పెద్ద పెద్ద సినిమాలకు ఈమధ్య లీకుల బెడద మరీ ఎక్కువైపోయింది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. చర్యలు తీసుకుంటామని చెబుతున్నా కూడా ఏదో ఒక రకంగా లీకులు బయటపడుతూనే ఉన్నాయి. ఈనేపథ్యంలోనే మరోసారి సలార్ టీమ్ సీరియస్ వార్నింగ్ ఇచ్చేసింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వస్తున్న సినిమా సలార్. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. మరోవైపు చిన్నగా ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు మేకర్స్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా తాజాగా లీకురాయుళ్లకు ఒక షాకిచ్చింది చిత్రయూనిట్. సలార్ సినిమా లీకైన కంటెంట్ ను స్ప్రెడ్ చేస్తున్న ఓ ఇద్దరిని సైబర్ క్రైమ్ వారు అరెస్ట్ చేసినట్టు తెలిపారు. అంతేకాదు ఇక నుంచి ఎవరైనా సలార్ విషయంలో ఇలా చేస్తే సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుందని స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చారు.
Two individuals have been caught by Cybercrime Police for spreading unauthorised content of #Salaar on social media platforms.
Word of Caution: 🚫 Strict action will be taken against those involved in unauthorised leaks related to @SalaarTheSaga.
— BA Raju’s Team (@baraju_SuperHit) November 17, 2023
ఈసినిమాలో శృతీ హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు, శ్రేయ రెడ్డి కీలక పాత్రలలో నటిస్తున్నారు. హోంబలే ఫిలిమ్స్ పతాకంపై బ్లాక్ బస్టర్ మూవీ ‘కె.జి.యఫ్’ నిర్మించిన విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా భువన్ గౌడ సినిమాటోగ్రఫర్ గా పనిచేయనున్నారు. డిసెంబర్ 22వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
[td_block_video_youtube playlist_title=”” playlist_yt=”_vX4Lqi5bcs,XOF
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: