కుక్క పిల్లలను రక్షించిన ఆది పినిశెట్టి

Actor Aadi Pinisetty Rescue and Save Puppies In His Movie Sets

కేవలం హీరోగా మాత్రమే కాదు విలన్ గా.. మరోపక్క సపోర్టింగ్ రోల్స్ లో నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు ఆది పినిశెట్టి. తను ప్రతి సినిమాకు ఓ విభిన్నత ఉండేలా చూసుకుంటాడు ఆది. అందుకే అటు తమిళ్ లోనూ ఇటు తెలుగులోనూ మంచి రోల్స్ చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇక ఇదిలా ఉండగా ఆది పినిశెట్టికి సంబంధించిన ఒక వీడియో మాత్రం సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. అదేంటంటే ఓ రెస్క్యూ ఆపరేషన్ చేశాడు ఆది. ఇంతకీ ఎవర్ని రక్షించాడనుకుంటున్నారా ? అసలు సంగతేంటో తెలియాలంటే స్టోరీ లోకి వెళ్లాల్సిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రస్తుతం ఆది గుడ్ లక్ సఖి సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. అయితే ఆ షూటింగ్ జరుగుతున్నప్పుడు సెట్స్ కు కాస్త దూరంలో రెండు కుక్క పిల్లల శబ్దాలు వినిపించాయట. దాంతో ఆ రెండు కుక్క పిల్లలు ఒక వరలో ఉండగా అందులోకి వెళ్లి ఆ కుక్క పిల్లలను జాగ్రత్తగా బయటకు తీసుకువచ్చి, వాటికి పాలుపట్టించి కాసేపు బుజ్జగించాడు కూడా. ఈ వీడియోను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా ఇప్పుడు ఆ వీడియో వైరల్ గా మారిపోయింది.

 

 

View this post on Instagram

 

Best things in life are #Rescued❤️ #rescuedog #shootdiaries🎥

A post shared by Aadhi (@aadhiofficial) on

కాగా నగేశ్ కుకునూర్ దర్శకత్వంలో తరెకెక్కుతున్నఈ సినిమాలో ఆది పినిశెట్టి గోలి రాజు అనే థియేటర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్నాడు. ఈ సినిమాను తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళం భాష‌ల్లో నిర్మిస్తున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు స‌మ‌ర్పిస్తున్న ఈ మూవీని వ‌ర్త్ ఎ షాట్ మోష‌న్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై సుధీర్ చంద్ర పాదిరి, శ్రావ్య వ‌ర్మ నిర్మిస్తున్నారు.

 

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 1 =