విభిన్నమైన పాత్రలతో తమిళ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో అథర్వా మురళి. ఈ మధ్య విడుదలైన వరుణ్‌తేజ్ ‘గద్దలకొండ గణేష్’ చిత్రంలో కీలక పాత్ర చేసి ఇక్కడ కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇక తమిళ్ సినిమాల్లో చేస్తూనే తెలుగులో కూడా అవకాశాలు కొట్టేస్తున్నాడు. దీనిలో భాగంగానే ఇప్పుడు ఈ యంగ్ హీరో మరో బంపర్ ఆఫర్ కొట్టేసినట్టు తెలుస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
రాధా కృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న పీరియాడికల్ ప్రేమకథా చిత్రం ‘రాధేశ్యామ్’. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. గోపీకృష్ణా మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్పటికే యూరప్ లో కొద్దిరోజులు షూటింగ్ ను కూడా జరుపుకుంది. ఇక ఈ సినిమాలో అథర్వా మురళిని అనుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. అది కూడా ప్రభాస్ కు బ్రదర్ పాత్రలో అథర్వా మురళిని అనుకుంటున్నారట. అతని పాత్ర కీలకంగా ఉంటుందట. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే క్లారిటీ ఇచ్చేంతవరకూ ఆగాల్సిందే.
కాగా ఇన్ని రోజులు కరోనా వల్ల షూట్ కు బ్రేక్ పడగా.. తిరిగి షూటింగ్ ను స్టార్ట్ చేయాలని చూస్తున్నారు చిత్ర యూనిట్. ఈ నెల చివర్లో ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో మళ్లీ ప్రారంభం కానుంది. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో పాన్ ఇండియా సినిమాగా భారీ బడ్జెట్ తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: