
ట్యాగ్ · 17286 కథనాలు · పేజీ 249



సెన్సార్ పూర్తిచేసుకున్న కోట బొమ్మాళి పీఎస్

గోవా లో గోపీచంద్ 32 కీలక సన్నివేశాల షూట్

సలార్ మేకర్స్ సీరియస్ వార్నింగ్

యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన నాగచైతన్య

సూపర్ ఫాస్ట్ గా నా సామి రంగ షూటింగ్

ఆది కేశవ ట్రైలర్ రిలీజ్ వాయిదా

టైగర్ 3 లేటెస్ట్ కలెక్షన్స్

జయం రవి సైరెన్ మూవీ టీజర్ రిలీజ్

సైంధవ్ ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్

మంచి మనసు చాటుకున్న చైతు

అజిత్ గారితో సినిమా కోసం వెయిటింగ్

సలార్- మైత్రీ చేతిలో నైజాం రైట్స్

బుర్జ్ ఖలీఫా వద్ద యానిమల్ స్పెషల్ కట్
అర్జున్ రెడ్డి సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన సందీప్ వంగ ఇప్పుడు మరో సెన్సేషన్ క్రియేట్ చేయడానికి వస్తున్నాడు. సందీప్ వంగా దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ హీరోగా వస్తున్న సినిమా యానిమల్. క్రేజీ కాంబినేషన్ లో ది మోస్ట్ వైలెంట్ సినిమాగా రాబోతున్న ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే టీజర్ ను రిలీజ్ చేయగా టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చి సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

కోట బొమ్మాళి పీఎస్ లో ఆ సీన్ చేయడం ఛాలెంజింగ్‌గా అనిపించింది - వరలక్ష్మీ శరత్ కుమార్
తమిళంలో ఇంతకుముందు చాలా సినిమాల్లో పోలీస్ క్యారెక్టర్స్ చేశాను, కానీ తెలుగులో మాత్రం ఇదే మొదటిసారని, ఈ పాత్ర చాలా ఛాలెంజింగ్‌గా అనిపించిందని పేర్కొన్నారు ప్రముఖ నటి వరలక్ష్మీ శరత్ కుమార్. తాజాగా ఆమె నటించిన లేటెస్ట్ మూవీ ‘కోట బొమ్మాళి పీఎస్’. రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ జంటగా నటించిన ఈ చిత్రానికి ‘అర్జున ఫల్గుణ’ ఫేమ్ తేజ మార్ని దర్శకుడు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌పై బన్నీ వాస్, విద్యా కొప్పినీడి నిర్మించిన ఈ చిత్రంలో సీనియర్ నటుడు శ్రీకాంత్, కీలకపాత్ర పోషించారు. నవంబర్ 24న ఈ సినిమా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదలవుతున్న సందర్భంగా సినిమాలో కీలక పాత్ర పోషించిన వరలక్ష్మీ శరత్ కుమార్ మీడియాకు…

సెన్సార్ పూర్తిచేసుకున్న కోట బొమ్మాళి పీఎస్
తేజ మార్ని దర్శకత్వంలో శ్రీకాంత్, వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా కోట బొమ్మాళి పీఎస్. ఈసినిమా మలయాళంలో సూపర్ హిట్ అయిన నాయట్టు సినిమాకు రీమేక్ గా వస్తుంది. నవంబర్ 24వ తేదీన ఈసినిమా ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది చిత్రయూనిట్. అంతేకాదు ఈసినిమా నుండి వచ్చిన అప్ డేట్లు అన్నీ ఈసినిమాపై అంచనాలను పెంచేసింది. ఇక తాజాగా ఈసినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తిచేసుకొని రిలీకు సిద్దమైపోయింది. ఈసినిమాకు యూఏ సర్టిఫికెట్ అందించారు సెన్సార్ బృందం.

గోవా లో గోపీచంద్ 32 కీలక సన్నివేశాల షూట్
శ్రీనువైట్ల దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇటీవలే ఈసినిమాన ఇటీవలే లాంచ్ చేసిన సంగతి కూడా విదితమే. ప్రస్తుతానికి గోపీచంద్ 32 అనే వర్కింగ్ టైటిల్ తోనే ఈసినిమా షూటింగ్ జరుగుతుంది. ఇక ఇదిలా ఉండగా ఈసినిమా షూటింగ్ ను ప్రారంభించారు మేకర్స్. ఈనేపథ్యంలో తాజాగా ఈసినిమా షూటింగ్ కు సంబంధించిన అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా షూటింగ్ గోవాలో జరుగుతున్నట్టు ప్రస్తుతం అక్కడ కీలక సన్నివేశాలను షూటింగ్ చేస్తున్నట్టు తెలిపాడు.

అదుర్స్ రీ రిలీజ్.. థియేటర్ల వద్ద ఎన్టీఆర్ ఫ్యాన్స్ సందడి
రీసెంట్‌గా టాలీవుడ్‌లో రీ రిలీజ్ ట్రెండ్ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఒకప్పుడు సూపర్ హిట్ అయిన స్టార్ హీరోల సినిమాలను మళ్ళీ థియేటర్లలో విడుదల చేస్తూ లాభాలు గడిస్తున్నారు ఆయా చిత్రాల నిర్మాతలు. తాజాగా ఈ లిస్టులోకి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సినిమా చేరింది. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన సూపర్ హిట్ ఫిల్మ్ 'అదుర్స్' శనివారం (నవంబర్ 18, 2023) రీ రిలీజ్ అయింది. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 2010లో విడుదలై ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే.

సలార్ మేకర్స్ సీరియస్ వార్నింగ్
పెద్ద పెద్ద సినిమాలకు ఈమధ్య లీకుల బెడద మరీ ఎక్కువైపోయింది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. చర్యలు తీసుకుంటామని చెబుతున్నా కూడా ఏదో ఒక రకంగా లీకులు బయటపడుతూనే ఉన్నాయి. ఈనేపథ్యంలోనే మరోసారి సలార్ టీమ్ సీరియస్ వార్నింగ్ ఇచ్చేసింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వస్తున్న సినిమా సలార్. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. మరోవైపు చిన్నగా ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు మేకర్స్.

యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన నాగచైతన్య
ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా శక్తివంతమైన మీడియాగా పనిచేస్తోంది. దీంతో పలువురు సినీ ప్రముఖులు 'ఎక్స్', ఇన్‌స్టాగ్రామ్', 'ఫేస్‌బుక్' మరియు 'యూట్యూబ్' వంటి వేదికల ద్వారా తమకు సంబంధించిన విశేషాలను అభిమానులతో పంచుకుంటున్నారు. అలాగే వారు చేస్తోన్న కొత్త చిత్రాల ప్రమోషన్స్‌ను కూడా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. తాజాగా ఈ జాబితాలోకి టాలీవుడ్ స్టార్ హీరో నాగచైతన్య కూడా చేరారు. ‘అక్కినేని నాగచైతన్య’ అనే పేరుతో సొంతంగా ఛానల్‌ను ఏర్పాటుచేసుకున్న ఆయన.. అందులో శుక్రవారం తొలి వీడియో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా యూట్యూబ్ ప్రపంచంలోకి తాను అడుగుపెట్టానంటూ వెల్లడించారు.

సూపర్ ఫాస్ట్ గా నా సామి రంగ షూటింగ్
కింగ్ నాగార్జున నటిస్తున్న లేటెస్ట్ మూవీ నా సామి రంగ షూటింగ్ జెట్ స్పీడ్ లో జరుగుతుంది.రీసెంట్ గానే ఈసినిమా సెట్స్ మీదకు వెళ్లగా అప్పుడే 70శాతం షూటింగ్ ను కంప్లీట్ చేశారు.గత కొద్దీ రోజుల నుండి ఈసినిమా షూటింగ్ మైసూర్ లో జరుగుతుంది.ప్రస్తుతం పాటను చిత్రీకరిస్తున్నారు.ఈసినిమాతో కొరియో గ్రాఫర్ విజయ్ బిన్నీ డైరెక్టర్ గా పరిచయమవుతున్నాడు.ఊర మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో నాగ్ మాస్ లుక్ లో కనిపించనున్నాడు.ఇటీవల విడుదల చేసిన టైటిల్ గ్లింప్స్ కు కూడా సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

ఆది కేశవ ట్రైలర్ రిలీజ్ వాయిదా
శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమా ఆదికేశవ. పక్కా మాస్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ జోనర్‌లో ఈసినిమా వస్తుంది. అందులోనూ ఇంత మాస్ రోల్ లో వైష్ణవ్ తేజ్ చేయడం మొదటిసారి అవ్వడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఎన్నో వాయిదాల అనంతరం ఈసినిమా ఫైనల్ గా నవంబర్ 24 తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ప్రమోషన్స్ లో జోరు పెంచారు మేకర్స్. ఇక ఇప్పటికే విడుదల చేసిన టీజర్, గ్లింప్స్, పోస్టర్లు అన్నీ సినిమాపై క్యూరియాసిటీ పెంచాయి.

టైగర్ 3 లేటెస్ట్ కలెక్షన్స్
సల్మాన్ ఖాన్ నటించిన టైగర్ 3 వర్కింగ్ డేస్ లో కూడా స్ట్రాంగ్ హోల్డ్ కనబరుస్తూ మంచి వసూళ్లను దక్కించుకుంటుంది.అయితే వరల్డ్ కప్ సెమిస్ మ్యాచ్ లు ఈ సినిమా కలెక్షన్స్ ఫై ప్రభావం చూపించాయి.బుధవారం ఇండియా -న్యూజిలాండ్ మ్యాచ్ జరుగగా ఆ రోజు ఈసినిమా 20.50కోట్ల వసూళ్లను సొంతం చేసుకోగలిగింది.ఇక నిన్న రెండో సెమిస్ కూడా పాక్షికంగా ప్రభావం చూపించింది.నిన్న ఈసినిమా 18కోట్ల వసూళ్లను రాబట్టింది.దాంతో 5రోజుల్లో ఈసినిమా హిందీ వెర్షన్ ఇండియాలో 183కోట్ల నెట్ వసూళ్లను రాబట్టుకుంది.తెలుగు,తమిళ వెర్షన్ లు కలుపుకొని 5.25కోట్ల నెట్ వసూళ్లను రాబట్టుకున్నాయి.

జయం రవి సైరెన్ మూవీ టీజర్ రిలీజ్
తమిళ్ స్టార్ హీరో జయం రవి సినిమాకు తెలుగులో కూడా మంచి ఆదరణే ఉంది. అందుకే తన సినిమాలను తెలుగులో కూడా రిలీజ్ చేస్తుంటాడు. ఈనేపథ్యంలోనే ఇప్పుడు మరో సినిమాను రిలీజ్ చేస్తున్నాడు. ఆంటోనీ భాగ్యరాజ్ దర్శకత్వంలో జయం రవి హీరోగా వస్తున్న సినిమా సైరెన్ 108. అన్నాత్తే, విశ్వాసం, హీరో సినిమాలకు రచయితగా పనిచేసిన ఆంటోని ఈసినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రివేంజ్ డ్రామాగా ఈసినిమా రాబోతుంది.

నా జీవితంలో నేను తీసుకున్న మంచి నిర్ణయం అదే - సింగర్ సునీత
టాలీవుడ్ గాయనీమణుల్లో తనకంటూ కొన్ని పేజీలు లిఖించుకోగలిగిన అతికొద్దిమందిలో సింగర్ సునీత ఉపద్రష్ట ఒకరు. కేవలం గాయకురాలిగానే కాకుండా.. ఎన్నో సినిమాల్లో కథానాయికలకు తన గాత్రాన్ని అరువిచ్చారు. ఒక గాయకురాలిగా సునీతను మూవీ లవర్స్ ఎంతగా అభిమానిస్తారో.. సినిమాల్లో ఆమె చెప్పే డబ్బింగ్‌ని కూడా అంతే అభిమానిస్తారు. ఇక సునీత డబ్బింగ్‌కి సాధారణ ప్రేక్షకులే కాదు, పేరొందిన డైరెక్టర్స్ సైతం ఫ్యాన్స్ అంటే అతిశయోక్తి కాదు. దీనికితోడు దేశ, విదేశాల్లో కొన్ని వేల షోలు చేసిన అనుభవం ఆమె సొంతం.

సప్త సాగరాలు దాటి - సైడ్ బి రివ్యూ
ఓవరాల్ గా చెప్పాలంటే ఎమోషలన్ లవ్ స్టోరీస్ ఇష్టపడేవారికి ఈసినిమా ఖచ్చితంగా నచ్చుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

సైంధవ్ ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్
శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా ఈసినిమా వస్తుంది. యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రాబోతుంది. అంతేకాదు వెంకటేష్ కెరీర్ లో వస్తున్న 75వ సినిమా కావడంతో ఈసినిమాకోసం వెంకీ ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది.

మంచి మనసు చాటుకున్న చైతు
మన హీరోలు రీల్ సినిమాల్లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా తాము చేసే పనుల వల్ల హీరోలనిపించుకుంటారు. ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంటారు..ఎంతోమందికి హెల్ప్ చేస్తూ తమ ఉదారతను చాటుతూనే ఉంటారు. ఇక తాజాగా నాగ చైతన్య మరోసారి తన మంచి మనసును చాటుకున్నాడు. హైద్రాబాద్ లోని సెయింట్ జూడ్స్ చైల్డ్ కేర్ సెంటర్ లో క్యాన్సర్ తో పోరాడుతున్న చిన్నారులతో నాగచైతన్య కాసేపు గడిపారు. అక్కడ వారితో కాసేపు సరదాగా ఆటలు ఆడి పిల్లలను సంతోషపరిచారు. ఈ ఫొటోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక చైతు చేసిన పనికి నెటిజన్లు ప్రశంసలు కురిపించారు.

సుమంత్ కొత్త చిత్రం.. మహేంద్రగిరి వారాహి ఫస్ట్ లుక్ రివీల్
టాలీవుడ్ హీరో సుమంత్ కొత్త సినిమాకు టైటిల్ ఖరారు అయింది. మీనాక్షి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి ‘మహేంద్రగిరి వారాహి’ అనే పేరును ఫిక్స్ చేశారు. రాజశ్యామల ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై కాలిపు మధు, ఎం.సుబ్బారెడ్డి నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్రానికి జాగర్లపూడి సంతోశ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మేరకు రాజశ్యామలా అమ్మవారి నిత్య ఉపాసకులు విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి సమక్షంలో సినిమా టైటిల్‌ని మేకర్స్ ప్రకటించారు. అంతకుముందు చిత్రబృందం విశాఖ శారదాపీఠాన్ని సందర్శించి రాజశ్యామల అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసింది. ఈ సందర్భంగా పీఠాధిపతులు శ్రీ స్వరూపానందేంద్ర…

రివ్యూ : మంగళవారం
ఓవరాల్ గా థ్రిల్లింగ్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈమంగళవారంలో పాయల్ రాజ్ పుత్ నటన,ట్విస్టులు ,నేపథ్య సంగీతం,డైరెక్షన్ హైలైట్ అయ్యాయి.థియేటర్లలో మంగళవారం సరికొత్త అనుభూతిని ఇస్తుందనడంలో సందేహం లేదు.థ్రిల్లర్లను ఇష్టపడేవారికి మంగళవారం మంచి ఆప్షన్ కానుంది.

అజిత్ గారితో సినిమా కోసం వెయిటింగ్
వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు తమిళ్ స్టార్ డైరెక్టర్ అట్లీ. తమిళ్ లో వరుసగా హిట్లతో దూసుకుపోతున్న అట్లీ జవాన్ తో దేశవ్యాప్తంగా తన సత్తాను చాటాడు. షారుఖ్ హీరోగా అట్లీ దర్శకత్వంలో వచ్చిన జవాన్ సినిమా ఏ రకంగా సంచలనాలు సృష్టిస్తుందో చూశాం. ప్రస్తుతం అయితే అట్లీ దర్శకత్వంలో సినిమాలు చేయడానికి ఎంతో మంది హీరోలు వెయిట్ చేస్తున్నారు.

సలార్- మైత్రీ చేతిలో నైజాం రైట్స్
ప్రభాస్ నుండి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ సలార్. కేవలం ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాదు దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది.

కోహ్లీ బయోపిక్.. హీరోగా అతడే పర్‌ఫెక్ట్ - రణ్‌బీర్ కపూర్ కామెంట్స్ వైరల్
ఐసీసీ ప్రపంచ కప్‌లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా బుధవారం జరిగిన తొలి సెమీఫైనల్ పోరులో భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. న్యూజిలాండ్‌తో జరిగిన ఈ కీలక పోరులో 70 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ క్రమంలో వరల్డ్ కప్ ఒడిసి పట్టుకునేందుకు టీమ్ ఇండియా మరొక్క అడుగు దూరంలో నిలిచింది. దీనికితోడు ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ సెంచరీతో చెలరేగి ప్రపంచ రికార్డ్ సృష్టించాడు. తద్వారా భారత బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న 49 శతకాల రికార్డును బద్దలు కొట్టాడు. కాగా కోహ్లీకి ఇది 50వ సెంచరీ కావడం విశేషం. అయితే ఈ రికార్డు తర్వాత కోహ్లీ బయోపిక్ గురించి సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.