు ఓ విభిన్నత ఉండేలా చూసుకుంటాడు ఆది. అందుకే అటు తమిళ్ లోనూ ఇటు తెలుగులోనూ మంచి రోల్స్ చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇక ఇదిలా ఉండగా ఆది పినిశెట్టికి సంబంధించిన ఒక వీడియో మాత్రం సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. అదేంటంటే ఓ రెస్క్యూ ఆపరేషన్ చేశాడు ఆది. ఇంతకీ ఎవర్ని రక్షించాడనుకుంటున్నారా ? అసలు సంగతేంటో తెలియాలంటే స్టోరీ లోకి వెళ్లాల్సిందే.

TFN Adminవాట్సాప్
సాంగ్

సాంగ్ చిత్రీకరణలో "లవ్ స్టోరీ "

నేషనల్ అవార్డ్ విన్నర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య , సాయి పల్లవి జంటగా రొమాంటిక్ ఎంటర్ టైనర్ "లవ్ స్టోరీ " మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. రావు రమేష్ , పోసాని , దేవయాని ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఈ మూవీ లో నాగచైతన్య , సాయి పల్లవి తెలంగాణ స్లాంగ్ లో డైలాగ్స్ చెప్పడం విశేషం. పవన్ CH సంగీతం అందిస్తున్నారు. "లవ్ స్టోరీ " మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉండగా కరోనా కారణంగా షూటింగ్ నిలిచిపోయింది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ప్రభాస్ కు బ్రదర్ గా అథర్వా మురళి..?

విభిన్నమైన పాత్రలతో తమిళ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో అథర్వా మురళి. ఈ మధ్య విడుదలైన వరుణ్‌తేజ్‌ ‘గద్దలకొండ గణేష్‌’ చిత్రంలో కీలక పాత్ర చేసి ఇక్కడ కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇక తమిళ్ సినిమాల్లో చేస్తూనే తెలుగులో కూడా అవకాశాలు కొట్టేస్తున్నాడు. దీనిలో భాగంగానే ఇప్పుడు ఈ యంగ్ హీరో మరో బంపర్ ఆఫర్ కొట్టేసినట్టు తెలుస్తుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

వాటర్ ఫాల్స్ దగ్గర చై- సాయి పల్లవి 'లవ్ స్టోరీ'

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైత‌న్య, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో 'ల‌వ్ స్టోరీ' అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. షూటింగ్ చివరి దశలో ఉండగా.. కరోనా వల్ల షూటింగ్ కు బ్రేక్ పడింది. ఈ సినిమా ఇప్పటికే చాల వరకు షూటింగ్ ను పూర్త చేసుకుంది. అయితే ఇప్పుడు మళ్లీ ఈ సినిమా షూటింగ్ ను మొదలు పెట్టారు చిత్రయూనిట్. చక చక ఈ షూటింగ్ ను పూర్తి చేస్తున్నాడు దర్శకుడు శేఖర్ కమ్ముల. ఇక తాజాగా ఈ సినిమా షూటింగ్ రంగారెడ్డి జిల్లా మంచాల మండలం చెన్నారెడ్డిగూడ - బోడకొండ వాటర్ ఫాల్ దగ్గర చిత్రీకరణ జరుపుతున్నట్టు తెలుస్తుంది. చుట్టూ పచ్చటిప్రకృతిసౌందర్య ఆకట్టుకునే ఈ వాటర్ ఫాల్స్ దగ్గర చిత్రయూనిట్ సందడి చేసినట్టు…

TFN Adminవాట్సాప్
Victory Venkatesh Evergreen Classic Bobbili Raja Completes 30 Years.
సినిమా వార్తలు

30 వసంతాల "బొబ్బిలి రాజా "

సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బి గోపాల్ దర్శకత్వంలో వెంకటేష్ , దివ్య భారతి జంటగా రూపొందిన రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ "బొబ్బిలి రాజా" మూవీ 1990 సంవత్సరం సెప్టెంబర్ 14 వ తేదీ రిలీజ్ అయ్యి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇళయ రాజా స్వరకల్పన లో సాంగ్స్ ప్రేక్షకుల వీనుల విందు చేశాయి. "బొబ్బిలి రాజా" మూవీ లోని వెంకటేష్ డైలాగ్ "అయ్యో అయ్యో అయ్యయ్యో " పాపులర్ అయ్యి ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది.

Team TFNవాట్సాప్

షేర్