శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో ‘లవ్ స్టోరీ’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. షూటింగ్ చివరి దశలో ఉండగా.. కరోనా వల్ల షూటింగ్ కు బ్రేక్ పడింది. ఈ సినిమా ఇప్పటికే చాల వరకు షూటింగ్ ను పూర్త చేసుకుంది. అయితే ఇప్పుడు మళ్లీ ఈ సినిమా షూటింగ్ ను మొదలు పెట్టారు చిత్రయూనిట్. చక చక ఈ షూటింగ్ ను పూర్తి చేస్తున్నాడు దర్శకుడు శేఖర్ కమ్ముల. ఇక తాజాగా ఈ సినిమా షూటింగ్ రంగారెడ్డి జిల్లా మంచాల మండలం చెన్నారెడ్డిగూడ – బోడకొండ వాటర్ ఫాల్ దగ్గర చిత్రీకరణ జరుపుతున్నట్టు తెలుస్తుంది. చుట్టూ పచ్చటిప్రకృతిసౌందర్య ఆకట్టుకునే ఈ వాటర్ ఫాల్స్ దగ్గర చిత్రయూనిట్ సందడి చేసినట్టు సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా శ్రీ వెంకటేశ్వర సినిమాస్, అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్స్ పై నిర్మిస్తున్న ఈ సినిమాలో ఇంకా రాజీవ్ కనకాల, ఈశ్వరీరావు, దేవయాని ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. పవన్ సంగీతం అందిస్తున్నాడు. మరి బ్లాక్ బస్టర్ “ఫిదా” మూవీ తరువాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ఇది. అంతేకాదు ఫిదాలో సాయి పల్లవితో మ్యాజిక్ క్రియేట్ చేసాడు శేఖర్ కమ్ముల. ఇప్పుడు మరోసారి మ్యాజిక్ క్రియేట్ చేసేందుకు వచ్చేస్తున్నాడు. చూద్దాం మరి నాగ చైతన్య-సాయి పల్లవిల ‘ లవ్ స్టోరీ’ ఎలా ఉంటుందో…
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: