
ట్యాగ్ · 17286 కథనాలు · పేజీ 250


కంగువా లో హైలెట్ గా ఆరు ఫైట్లు

కోహ్లీ వరల్డ్ రికార్డ్ పై సెలబ్రిటీల రియాక్షన్

సలార్ ఏపీ రిలీజ్ వివరాలు

అథర్వ ట్రైలర్ రిలీజ్

ఆదికేశవ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

జిగర్ తండ డబుల్ ఎక్స్ టీమ్ పై తలైవా ప్రశంసలు

సమంత, ఎన్టీఆర్, రామ్ చరణ్ గురించి తేజ్ మాటల్లో

స్టార్ హీరోలతో అలాంటి జోనర్లలో సినిమాలు తీస్తా

మాస్ సినిమాలు నా ఫేవరెట్ జోనర్

మంగళవారంకు సీక్వెల్ కూడా

యానిమల్ డబ్బింగ్ కంప్లీట్ చేసిన రష్మిక
అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ వంగ దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా వస్తున్న సినిమా యానిమల్. క్రేజీ కాంబినేషన్ కాబట్టి ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు. దీనిలో భాగంగానే ఇప్పటికే టీజర్ ను అలానే వరుసగా పాటలను రిలీజ్ చేసుకుంటూ వస్తున్నారు.

మంగళవారం రిలీజ్‌కు ముందు ఫ్యాన్స్‌కి ట్రీట్.. మేకింగ్ వీడియో రిలీజ్
టాలీవుడ్‌లోని ట్యాలెంటెడ్ డైరెక్టర్స్‌లో అజయ్ భూపతి ఒకరు. తొలి ప్రయత్నంలోనే 'ఆర్ఎక్స్ 100' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. దీని తర్వాత సిద్ధార్థ్, శర్వానంద్ హీరోలుగా, అను ఇమ్మాన్యూయల్, అదితి రావు హైదరి హీరోయిన్స్‌గా 'మహాసముద్రం' అనే సినిమాను రూపొందించగా.. అది బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత విజయం సాధించలేకపోయింది. అయితే అజయ్ భూపతి తీసింది రెండు సినిమాలే అయినా, ఆయన నుంచి సినిమా వస్తుందంటే.. ప్రేక్షకుల్లో ఒకరకమైన ఆసక్తి నెలకొంటుంది. కాగా అజయ్ భూపతి ప్రస్తుతం మూడో సినిమాగా 'మంగళవారం' అనే సినిమాను రూపొందిస్తున్న విషయం తెలిసిందే.

కంగువా లో హైలెట్ గా ఆరు ఫైట్లు
స్టార్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో సూర్య హీరోగా వస్తున్న సినిమా కంగువ. ఈసినిమా హిస్టారికల్ వార్ బ్యాక్‌డ్రాప్‌లో.. ఈ సినిమా 1000 సంవత్సరాల క్రితం జరిగిన కథ ఆధారంగా తెరకెక్కుతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా జరుపుకుంటుంది. చెన్నైలో ఈసినిమా షూటింగ్ జరుగుతుంది. పలు కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

జిగర్ తండ డబల్ ఎక్స్ పై నాని ఇంట్రెస్టింగ్ పోస్ట్
తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో రీసెంట్ గా వచ్చిన సినిమా జిగర్ తండ డబుల్ ఎక్స్. ఈసినిమా జిగర్ తండ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా రీసెంట్ గానే రిలీజ్ అయి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. అయితే తమిళ్ లో ఈసినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది కానీ ఇక్కడ మాత్రం మిక్డ్స్ టాక్ ను సొంతం చేసుకుంది.

పేద విద్యార్థులకు అండగా.. గొప్ప మనస్సు చాటుకున్న మహేష్ బాబు
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి తన గొప్ప మనస్సును చాటుకున్నారు. ఈ మేరకు ఆయన తన తండ్రి, దివంగత నటుడు ఘట్టమనేని కృష్ణ గారి తొలి వర్ధంతి (నవంబర్ 15, 2023) సందర్భంగా.. ఒక మంచి సామాజిక సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తెలుగు రాష్ట్రాలలోని పలువురు పేద విద్యార్థులకు ఉన్నత చదువులను అందించేందుకు ముందుకొచ్చారు. ఇందుకోసం మహేష్ బాబు ఫౌండేషన్ ఆధ్వర్యంలో 'సూపర్ స్టార్ కృష్ణ ఎడ్యుకేషనల్ ఫండ్' ప్రోగ్రామ్‌ను ప్రారంభించారు. కాగా సూపర్ స్టార్ కృష్ణకు నివాళిగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మహేష్ బాబు మరియు ఆయన సతీమణి నమ్రత శిరోద్కర్ దంపతులు తెలిపారు. ఇక తాము నిర్వహిస్తున్న ఈ మంచి కార్యక్రమానికి…

కోహ్లీ వరల్డ్ రికార్డ్ పై సెలబ్రిటీల రియాక్షన్
నిన్న వరల్డ్ కప్ సెమీ ఫైనల్స్ లో భాగంగా కోహ్లీ మరో రికార్డును సృష్టించాడు. నిన్న సెమీ ఫైనల్స్ లో భాగంగా న్యూజిలాండ్ కు అలానే ఇండియాకు మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే కదా. ఇక ఈ మ్యాచ్ లో కోహ్లీ 50వ శతకం సాధించాడు. అంతేకాదు లెజెండ్ సచిన్ టెండుల్కర్ సెంచరీల రికార్డును బద్దలు కొట్టి తన పేరుతో వరల్డ్ రికార్డ్ ను క్రియేట్ చేశాడు. దీంతో దేశవ్యాప్తంగా అందరూ కోహ్లీపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

సలార్ ఏపీ రిలీజ్ వివరాలు
ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ అందరూ ఎప్పటినుండో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా సలార్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వస్తున్న సినిమా సలార్. ఈసినిమా కోసం ప్రేక్షకులు ఎంత ఈగర్ గా వెయిట్ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. కె.జి.ఎఫ్ డైరెక్టర్ కాబట్టి ఆమాత్రం అంచనాలు ఉండటం కామన్. అందుకే అంతలా వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది.

అథర్వ ట్రైలర్ రిలీజ్
అన్ని వర్గాల వారికి ఇష్టమైన జోనర్ థ్రిల్లర్ జోనర్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అందులోనూ ఈమధ్య క్రైమ్ థ్రిల్లర్స్ కు కూడా మంచి ఆదరణ లభిస్తుంది. అందుకే ఈమధ్య కాలంలో ఆ జోనర్ లలో సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. ఇక ఇప్పుడు ఇదే జోనర్ లో మరో సినిమా రిలీజ్ కు సిద్దంగా ఉంది. మహేష్ రెడ్డి దర్శకత్వంలో కార్తీక్ రాజు హీరోగా వస్తున్న సినిమా అథర్వ. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఇక ఈసినిమా డిసెంబర్1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది.

సూపర్ స్టార్ కృష్ణ తొలి వర్ధంతి.. మహేష్ బాబు, నమ్రత ఘన నివాళులు
దివంగత నటుడు, టాలీవుడ్ సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ తొలి వర్ధంతి నేడు (నవంబర్ 15, 2023). ఈ సందర్భంగా కృష్ణ తనయుడు, స్టార్ హీరో మహేష్ బాబు మరియు ఆయన సతీమణి నమ్రత శిరోద్కర్ దంపతులు ఘనంగా నివాళులు అర్పించారు. బుధవారం హైదరాబాద్‌లోని ఫిల్మ్ నగర్ క్లబ్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో తొలుత మహేష్, నమ్రతలు కృష్ణ, ఇందిరా దేవి దంపతుల ఫోటోల వద్ద పువ్వులు ఉంచి నివాళులు అర్పించారు. అనంతరం వారి పిల్లలు గౌతమ్ మరియు సితార ఇరువురూ తమ తాతకు నమస్కరించి అంజలి ఘటించారు. కాగా ఈ సందర్భంగా హీరో మహేష్ బాబు సోషల్ మీడియా వేదికగా తన తండ్రిని గుర్తు చేసుకుని ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. "సూపర్ స్టార్ ఆల్వేస్ అండ్ ఫరెవర్" అని…

ఆదికేశవ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్
శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమా ఆదికేశవ. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. ఇక ఈసినిమా రిలీజ్ డేట్ ను మరోసారి మార్చారు మేకర్స్. నవంబర్ 10వ తేదీన రిలీజ్ చేద్దామనుకున్నారు కానీ వరల్డ్ కప్ ఎఫెక్ట్ వల్ల రిలీజ్ డేట్ మార్చారు. ఫైనల్లీ నవంబర్ 24వ తేదీన ఈసినిమా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు చిత్రయూనిట్. ఈసినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్, పాటలు రిలీజ్ చేయగా అవి బాగా ఆకట్టుకున్నాయి. ఇక త్వరలో ట్రైలర్ ను కూడా రిలీజ్ చేయనున్నారు. ఈనేపథ్యంలోనే తాజాగా ఈసినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ ను…

వెస్టిండీస్ క్రికెట్ లెజెండ్ వివ్ రిచర్డ్స్‌తో వెంకటేష్ సెల్ఫీ
టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ స్వతహాగా నటుడైనప్పటికీ.. ఆయనకు క్రీడల పట్ల ఆసక్తి ఎక్కువ. అందునా ముఖ్యంగా క్రికెట్ అంటే విపరీతమైన క్రేజ్ ఆయనకు. అందుకే భారత్ జట్టు దేశవ్యాప్తంగా ఎక్కడ మ్యాచ్‌లు ఆడుతుంటే అక్కడ ప్రత్యక్షమవుతుంటారు. ఒక్కోసారి ఇతర దేశాలకు సైతం వెళ్లి మరీ మ్యాచ్‌లను వీక్షిస్తుంటారు. అయితే ప్రస్తుతం ఐసీసీ వరల్డ్ కప్ ఇండియాలో జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో టోర్నీ ప్రస్తుతం లీగ్ దశ పూర్తయ్యి కీలకమైన నాకౌట్ స్టేజ్‌కి చేరుకుంది. ఇక ఇప్పటికే లీగ్ మ్యాచ్‌లలో అదరగొట్టిన భారత్ నాకౌట్ లోకి అడుగుపెట్టింది. ప్రపంచ కప్ అందుకోవడానికి కేవలం రెండు మ్యాచ్‌ల దూరంలో ఉంది. దీనిలో భాగంగా…

షారుఖ్ పాటకి మెగాస్టార్ స్టెప్పులు, వీడియో వైరల్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన కొణిదెల దంపతులు దీపావళి పండుగ సందర్భంగా గత శనివారం రాత్రి తమ నివాసంలో గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. తమ ముద్దులపట్టి క్లీంకార పుట్టిన తర్వాత వచ్చిన మొదటి దీపావళి కావడంతో వారు ఈ పార్టీ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఈ పార్టీకి పలువురు టాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. వీరిలో విక్టరీ వెంకటేశ్, కింగ్ నాగార్జున, సూపర్ స్టార్ మహేశ్‌బాబు-నమ్రత, యంగ్ టైగర్ ఎన్టీఆర్-ప్రణతి దంపతులు ఉన్నారు. అలాగే వీరితోపాటు మరికొందరు దర్శక, నిర్మాతలు కూడా హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫొటోలను నమ్రత తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా అవి విపరీతంగా వైరల్ అయ్యాయి.

జిగర్ తండ డబుల్ ఎక్స్ టీమ్ పై తలైవా ప్రశంసలు
తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో వచ్చిన జిగర్ తండ ఎంత సూపర్ హిట్ అయిందో తెలిసిందే కదా. ఇక ఈసినిమాకు సీక్వెల్ జిగర్ తండ డబుల్ ఎక్స్ కూడా వచ్చిన సంగతి తెలిసిందే. ఈసినిమా రీసెంట్ గానే రిలీజ్ అయి మంచి టాక్ నే సొంతంచేసుకుంది. ఇక ఈసినిమాపై తలైవా రజనీకాంత్ తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ ప్రశంసించారు. జిగర్ తండ డబుల్ ఎక్స్ మూవీ డిఫరెంట్ కథ, డిఫరెంట్ ప్లాట్.. కార్తీక్ సుబ్బరాజు అమేజింగ్ వర్క్ చేశావు.. కొన్ని సన్నివేశాలు మాత్రం ఇంతకుముందు సినిమా ఫ్యాన్స్ ఎప్పుడూ చూసినట్టు ఉండవు.. ఇక ఈసినిమాలో ప్రధాన పాత్రల్లో చేసిన రాఘవ లారెన్స్ అలానే ఎస్ జే సూర్య నటనను కూడా ప్రశంసించారు. ఈ రకమైన పాత్రలో…

సమంత, ఎన్టీఆర్, రామ్ చరణ్ గురించి తేజ్ మాటల్లో
సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం తన కొత్త సినిమాతో బిజీగా ఉన్నాడు. సాయి ధరమ్ తేజ్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో వస్తున్న సినిమా గాంజా శంకర్. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తున్న ఈసినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. మ్యాడ్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా.. రిషి పంజాబీ సినిమాటోగ్రఫి అందిస్తున్నాడు.

స్టార్ హీరోలతో అలాంటి జోనర్లలో సినిమాలు తీస్తా
హేమంత్ ఎం రావు దర్శకత్వంలో రక్షిత్ శెట్టి హీరోగా వచ్చిన సినిమా సప్త సాగరాలు దాటి. ఈ సినిమా కన్నడలో సూపర్ హిట్ అయింది. దీంతో ఇక్కడ కూడా రిలీజ్ చేయగా ఇక్కడ కూడా హిట్ అయింది. ఈసినిమా రెండు భాగాలుగా వస్తున్న సంగతి తెలిసిందే కదా. నవంబర్ 17వ తేదీన ఈపార్ట్ ను రిలీజ్ చేయనున్నారు. సప్త సాగరాలు దాటి-సైడ్ బి అంటూ తెలుగులో రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టేశారు.

మాస్ సినిమాలు నా ఫేవరెట్ జోనర్
సాయి ధరమ్ తేజ్ ఈమధ్య కాస్త విభిన్నమైన సినిమాలను ఎంచుకుంటూ వరుస విజయాలు అందుకుంటూ తన అభిమానులను అలరిస్తున్నాడు. ఈ ఏడాది ఇప్పటికే విరూపాక్ష, బ్రో సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్లను అందుకున్నాడు. ప్రస్తుతం మరో కొత్త సినిమాతో బిజీ అయిపోయాడు.

మంగళవారంకు సీక్వెల్ కూడా
సినిమా ఇండస్ట్రీ లో ఇప్పుడు సీక్వెల్స్ కామన్ అయిపోయాయి.రిజల్ట్ తో సంబంధం లేకుండా సీక్వెల్ కూడా ఉందంటూ ముందే చెప్పేస్తున్నారు.ఈ జాబితాలో మరో సినిమా చేరింది అదే మంగళవారం.ఆర్ ఎక్స్ 100ఫేమ్ అజయ్ భూపతి డైరెక్ట్ చేసిన సినిమా ఇది.ఈవారం మంచి హైప్ తో విడుదలకానుంది.ఇక ఈసినిమాకు కూడా సీక్వెల్ ఉంటుందని అజయ్ భూపతి లేటెస్ట్ గా జరిగిన ఇంటర్వ్యూలో చెప్పాడు.

సైంధవ్- చిల్డ్రన్స్ డే స్పెషల్ పోస్టర్ విడుదల
టాలీవుడ్ అగ్రహీరో విక్టరీ వెంకటేష్ కూడా ఒక సినిమా తరువాత మరొక సినిమాను చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం వెంకీ నుండి రాబోతున్న మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ సైంధవ్. యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రాబోతుంది. అంతేకాదు వెంకటేష్ కెరీర్ లో వస్తున్న 75వ సినిమా కావడంతో ఈసినిమాకోసం వెంకీ ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకుంటుంది.

హనుమాన్ నుండి సూపర్ హీరో హనుమాన్ సాంగ్ రిలీజ్
టాలీవుడ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొదటినుండీ డిఫరెంట్ సినిమాలు చేస్తూ తనకుంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. అ!, కల్కి, జాంబిరెడ్డి ఇలా వేటికవే ప్రత్యేకమైన జోనర్లో వచ్చినవే. ఇక ఇప్పుడు మరో డిఫరెంట్ జోనర్ తో వచ్చేస్తున్నాడు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా వస్తున్న సినిమా హనుమాన్. భారతీయ ఇతిహాసాల్లోని హనుమంతుని కథ స్ఫూర్తితో సూపర్ హీరోస్ నేపథ్యంలో ఈసినిమా రాబోతుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీ అయిపోయింది. ఎన్నోసార్లు వాయిదా పడిన అనంతరం ఈసినిమా ఫైనల్ గా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కాబోతుంది.

రెండో రోజు టైగర్ 3 కి షాకింగ్ కలెక్షన్స్
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన టైగర్ 3 బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది.దీపావళికి థియేటర్లలోకి వచ్చిన ఈసినిమా రెండో రోజు మొదటి రోజు కన్నా ఎక్కువ వసూళ్లను రాబట్టి సెన్సేషన్ సృష్టించింది.నిన్న కొన్ని చోట్ల సెలువు కూడా కావడం సినిమాకు బాగా కలిసొచ్చింది.మొదటి రోజు ఇండియాలో 43కోట్ల నెట్ ను రాబట్టిన ఈసినిమా రెండో 58కోట్లతో రెండు రోజుల్లోనే 101 కోట్లను రాబట్టింది.