డైరెక్షన్ పై నిఖిల్ క్లారిటీ – ఇప్పుడే డైరెక్ట్ చేయను

I Will Not Get Into Movie Direction As Of Now Says Actor Nikhil

హీరో నిఖిల్ డైరెక్టర్ గా మారబోతున్నాడని.. ఒక ఎక్స్పెరిమెంటల్ చిల్డ్రన్ సినిమాను డైరెక్ట్ చేయనున్నాడని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. అయితే ఇప్పుడు ఆవార్తలపై స్పందించిన నిఖిల్ తన డైరెక్షన్ పై క్లారిటీ ఇచ్చాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“మీరు నాపై చూపిస్తున్న ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు. మేం పిల్లల సినిమాకు సంబంధించి బౌండెడ్‌ స్క్రిప్ట్‌ను రాశాం. అయితే ఇప్పుడప్పుడే ఎలాంటి సినిమాను డైరెక్ట్‌ చేయడం లేదు. ప్రస్తుతం నేను నటిస్తున్న రెండు చిత్రాలు 18 పేజీస్‌, కార్తికేయ 2 సినిమాలు అక్టోబర్‌, నవంబర్‌ నుండి ప్రారంభం కానున్నాయి. ఈ చిత్రాల షూటింగ్స్‌తో నేను ఫుల్‌ బిజీ అవుతున్నాను. త్వరలోనే థియేటర్స్‌లో కలుద్దాం” అని క్లారిటీ ఇచ్చాడు‌. అయితే డైరెక్ట్ చేస్తాడు కానీ దానికి ఇంకా టైం ఉందని చెపుతున్నాడన్నమాట నిఖిల్.

 

ప్రస్తుతం నిఖిల్‌, చందు మెుండేటి కాంబినేష‌న్ లో వచ్చిన ‘కార్తికేయ’ సీక్వెల్ ‘కార్తికేయ2’ సినిమా చేస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకం పై నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మిస్తున్నారు. పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో “18పేజీస్” సినిమాలో కూడా నటిస్తున్నాడు. గీతా ఆర్ట్స్2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై ఈ సినిమా రూపొందుతుంది. ఇక కరోనా కారణంగా ఈ మూవీస్ షూటింగ్స్ ఆగిపోయాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 + four =