అదుర్స్ రీ రిలీజ్.. థియేటర్ల వద్ద ఎన్టీఆర్ ఫ్యాన్స్ సందడి

Jr NTR Fans Hungama at Theaters During Adhurs Movie Re Release

రీసెంట్‌గా టాలీవుడ్‌లో రీ రిలీజ్‌ ట్రెండ్ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఒకప్పుడు సూపర్ హిట్ అయిన స్టార్ హీరోల సినిమాలను మళ్ళీ థియేటర్లలో విడుదల చేస్తూ లాభాలు గడిస్తున్నారు ఆయా చిత్రాల నిర్మాతలు. తాజాగా ఈ లిస్టులోకి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సినిమా చేరింది. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా న‌టించిన సూప‌ర్ హిట్ ఫిల్మ్ ‘అదుర్స్’ శనివారం (నవంబర్ 18, 2023) రీ రిలీజ్‌ అయింది. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 2010లో విడుదలై ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ సినిమాను 25 కోట్ల బ‌డ్జెట్‌తో నిర్మించగా.. బాక్సాఫీస్ వద్ద 80 కోట్ల‌కు పైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టి ఎన్టీఆర్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌ల‌లో ఒక‌టిగా నిలిచింది. ఈ నేపథ్యంలో 13 ఏళ్ల త‌ర్వాత ‘అదుర్స్’ మూవీ మ‌రోసారి ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ఇక ‘ఆర్ఆర్ఆర్’ విడుదలై దాదాపు ఏడాదిన్నర పైనే అవుతోంది. అప్పటినుంచి ఎన్టీఆర్ సినిమా ఏదీ రిలీజ్ కాలేదు. దీంతో తారక్ ని చూసేందుకు ఆయన అభిమానులు థియేటర్లకు పోటెత్తారు. ఈ సందర్భంగా తమ అభిమాన హీరో సూపర్ హిట్ మూవీని చూసేందుకు తారక్ ఫ్యాన్స్ థియేటర్ల వద్ద సందడి చేస్తున్నారు. తెరపై ఎన్టీఆర్ కనిపించినప్పుడు మరియు బ్రహ్మానందం సీన్స్ వచ్చినప్పుడు థియేటర్లు అరుపులతో దద్దరిల్లుతున్నాయి.

కాగా ఈ సినిమాలో ఎన్టీఆర్ ద్విపాత్రాభిమానం చేయగా.. ఆయన సరసన నయనతార, షీలా హీరోయిన్స్‌గా నటించారు. అలాగే టాలీవుడ్ ప్రముఖ కమెడియన్ బ్రహ్మానందం మరో కీలక పాత్రను పోషించారు. వైష్ణవి ఆర్ట్స్ బ్యానర్‌పై వల్లభనేని వంశీ మోహన్ నిర్మించిన ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్నందించాడు. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్‌, బ్ర‌హ్మానందం కామెడీ ట్రాక్ అయితే నెక్స్ట్ లెవెల్. ఈ సీన్స్ ఇప్పుడు టీవీలలో వస్తున్నా ఆడియెన్స్ నవ్వుల జల్లుల్లో తడిసిపోతారు. అప్ప‌టివ‌ర‌కు సీరియ‌స్ రోల్స్‌లో, యాక్షన్ హీరోగా నటించిన తారక్.. తొలిసారి ఈ సినిమాలో తనలోని కామెడీ టైమింగ్‌ను బయటపెట్టారు. కాగా ఎన్టీఆర్ ‘బాద్‌షా’ సినిమా కూడా గ‌త న‌వంబ‌ర్‌లో రీ రిలీజైన విషయం తెలిసిందే.

ఇక ఎన్టీఆర్ ఇతర సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ అనే యాక్షన్ మూవీలో నటిస్తున్నారు. రెండు పార్టులుగా తెరకెక్కుతున్న ఈ మూవీ తొలి భాగాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 5న పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నారు. ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. ప్రముఖ హిందీ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. మరోవైపు ఈ తర్వాత తారక్ ‘వార్ 2’ సినిమాతో బాలీవుడ్‌లో అడుగుపెట్టబోతున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ స్పై థ్రిల్లర్‌లో హృతిక్ రోషన్‌తో కలిసి ఆయన నటించనున్నారు. అలాగే ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కూడా ఎన్టీఆర్ ఓ భారీ చిత్రం చేయనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 + eight =