సల్మాన్ ఖాన్ నటించిన టైగర్ 3 వర్కింగ్ డేస్ లో కూడా స్ట్రాంగ్ హోల్డ్ కనబరుస్తూ మంచి వసూళ్లను దక్కించుకుంటుంది.అయితే వరల్డ్ కప్ సెమిస్ మ్యాచ్ లు ఈ సినిమా కలెక్షన్స్ ఫై ప్రభావం చూపించాయి.బుధవారం ఇండియా -న్యూజిలాండ్ మ్యాచ్ జరుగగా ఆ రోజు ఈసినిమా 20.50కోట్ల వసూళ్లను సొంతం చేసుకోగలిగింది.ఇక నిన్న రెండో సెమిస్ కూడా పాక్షికంగా ప్రభావం చూపించింది.నిన్న ఈసినిమా 18కోట్ల వసూళ్లను రాబట్టింది.దాంతో 5రోజుల్లో ఈసినిమా హిందీ వెర్షన్ ఇండియాలో 183కోట్ల నెట్ వసూళ్లను రాబట్టుకుంది.తెలుగు,తమిళ వెర్షన్ లు కలుపుకొని 5.25కోట్ల నెట్ వసూళ్లను రాబట్టుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఓవరాల్ గా చూసుకుంటే ప్రపంచ వ్యాప్తంగా 5రోజుల్లో టైగర్ 3 దాదాపు 270కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది.ఈరోజుతో మూడు వందల కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది.ఈరోజు,రేపు సాలిడ్ వసూళ్లను రాబట్టుకోనుంది కానీ ఆదివారం మాత్రం కలెక్షన్స్ డ్రాప్ అవ్వడం ఖాయం.ఎందుకంటే అదే రోజున ఇండియా – ఆస్ట్రేలియా మధ్య వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరుగనుంది.దాంతో ఆ ప్రభావం సినిమా కలెక్షన్స్ పై పడనుంది.
యాక్షన్ ఎంటర్టైనర్ గా మనీష్ శర్మ తెరకెక్కించిన ఈసినిమాలో సల్మాన్ సరసన కత్రినా కైఫ్ నటించగా కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ కామియో రోల్ లో కనిపించాడు.సుమారు 300కోట్ల బడ్జెట్ తో యాష్ రాజ్ ఫిలిమ్స్ ఈసినిమాను నిర్మించింది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: