బుర్జ్ ఖలీఫా వద్ద యానిమల్ స్పెషల్ కట్

animal movie special cut on burj khalifa

అర్జున్ రెడ్డి సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన సందీప్ వంగ ఇప్పుడు మరో సెన్సేషన్ క్రియేట్ చేయడానికి వస్తున్నాడు. సందీప్ వంగా దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ హీరోగా వస్తున్న సినిమా యానిమల్. క్రేజీ కాంబినేషన్ లో ది మోస్ట్‌ వైలెంట్‌ సినిమాగా రాబోతున్న ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే టీజర్ ను రిలీజ్ చేయగా టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చి సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇటీవలే ఈ చిత్రం మాన్‌హాటన్ ఐకానిక్ టైమ్స్ స్క్వేర్‌లో సందడి చేసింది. ఆక్కడి డిజిటల్ బిల్‌బోర్డ్‌లపై ప్రదర్శించిన టీజర్ అందరీ ఆకట్టుకోవడంతో యానిమల్ గ్లోబల్ దృష్టిని ఆకర్షించింది. ఇక ఇదిలా ఉండగా తాజాగా మరో సర్ ప్రైజింగ్ ఇచ్చింది చిత్రయూనిట్. దుబాయ్ లోని ఐకానిక్ బుర్జ్ ఖలీఫా వద్ద జరిగిన లార్జ్ దెన్ లైఫ్, గ్రాండ్ ఈవెంట్ లో బుర్జ్‌ ఖలీఫా పై యానిమల్ స్పెషల్ కట్ ని ప్రదర్శించారు. రణ్‌బీర్ కపూర్, బాబీ డియోల్‌తో పాటు నిర్మాత భూషణ్ కుమార్ వేదికపై సందడి చేశారు. ఈ అద్భుతాన్ని చూడటానికి పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు.

కాగా ఈసినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా.. అనిల్ కపూర్, బాబి డియోల్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు టీ సిరీస్, సినీ వన్ స్టూడియోస్, భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్స్ పై భూషణ్​కుమార్, కిషన్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగ, మురాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తెలుగులో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై రిలీజ్ చేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 3 =