కింగ్ నాగార్జున నటిస్తున్న లేటెస్ట్ మూవీ నా సామి రంగ షూటింగ్ జెట్ స్పీడ్ లో జరుగుతుంది.రీసెంట్ గానే ఈసినిమా సెట్స్ మీదకు వెళ్లగా అప్పుడే 70శాతం షూటింగ్ ను కంప్లీట్ చేశారు.గత కొద్దీ రోజుల నుండి ఈసినిమా షూటింగ్ మైసూర్ లో జరుగుతుంది.ప్రస్తుతం పాటను చిత్రీకరిస్తున్నారు.ఈసినిమాతో కొరియో గ్రాఫర్ విజయ్ బిన్నీ డైరెక్టర్ గా పరిచయమవుతున్నాడు.ఊర మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో నాగ్ మాస్ లుక్ లో కనిపించనున్నాడు.ఇటీవల విడుదల చేసిన టైటిల్ గ్లింప్స్ కు కూడా సూపర్ రెస్పాన్స్ వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పటివరకు వచ్చిన అవుట్ ఫుట్ చూస్తే సినిమాకూడా చాలా బాగా వస్తుందట.అక్కినేని ఫ్యాన్స్ ఈసినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాలో యంగ్ హీరోలు అల్లరి నరేష్,రాజ్ తరుణ్ కీలక పాత్రల్లో కనిపించనుండగా పలాస డైరెక్టర్ కరుణ కుమార్ విలన్ గా నటిస్తున్నాడు.కీరవాణి సంగీతం అందిస్తుండగా శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ నిర్మిస్తుంది.వచ్చే ఏడాది సంక్రాంతికి ఈసినిమాను బరిలోకి దించుతున్నారు.
అయితే నా సామి రంగ పండగకు వస్తే గట్టి పోటీ మాత్రం తప్పేలా లేదు.ఎందుకంటే పండగను టార్గెట్ చేస్తూ గుంటూరు కారం,సైంధవ్ పెద్ద సినిమాలతో మరికొన్ని సినిమాలు కూడా విడుదలవుతున్నాయి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: