
ట్యాగ్ · 4439 కథనాలు · పేజీ 137

నితిన్ 'రంగ్ దే' షూటింగ్ కూడా షురూ
'V' టీమ్ రౌండ్ టేబుల్ డిస్కషన్
నో డౌట్.. థియేటర్ లోనే 'విరాట పర్వం'

డైరెక్టర్ మణి"రత్నం" గీతాంజలి
బ్యాక్ టు వర్క్ - మళ్లీ అడవుల్లోకి రకుల్
స్పోర్ట్స్ నేపథ్య మూవీ లో నాగచైతన్య
మాయాబజార్ 'సీత' కన్నుమూత
'ప్రభాస్ 21' కు మెంటర్ గా సింగీతం శ్రీనివాసరావు
'మూగ అమ్మాయిగా' సమంత..?
హ్యాపీ బర్త్ డే హీరో.. నాకు పోటి ఇచ్చేది ఇతనే
"రంగ్ దే !" మూవీ లో కీలక పాత్రలో వినీత్
బాలీవుడ్ భారీ బడ్జెట్ మూవీ లో షాలిని పాండే
"మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ " మూవీ రిలీజ్ డేట్
నేచర్ ను ఎంజాయ్ చేస్తున్న న్యాచురల్ బ్యూటీ

‘బ్లాక్ రోజ్’ ఫస్ట్‌లుక్ రిలీజ్
బాలీవుడ్ అందాల తార ఊర్వశి రౌటేలా టాలీవుడ్ లోకి 'బ్లాక్ రోస్' అనే సినిమాతో ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. మోహన్ భరద్వాజ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమాలో ఊర్వశి రౌటేలా లీడ్ రోల్ లో నటిస్తోంది. ఇక ఈ సినిమా షూటింగ్ కూడా మొదలు పెట్టేసారు.గత నెలలో సెట్స్ పైకి వెళ్లిన ఈ సినిమా నిర్విరామంగా షూటింగ్ జరుపుకుంటుంది. కరోనా నేపథ్యంలో అన్ని జాగ్రత్తలూ తీసుకుంటూ షూటింగ్ చేస్తోంది చిత్ర యూనిట్. ఒకే షెడ్యూల్‌లో షూటింగ్ పూర్తి చేయాలని భావిస్తోంది. ఇదిలా ఉండగా ఈ రోజు ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. సంపత్ నంది తన ట్విట్టర్ లో ఫస్ట్ లుక్ పోస్టర్ ను పోస్ట్ చేసాడు.
నితిన్ 'రంగ్ దే' షూటింగ్ కూడా షురూ
మొత్తానికి టాలీవుడ్ కు ఇప్పుడిప్పుడే పాత రోజులు వస్తున్నాయి. షూటింగ్‌లను స్టార్ట్ చేసి మళ్లీ కళకళాడుతోంది టాలీవుడ్. షూటింగ్ బ్యాలెన్స్ ఉండటంతో చకచకా వచ్చి పూర్తి చేసుకుందామనే ఆలోచనలో పడ్డాయి. దీనిలో భాగంగానే ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు షూటింగ్ ను మొదలు పెట్టారు...షూటింగ్ ను పూర్తి చేసుకున్నారు కూడా. మరికొంతమంది ఇప్పుడిప్పుడే షూటింగ్ లను మొదలుపెడుతున్నారు.
'V' టీమ్ రౌండ్ టేబుల్ డిస్కషన్
ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘వి’ సినిమా సెప్టెంబర్ 5న అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన సంగతి తెలిసిందే. మంచి కథతో పాటు.. యాక్షన్ సీక్వెన్స్ ను మంచిగా బ్యాలన్స్ చేసిన సినిమా ఇది అని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాకు మంచి ప్రశంసలు దక్కిన సంగతి కూడా విదితమే. నాని 25 సినిమా కావడం అందులో నెగిటివ్ షేడ్ అవ్వడంతో సినిమాపై అంచనాలు బానే ఉన్నాయి. ఆ అంచనాలను కూడా సినిమా రీచ్ అయిందనే చెప్పొచ్చు. ఇక సినిమాలో సిన్సియర్ పోలీస్ ఆఫీసర్‌గా సుధీర్ నటన చాలా బావుంది. ఇక లుక్ పరంగా సుధీర్ పడ్డ కష్టాన్ని డైరెక్టర్ తొలి ఫైట్‌తో తెరపై ఆవిష్కరించాడుఇంద్రగంటి. ఇక సినిమాలో నాని లవర్ అదితి రావు హైదరి.. సుధీర్…
నో డౌట్.. థియేటర్ లోనే 'విరాట పర్వం'
థియేటర్స్ లేకపోవడంతో చిన్నగా ఓటీటీ వైపు మొగ్గు చూపుతున్నారు దర్శకనిర్మాతలు. పెద్ద సినిమాలు అంటే ఎలాగూ థియేటర్ లోనే రిలీజ్ కావాలి.. ఉదాహరణకి ఒక ఆర్ఆర్ఆర్, ఒక కె.జి.యఫ్ లాంటి సినిమాల కోసం ప్రేక్షకులు ఎన్ని రోజులైనా వెయిట్ చేస్తారు. థియేటర్స్ ఓపెన్ అయ్యేంత వరకూ వెయిట్ చేస్తారు.. అసలు ఆసినిమాలు ఓటీటీ రిలీజ్ చేస్తామన్నా ముందు ప్రేక్షకులే ఒప్పుకోరు. కానీ చిన్న సినిమాలు .. ఒక మోస్తరు బడ్జెట్ సినిమాల పరిస్థితి వేరు. అందుకే చిన్న సినిమాలు అయితే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఓటీటీ రిలీజ్ అయిపోతున్నాయి. ఇప్పుడిప్పుడే కాస్త పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. పెంగ్విన్ అయింది.. ఇటీవల 'వి' సినిమా అయింది…

డైరెక్టర్ మణి"రత్నం" గీతాంజలి
సి ఎల్ నరసారెడ్డి సమర్పణ లో భాగ్యలక్ష్మి ఎంటర్ ప్రైజెస్ బ్యానర్ పై మణిరత్నం దర్శకత్వంలో అక్కినేని నాగార్జున హీరోగా రూపొందిన రొమాంటిక్ ఎంటర్ టైనర్ "గీతాంజలి " మూవీ ఘనవిజయం సాధించింది. గిరిజ కథానాయిక. ఇళయరాజా స్వరకల్పనలో సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. బెస్ట్ డైరెక్టర్ గా మణిరత్నం ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. "గీతాంజలి " మూవీ వివిధ విభాగాలలో 6 నంది అవార్డ్స్ అందుకుంది.
‘ఒరేయ్ బుజ్జిగా` కృష్ణవేణి వీడియో సాంగ్ రిలీజ్
విజయ్‌కుమార్ దర్శకత్వంలో యంగ్ హీరో రాజ్ తరుణ్ కథానాయకుడిగా 'ఒరేయ్.. బుజ్జిగా' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. నిజానికి ఈ సినిమా మార్చి లోనే రిలీజ్ కావాల్సి ఉంది కానీ కరోనా వల్ల ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఇక థియేటర్స్ కూడా ఇప్పుడప్పుడే తెరుచుకునే పరిస్థితి లేదు కాబట్టి ఓటీటీ లో రిలీజ్ చేస్తున్నారు. ఆహా లో అక్టోబర్ 2వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుంది. శ్రీమతి లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో శ్రీసత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె.కె.రాధామోహన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
బ్యాక్ టు వర్క్ - మళ్లీ అడవుల్లోకి రకుల్
రకుల్ ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మెగా హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ కూడా వెంటనే మొదలైపోయింది. సింగల్ షెడ్యూల్ లోనే ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేయాలని ప్లాన్ చేశారు. ప్లాన్ ప్రకారమే గత కొద్దిరోజులుగా వికారాబాద్ అడవుల్లో షూటింగ్ ను మొదలు పెట్టారు. ఇక ఈ సినిమాలో ఒక పల్లెటూరి అమ్మాయిలా రకుల్ నటిస్తున్నట్టు ఇటీవలే బయటకు వచ్చిన ఫొటోలను బట్టి అర్థమవుతూనే వుంది.
స్పోర్ట్స్ నేపథ్య మూవీ లో నాగచైతన్య
హీరో నాగచైతన్య ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ "లవ్ స్టోరీ " మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. "లవ్ స్టోరీ " మూవీ తరువాత హీరో నాగచైతన్య విక్రమ్ K కుమార్ దర్శకత్వంలో "థ్యాంక్యూ " మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది.
మాయాబజార్ 'సీత' కన్నుమూత
టాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. ఇప్పటికే ఎంతో మంది లెజెండ్రీ నటీనటులను కోల్పోగా ఇప్పుడు అలనాటి హీరో నాగభూషణం సతీమణి.. మాయాబజార్ సీత కన్నుమూశారు. వయసు రీత్యా వచ్చిన అనారోగ్య సమస్యలతో గత కోద్దిరోజులుగా బాధపడుతున్న ఆమె నేడు హైదరాబాద్ లో కన్ను మూసారు. ఇక సీతమ్మ మృతికి చిత్ర ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఆమె కుటుంబానికి ప్రఘాడ సానుభూతి తెలియజేశారు. నేడు హైదరాబాద్ మహాప్రస్థానం శ్మశానవాటికలో బంధువులు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
'మాయాబజార్' లో సినిమాటోగ్రాఫర్ మార్కస్ బార్ట్లే 'మాయ'
మాయాబజార్ సినిమా... తెలుగు సినీ చరిత్రలోనే ఇదొక అద్భుత కావ్యం. ఈ సినిమా విడుదలై ఆరు దశాబ్దాలు దాటినా ఇప్పటి తరానికి కూడా ఈ సినిమా పరిచయమే. ఆ తరం నుండి ఈ తరం వరకూ ప్రతి సినీ ప్రేక్షకుడు నచ్చిన.. మెచ్చిన సినిమా ఇది. కె.వి రెడ్డి దర్శకత్వంలో ఎన్టీఆర్, ఎస్వీఆర్, ఏఎన్నార్, సావిత్రి, గుమ్మడి వంటి హేమాహేమీలు నటించిన ఈ భారీ చిత్రం తెలుగు సినిమా చరిత్రలోనే ఒక ఆణిముత్యం. శశిరేఖ అనే పాత్రను సష్టించి దాని చుట్టూ అల్లిన కథ ఇది. దుస్తుల దగ్గరనుండి మేకప్ వరకూ ప్రతి విషయాన్ని ఎంతో కూలంకషంగా పరిశీలించి.. ప్రతి చిన్న విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకొని చేశారు కాబట్టే ఈ సినిమా ఇప్పటికీ గుర్తుండిపోతుంది.

'నేచురల్ యాక్ట్రెస్' కు హ్యాపీ బర్త్ డే
సుకుమార్ శిష్యుడు బుచ్చి బాబు సాన దర్శకత్వంలో సాయి తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమా ఉప్పెన. నిజానికి ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉంది. కానీ కరోనా వల్ల రిలీజ్ కాస్త వాయిదా పడింది. ఉప్పెన నుంచి ఇప్పటికే విడుదల చేసిన పాటలు మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి.
హీరో రవితేజ మూవీ లో కేథరీన్ స్పెషల్ సాంగ్ ?
దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ , శృతి హాసన్ జంటగా వాస్తవ సంఘటనలతో యాక్షన్ ఎంటర్ టైనర్ "క్రాక్ " మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. హీరో రవితేజ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న "క్రాక్ " మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది. ఈ మూవీ తరువాత రవితేజ హీరోగా సూపర్ హిట్ "రాక్షసుడు " మూవీ ఫేమ్ రమేష్ వర్మ దర్శకత్వంలో కోనేరు సత్యనారాయణ నిర్మాతగా ఒక మూవీ తెరకెక్కనుంది.
'ప్రభాస్ 21' కు మెంటర్ గా సింగీతం శ్రీనివాసరావు
నాగ్ అశ్విన్ తో ప్రభాస్ 21 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అత్యంత భారీ బడ్జెట్‌తో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై ప్రభాస్ రేంజ్‌కి తగ్గట్టుగా నిర్మాత అశ్వినీదత్ ఈ చిత్రాన్ని పాన్ వరల్డ్ రేంజ్ లో భారీ బడ్జెట్‌తో రూపొందించనున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ హీరోయిన్ గా దీపికా పదుకొనె నటిస్తుంది.
'మూగ అమ్మాయిగా' సమంత..?
గేమ్ ఓవర్ ఫేమ్ అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో సమంత సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. నిజానికి ఈ సినిమా మార్చిలోనే సెట్స్ పైకి వెళ్ళాలి కానీ లాక్ డౌన్ వల్ల వెళ్ళలేదు. హర్రర్, థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సమంత పాత్ర పై ఇప్పుడొక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి చక్కర్లు కొడుతుంది.
హ్యాపీ బర్త్ డే హీరో.. నాకు పోటి ఇచ్చేది ఇతనే
సోనూసూద్.. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ పేరు తెలియని వారు ఎవరున్నారు. సినిమాల వల్ల కొంతమందికే తెలిసినా.. కరోనా వల్ల సోనూసూద్ పేరు అందరికీ పరిచయమైంది. ఈ పరిస్థితుల్లో ఎందరినో ఆదుకున్నారు. ముఖ్యంగా వలస కార్మికులకు, విదేశాలలో ఉండిపోయిన భారతీయుల కోసం ఆయన అనేక సేవలు చేసారు. అంతేకాదు కష్టంలో ఉన్నామని ట్వీట్స్ చేసిన వారిని కూడా సోనూ తనదైన తరహాలో ఆదుకున్నాడు... ఆదుకుంటూనే వున్నాడు.
"రంగ్ దే !" మూవీ లో కీలక పాత్రలో వినీత్
క్లాసికల్ డ్యాన్సర్ , వాయిస్ ఆర్టిస్ట్ వినీత్ పలు తమిళ , మలయాళ మూవీస్ లో నటించి ప్రేక్షకులను అలరించారు. కన్నడ , హిందీ భాషలలో నటించిన వినీత్ తెలుగు లో కొన్ని సినిమాలలో హీరోగా నటించారు. బ్లాక్ బస్టర్ "ప్రేమ దేశం ", "చంద్ర ముఖి " మూవీస్ లో వినీత్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. లాక్ డౌన్ లో డ్యాన్సింగ్ ఎక్సర్ సైజ్ లతో ఫిట్ నెస్ మెయింటైన్ చేస్తూ వినీత్ తన స్టూడెంట్స్ కు ఆన్ లైన్ లో డ్యాన్స్ క్లాసెస్ నిర్వ హిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ లో వినీత్ పాల్గొంటున్నారు.
బాలీవుడ్ భారీ బడ్జెట్ మూవీ లో షాలిని పాండే
థియేటర్ ఆర్టిస్ట్ షాలిని పాండే బ్లాక్ బస్టర్ "అర్జున్ రెడ్డి " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. ఆ మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి షాలిని ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. సూపర్ హిట్ "మహానటి ", "118 " మూవీస్ తో షాలిని ప్రేక్షకులను అలరించారు. "100%కాదల్ " మూవీ తో షాలిని కోలీవుడ్ లో అడుగుపెట్టారు. షాలిని పాండే కీలక పాత్రలో నటించిన "నిశ్శబ్దం " మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. షాలిని ఇప్పడు భారీ బడ్జెట్ మూవీ తో బాలీవుడ్ కు హీరోయిన్ గా పరిచయం అవుతున్నారు.
"మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ " మూవీ రిలీజ్ డేట్
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో GA 2 పిక్చర్స్ బ్యానర్ పై బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ అక్కినేని , పూజాహెగ్డే జంటగా రొమాంటిక్ ఎంటర్ టైనర్ "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ " మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఆమని , మురళీశర్మ , వెన్నెల కిషోర్ , ఈషా రెబ్బా ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. గోపిసుందర్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
నేచర్ ను ఎంజాయ్ చేస్తున్న న్యాచురల్ బ్యూటీ
ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది సాయి పల్లవి. చేసింది తక్కువ సినిమాలే అయినా మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇక సాయి పల్లవి ఎంత సింపుల్ గా ఉంటుందో కూడా ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అంత స్టార్ డమ్ ఉన్నా కూడా చాలా సింపుల్ గా ఉంటుంది. అంతే కాదు ప్రకృతి అంటే కూడా తనకు ఎంత ఇష్టమో ఎన్నో సందర్భాల్లో చూసాం కూడా. ఇప్పుడు తాజాగా మరోసారి ప్రకృతిని ఎంజాయ్ చేస్తున్న ఫొటో ఒకటి సాయి పల్లవి తన ఇన్స్టా ద్వారా పోస్ట్ చేసింది.
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ - వర్క్ మోడ్ లోకి అఖిల్
అఖిల్ ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్` సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ ముందే ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి చేసుకుంది. అయితే కరోనా వల్ల షూట్ కు బ్రేక్ పడింది. ఇక రీసెంట్ గానే ఈ సినిమా షూటింగ్ ను స్టార్ట్ చేశారు. ఇన్ని రోజులు పూజా హెగ్డే షూటింగ్ లో పాల్గొనగా.. ఇప్పుడు అఖిల్ కూడా షూటింగ్ లో పాల్గొన్నాడు. సెట్స్ లో ఉన్న ఫొటో ను పోస్ట్ చేస్తూ ఇక ఈ విషయాన్ని తన ఇన్స్టా ద్వారా తెలిపాడు అఖిల్.