ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా శక్తివంతమైన మీడియాగా పనిచేస్తోంది. దీంతో పలువురు సినీ ప్రముఖులు ‘ఎక్స్’, ఇన్‌స్టాగ్రామ్’, ‘ఫేస్‌బుక్’ మరియు ‘యూట్యూబ్’ వంటి వేదికల ద్వారా తమకు సంబంధించిన విశేషాలను అభిమానులతో పంచుకుంటున్నారు. అలాగే వారు చేస్తోన్న కొత్త చిత్రాల ప్రమోషన్స్‌ను కూడా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. తాజాగా ఈ జాబితాలోకి టాలీవుడ్ స్టార్ హీరో నాగచైతన్య కూడా చేరారు. ‘అక్కినేని నాగచైతన్య’ అనే పేరుతో సొంతంగా ఛానల్‌ను ఏర్పాటుచేసుకున్న ఆయన.. అందులో శుక్రవారం తొలి వీడియో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా యూట్యూబ్ ప్రపంచంలోకి తాను అడుగుపెట్టానంటూ వెల్లడించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ క్రమ్మలో అభిమానులు అడిగిన కొన్ని ప్రశ్నలకు నాగచైతన్య ఇంట్రెస్టింగ్ ఆన్సర్స్ ఇచ్చారు. దీనిలో భాగంగా ఓ నెటిజన్ ‘మీరు ఇంతగా జుట్టు, గడ్డం పెంచడానికి కారణం తెలుసుకోవచ్చా?’ అని ప్రశ్నించగా.. దీనికి చైతూ బదులిస్తూ.. ‘ఆరు నెలలుగా తనకు జాబ్ లేదని, ఇంట్లో ఖాళీగా ఉంటున్నాను. దీంతో పనేమీ లేక జుట్టు, గడ్డం పెంచుతున్నా’ అని ఫన్నీగా చెప్పారు. అయితే ఆ తర్వాత తాను చందూ మొండేటి తీస్తోన్న కొత్త సినిమా కోసం పెంచినట్లు క్లారిటీ ఇచ్చారు. ఇక ఈ లోక్ లో కొన్నిరోజుల క్రితం ఫోటోషూట్ జరిగిందని, అది బాగా వచ్చిందని తెలిపారు. అలాగే తాను నటించిన తొలి వెబ్ సిరీస్ ‘దూత’ గురించిన ఒక ప్రశ్నకు.. ఇందులో ‘దూత’ ఎవరో తెలియాలంటే? దర్శకుడిని ట్యాగ్ చేసి అడగాలని సలహా ఇచ్చారు.
కాగా ఈ ఏడాది ‘కస్టడీ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన నాగచైతన్య.. ప్రస్తుతం చందూ మొండేటి దర్శకత్వంలో NC23 అనే విభిన్న కథాంశం కలిగిన సినిమాలో నటిస్తున్నారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ గీతాఆర్ట్స్ బ్యానర్‌పై తెరకెక్కుతోన్న ఈ చిత్రం జాలర్ల జీవితం నేపథ్యంలో రూపొందుతోంది. ఇక మరోవైపు ‘మనం’ ఫేమ్ విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో చైతూ నటించిన వెబ్ సిరీస్ ‘ధూత’ డిసెంబర్ 1 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషల్లో అందుబాటులోకి రానున్నట్లు మేకర్స్ ఇప్పటికే వెల్లడించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: