ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం రోజు రోజుకు మెరుగుపడుతుంది. ఆయన అభిమానులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు చేసిన ప్రార్ధనలు ఫలిస్తున్నాయి. ఇక బాలు హెల్త్ అప్ డేట్స్ గురించి తనయుడు చరణ్ ఎప్పటికప్పుడు అప్ డేట్ ఇస్తూనే ఉన్నాడు. తాజాగా మరో అప్ డేట్ ఇచ్చారు. ప్రస్తుతం తన తండ్రి ఆరోగ్యం నిలకడగానే ఉన్నదని ఎస్పీ చరణ్ తెలిపారు. తన తండ్రి ఈసీఎంవో సపోర్టుతో ఉన్నారని.. ఫిజియోథెరపీలో చురుకుగా పాల్గొంటున్నారని ఎస్పీ చరణ్ పేర్కొన్నారు. తన తండ్రి త్వరగా కోలుకోవడం కోసం శ్రమించిన ఆస్పత్రి వైద్యులకు, ఆయన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఆగష్ట్ 5న కరోనా వైరస్ బారిన పడిన బాలు అప్పటినుండి చెన్నై హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. కరోనా పాజిటివ్ వచ్చిన తర్వాత ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్ పెరగటంతో అప్పట్లో ఆయన ఆరోగ్యం క్షీణించింది. దాంతో అప్పటి నుంచి ఆయన ఎక్మో సపోర్టుతో చికిత్స తీసుకుంటున్నారు. ఇక రీసెంట్ గానే కరోనా పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ వచ్చింది. అప్పటినుండి బాలు ఆరోగ్యం మెరుగుపడుతూ వస్తుంది.
మరి త్వరలోనే బాలు పూర్తి ఆరోగ్యంతో తిరిగిరావాలని.. ఇంకా ఎన్నో పాటలు పాడి అభిమానులను అలరించాలని కోరుకుందాం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: