30 వసంతాల “బొబ్బిలి రాజా “

Victory Venkatesh Evergreen Classic Bobbili Raja Completes 30 Years.

సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బి గోపాల్ దర్శకత్వంలో వెంకటేష్ , దివ్య భారతి జంటగా రూపొందిన రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ “బొబ్బిలి రాజా” మూవీ 1990 సంవత్సరం సెప్టెంబర్ 14 వ తేదీ రిలీజ్ అయ్యి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇళయ రాజా స్వరకల్పన లో సాంగ్స్ ప్రేక్షకుల వీనుల విందు చేశాయి. “బొబ్బిలి రాజా” మూవీ లోని వెంకటేష్ డైలాగ్
“అయ్యో అయ్యో అయ్యయ్యో ” పాపులర్ అయ్యి ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తమిళ సూపర్ స్టార్ కమల్ హాసన్ క్లాప్ తో ప్రారంభమయిన “బొబ్బిలి రాజా” మూవీ దిగ్విజయంగా 30 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది. హీరో వెంకటేష్ సినీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ మూవీ గా నిలిచిన “బొబ్బిలి రాజా” మూవీ 3 సెంటర్స్ లో 175 రోజులు ప్రదర్శించబడి హీరో వెంకటేష్ ఫస్ట్ సిల్వర్ జూబ్లీ మూవీ గా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ మూవీ లోని “కన్యాకుమారీ “సాంగ్ లో అడవి జంతువులను యానిమేషన్ తో రూపొందించగా ఆ సాంగ్ పెద్దలతో పాటు చిన్నారులను అలరించింది. సూపర్ హిట్ “రక్త తిలకం ” మూవీ తరువాత దర్శకుడు గోపాల్ , హీరో వెంకటేష్ కాంబినేషన్ లో రెండవ మూవీ గా రూపొందిన “బొబ్బిలి రాజా” మూవీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven − five =