కోట బొమ్మాళి పీఎస్‌ లో ఆ సీన్ చేయడం ఛాలెంజింగ్‌గా అనిపించింది – వరలక్ష్మీ శరత్ కుమార్

Varalaxmi Sarathkumar Shares Her Experience in Kota Bommali PS Movie

తమిళంలో ఇంతకుముందు చాలా సినిమాల్లో పోలీస్‌ క్యారెక్టర్స్‌ చేశాను, కానీ తెలుగులో మాత్రం ఇదే మొదటిసారని, ఈ పాత్ర చాలా ఛాలెంజింగ్‌గా అనిపించిందని పేర్కొన్నారు ప్రముఖ నటి వరలక్ష్మీ శరత్ కుమార్. తాజాగా ఆమె నటించిన లేటెస్ట్ మూవీ ‘కోట బొమ్మాళి పీఎస్‌’. రాహుల్‌ విజయ్‌, శివానీ రాజశేఖర్‌ జంటగా నటించిన ఈ చిత్రానికి ‘అర్జున ఫల్గుణ’ ఫేమ్ తేజ మార్ని దర్శకుడు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌‌పై బన్నీ వాస్, విద్యా కొప్పినీడి నిర్మించిన ఈ చిత్రంలో సీనియర్ నటుడు శ్రీకాంత్, కీలకపాత్ర పోషించారు. నవంబర్ 24న ఈ సినిమా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదలవుతున్న సందర్భంగా సినిమాలో కీలక పాత్ర పోషించిన వరలక్ష్మీ శరత్ కుమార్ మీడియాకు చిత్ర విశేషాలను వివరించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సందర్భంగా వరలక్ష్మీ శరత్ కుమార్ మాట్లాడుతూ.. “నేను ఈ సినిమాలో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటించారు. అయితే తమిళంలో పోలీస్ పాత్రలు చాలా చేశాను కానీ.. తెలుగులో మాత్రం ఫస్ట్ టైమ్ ఈ తరహా గెటప్‌లో కనిపిస్తున్నా. ప్రస్తుతం ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ ట్రెండ్ నడుస్తోంది. ‘కోట బొమ్మాళి పీఎస్‌’ స్క్రిప్ట్ డిఫరెంట్‌గానే ఉంటుంది. తెలుగు ప్రేక్షకులకు కొత్తగా కనిపించాలని చాలా ట్రై చేస్తున్నా. నేను కథే హీరోగా భావిస్తా. ఇందులో శ్రీకాంత్ గారు, నేను పోలీస్ ఆఫీసర్స్, ఇద్దరిలో ఒకరు క్రిమినల్ అయితే ఎలా ఉంటుంది?. పోలీసులపై పొలిటికల్ ప్రెజర్ ఏ విధంగా ఉంటుంది? అనేదే ఈ మూవీ కాన్సెప్ట్. క్యాట్ అండ్ మౌస్ గేమ్‌లా థ్రిల్ చేసేలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది” అని తెలిపారు.

ఇంకా ఆమె మాట్లాడుతూ.. “ఈ సినిమా స్క్రీన్‌‌ప్లే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ప్రస్తుతం ఇక్కడ ఎలక్షన్ టైమ్‌ నడుస్తుండటం, ఈ సమయంలో ఈ మూవీ రావడం మరింత ఆసక్తికరంగా ఉంటుంది. ఎందుకంటే, ఇందులో ఓటు గురించి అవగాహన కల్పించే లైన్ కూడా ఉంటుంది. తమిళ ఒరిజినల్ ‘నాయట్టు’కి ఇది రీమేక్ అయినా.. ఇందులో చాలా మార్పులు చేశారు. ఇక ముఖ్యంగా ఈ చిత్రంలో నాకు స్మోకింగ్ చేయడం ఛాలెంజింగ్‌గా అనిపించింది. ఇప్పటివరకూ ఏ సినిమాలోనూ ఇలాంటి సీన్ చేయలేదు. అందుకే ఛాలెంజింగ్‌గా అనిపించింది. అయితే కథ ప్రకారం.. క్యారెక్టర్‌‌కి ఆ సీన్ కంపల్సరీ కాబట్టి చేయాల్సి వచ్చింది. ఇందులో యాక్షన్ కంటే మైండ్ గేమ్ ఎక్కువగా ఉంటుంది” అని చెప్పారు.

“వీలైనన్ని మంచి క్యారెక్టర్స్ చేయడమే నా గోల్. వరలక్ష్మీ చాలా డిఫరెంట్‌గా చేసిందని ప్రేక్షకులు అనుకోవాలని ఎప్పుడూ భావిస్తుంటాను. లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలతో పాటు క్యారెక్టర్‌ నచ్చితే ఏ జోనర్‌ కథలోనైనా నటించడానికి సిద్ధంగా ఉన్నా. వచ్చే సంక్రాంతికి నేను నటించిన ‘హనుమాన్‌’ విడుదలవుతోంది. అలాగే కన్నడలో కిచ్చా సుదీప్‌ గారితో కలిసి ‘మ్యాక్స్’ అనే చిత్రంలో నటిస్తున్నా. వీటితో పాటు మరికొన్ని ప్రెస్టీజియస్ ప్రాజెక్టులు లైన్‌లో ఉన్నాయి. త్వరలోనే వీటికి సంబంధించి అధికారికంగా అనౌన్స్‌మెంట్ ఇస్తాను’’ అని వరలక్ష్మీ వివరించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − thirteen =