
ట్యాగ్ · 17286 కథనాలు · పేజీ 220


హనుమాన్ 5డేస్ కలెక్షన్స్

హనుమాన్ టీమ్‌ని అభినందించిన నందమూరి బాలకృష్ణ

నాకు ఇమిటేట్ చేయడం బాగా వచ్చు-మహేష్

గుంటూరు కారం బీడీ సీక్రెట్ చెప్పిన మహేష్

హనుమాన్ డే 1 కలెక్షన్స్

గుంటూరు కారం కోసం చూస్తున్నా మహేష్

అయోధ్య వేడుకకు.. రామ్ చరణ్, ఉపాసనలకు ఆహ్వానం

హనుమాన్ హిందీ కలెక్షన్స్

రివ్యూ : సైంధవ్

కటీలు దుర్గా పరమేశ్వరిని దర్శించుకున్న ప్రభాస్

బాలీవుడ్‌లో దుమ్ము రేపుతున్న హనుమాన్
టాలీవుడ్ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో తేజ సజ్జా, క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబోలో రూపొందిన 'హనుమాన్' చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. సోషియో ఫాంటసీ జానర్‌లో తెరకెక్కిన ఈ సినిమాపై విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొనగా.. అందుకు తగ్గట్లే ప్రీమియర్స్ తోనే బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఈ పండుగకు మహేష్ బాబు-త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన 'గుంటూరు కారం', వెంకటేష్-శైలేష్ కొలను తీసిన 'సైంధవ్', నాగార్జున-విజయ్ బిన్నీ కాంబోలో రూపొందిన 'నా సామిరంగ' సినిమాలు బాక్సాఫీస్ బరిలో ఉన్నా.. వాటిని తట్టుకుని మరీ హనుమాన్ సూపర్ హిట్ అవ్వడం సినీ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరిచింది.

హనుమాన్ 5డేస్ కలెక్షన్స్
హనుమాన్ జోరు ఇప్పట్లో ఆగేలాలేదు.చిన్న సినిమాగా సంక్రాంతి పోటీలో దిగి ఊహించని వసూళ్లను రాబట్టుకుంటూ బాక్సాఫీస్ వద్ద హావ కొనసాగిస్తోంది.నిన్నఈసినిమా 100కోట్ల మార్క్ ను క్రాస్ చేసి సాలిడ్ హోల్డ్ ను కొనసాగించింది.దాంతో 5రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 114కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకుంది.ఇందులో షేర్ 60కోట్లు.ఇక30 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈసినిమా 5రోజుల్లోనే అంతకు రెట్టింపు కలెక్ట్ చేసి డబుల్ బ్లాక్ బాస్టర్ అనిపించుకుంది.

హనుమాన్ టీమ్‌ని అభినందించిన నందమూరి బాలకృష్ణ
టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో తేజ సజ్జా, క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబోలో రూపొందిన తాజా చిత్రం 'హనుమాన్'. అమృత అయ్యర్ హీరోయిన్‌గా నటించగా.. వరలక్ష్మి శరత్ కుమార్, వెన్నెల కిశోర్, సత్య, గెటప్ శ్రీను తదితరులు ఇతర కీలక పాత్రల్లో కనిపించారు. శ్రీమతి చైతన్య సమర్పణలో ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై కె నిరంజన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బరిలో అగ్రహీరోల చిత్రాలున్నప్పటికీ అద్భుతమైన కంటెంట్‌తో అంచనాలకు మించి హిట్ అయింది.

నాకు ఇమిటేట్ చేయడం బాగా వచ్చు-మహేష్
ఎంతోకాలంగా వెయిట్ చేసిన మహేష్ గుంటూరు కారం సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్నో అంచనాల మధ్య ఈసినిమా జనవరి12వ తేదీన రిలీజ్ అయి హిట్ టాక్ ను తెచ్చుకుంది. ఈసినిమాలో మహేష్ మాస్ విశ్వరూపం చూపించాడని చెప్పొచ్చు. మహేష్ డైలాగ్ డెలివరీ, మేకోవర్, డ్యాన్స్ తో వన్ మ్యాన్ షో చేశాడు. ఇక ఈసినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించగా కీలక పాత్రల్లో జయరాం, రమ్యకృష్ణ, జగపతి బాబు, సునీల్, ఈశ్వరి రావు, రఘుబాబు నటించారు.

బ్రేక్ ఈవెన్ కు దగ్గరగా నా సామిరంగ సాలిడ్ కలెక్షన్స్
మొత్తానికి ఈసంక్రాంతికి కూడా మంచి హిట్ ను అందుకున్నాడు కింగ్ నాగార్జున. సంక్రాంతి తనకు కలిసొస్తుందని మరోసారి ఈసినిమా నిరూపించింది. సోగ్గాడే చిన్ని నాయన, బంగార్రాజు సినిమాలు కూడా సంక్రాంతికి రిలీజ్ అయి హిట్లను అందించాయి. ఇక ఈ మధ్య కాలంలో ఒకటి రెండు సినిమాలు వచ్చినా అవి సరైన విజయాన్ని అందించలేకపోయాయి. ఇప్పుడు నా సామిరంగ సినిమాతో వచ్చాడు. మాస్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈసినిమా డీసెంట్ హిట్ ను ఇచ్చింది. నాగార్జునతో పాటు అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కూడా కీలక పాత్రల్లో నటించారు.

నాన్నా నువ్వు నా ప్రాణం- అకీరా మరో సూపర్ కంపోజిషన్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్ గురించి ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు. బయట పెద్దగా కనిపించకపోయినా తన టాలెంట్స్ తో మాత్రం ఎప్పుడూ టాక్ ఆఫ్ ద టౌన్ అవుతూనే ఉంటాడు. ఇక ఈసారి మరోసారి అకీరా నందన్ పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు సంగతేంటంటే.. ఏ పండగనైనా మెగా ఫ్యామిలీ ఎలాా సెలబ్రేట్ చేసుకుంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మిగిలిన సమయాల్లో ఎలా ఉన్నా పండుగ సమయాల్లో మాత్రం మెగా, అల్లు ఫ్యామిలీ ఇరు కుటుంబసభ్యులు కలిసి ఎంజాయ్ చేస్తుంటారు. అలా సంక్రాంతికి అందరూ ఒకచోట చేరి పండగను సెలబ్రేట్ చేసుకున్నారు.

ఒకే ఫ్రేమ్‌లో మెగా హీరోలు.. చిరు, నాగబాబు సెల్ఫీ వైరల్
తెలుగునాట సంక్రాంతి పండుగకు ఉన్న ప్రత్యేకత అంతా ఇంతా కాదు. విద్య, ఉద్యోగ, జీవనోపాధికోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లినవారంతా ఈ పండుగ వేళ సొంతూర్లకు చేరుకోవడం సర్వసాధారణం. ఈ నేపథ్యంలో ఈ ఏడాది సాధారణ ప్రజలతోపాటు పలువురు సినీ ప్రముఖులు సైతం ఈ పండుగను అద్భుతంగా జరుపుకున్నారు. ఇక ప్రతి పండుగను వేడుకలా సెలబ్రేట్ చేసుకోవడం మెగా ఫ్యామిలీకి అలవాటన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా వారు సంక్రాంతి పండుగను ప్రత్యేకంగా జరుపుకున్నారు. బెంగుళూరులోని ఫాంహౌస్‌లో మెగా ఫ్యామిలీ ఈ పర్వదినాన్ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు.

గుంటూరు కారం బీడీ సీక్రెట్ చెప్పిన మహేష్
సూపర్ స్టార్ హీరోగా వచ్చిన సినిమా గుంటూరు కారం. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఫుల్ మాస్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా తెరకెక్కింది. ఇక ఈసినిమా జనవరి 12వ తేదీన రిలీజ్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈసినిమా హిట్ టాక్ ను అయితే సొంతం చేసుకుంది. ముఖ్యంగా మహేష్ నటనకు అందరూ ఫిదా అవుతున్నారు. కలెక్షన్స్ పరంగా కూడా ఈసినిమా సాలిడ్ కలెక్షన్స్ ను అందుకుంటుంది.

సినిమా రిజల్ట్ పై హరీష్ శంకర్-రవితేజ ఫన్నీ సంభాషణ
మాస్ మహారాజాా రవితేజ సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. గత ఏడాది మూడు సినిమాలతో వచ్చిన రవితేజ ఈ ఏడాది పలు సినిమాలను లైన్ లో పెట్టాడు. ముందుగా రిలీజ్ కాబోతున్న సినిమా ఈగల్. ఈసినిమా సంక్రాంతికే రిలీజ్ అవ్వాలి కానీ వాయిదా పడింది. ఫిబ్రవరి 9వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈసినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మించారు.

హనుమాన్ డే 1 కలెక్షన్స్
పెయిడ్ ప్రీమియర్స్ షోస్ నుండే సెన్సేషన్ క్రీయేట్ చేసిన హనుమాన్ విడుదలైన మొదటిరోజు అదే ట్రెండ్ ను కొనసాగించింది.దాంతో సాలిడ్ కలెక్షన్స్ ను రాబట్టుకుంది.తెలుగు రాష్ట్రాల్లో దాదాపు అన్ని షోస్ హౌస్ ఫుల్ అవ్వగా ప్రీమియర్స్ తో కలుపుకొని తొలి రోజు 12కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది. ఇందులో షేర్ 7కోట్లు.అయితే కావాల్సినవన్ని థియేటర్లు దొరకకపోవడం ప్రతికూలంగా మారింది లేకపోతే దీనికి రెట్టింపు వసూళ్లను రాబట్టుకునేదే.అటు ఓవర్సీస్ లో మిలియన్ మార్క్ ను క్రాస్ చేసి లాభాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.

గుంటూరు కారం కోసం చూస్తున్నా మహేష్
సూపర్ స్టార్ హీరోగా వచ్చిన సినిమా గుంటూరు కారం. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఫుల్ మాస్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా తెరకెక్కింది. ఎన్నో అంచనాల మధ్య ఈసినిమా నిన్న రిలీజ్ అయి హిట్ టాక్ ను తెచ్చుకుంది. ఈసినిమాలో మహేష్ మాస్ విశ్వరూపం చూపించాడని చెప్పొచ్చు. మహేష్ డైలాగ్ డెలివరీ, మేకోవర్, డ్యాన్స్ తో వన్ మ్యాన్ షో చేశాడు. ఇక ఈసినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించగా కీలక పాత్రల్లో జయరాం, రమ్యకృష్ణ, జగపతి బాబు, సునీల్, ఈశ్వరి రావు, రఘుబాబు నటించారు.

అయోధ్య వేడుకకు.. రామ్ చరణ్, ఉపాసనలకు ఆహ్వానం
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులకు అరుదైన గౌరవం దక్కింది. అయోధ్యలోని రామమందిరంలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠాపన జరుగనున్న నేపథ్యంలో.. ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా వారికి ప్రత్యేక ఆహ్వానం అందింది. దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమానికి మొత్తం 8వేల మందిని ప్రత్యేక అతిథులుగా ఆహ్వానిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా రామ్ చరణ్ దంపతులకు రామ్ మందిర్ క్షేత్ర తీర్థ్ ట్రస్ట్ ఆహ్వానం పలికింది. ఈ మేరకు ట్రస్ట్ ప్రతినిధి నేడు చరణ్ దంపతులకు ఆహ్వాన పత్రికను అందజేశారు.

హనుమాన్ హిందీ కలెక్షన్స్
ఊహించినట్లుగానే హనుమాన్ హిందీలో రచ్చ చేయడం స్టార్ట్ చేసింది.మౌత్ టాక్ ఎక్స్ట్రార్డినరీ గా ఉండడంతో మొదటి రోజు సాలిడ్ కలెక్షన్స్ ను రాబట్టింది.హాలిడే కాకున్నా పెద్దగా ప్రమోషన్స్ కూడా చేయకున్నా తొలి రోజు హిందీ వెర్షన్ 2.15కోట్ల వసూళ్లను రాబట్టుకుంది.అలాగే నార్త్ లో తెలుగు వెర్షన్ 24లక్షలు రాబట్టింది. ఇక ఈరోజు అడ్వాన్స్ బుకింగ్స్ సూపర్ గా వున్నాయి.కార్తికేయ 2 కూడా ఇలాగే స్టార్ట్ చేసి సెన్సేషనల్ వసూళ్లను రాబట్టుకుంది.ఇప్పుడు హనుమాన్ వంతు వచ్చింది.

గుంటూరు కారం ఫస్ట్ డే రాంపేజ్ కలెక్షన్స్
ఎంతోకాలంగా వెయిట్ చేసిన మహేష్ గుంటూరు కారం సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. త్రివిక్రమ్-మహేష్ కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా అవ్వడంతో ఈసినిమాపై భారీ అంచనాలే పెరిగాయి. ఇక ఎన్నో అంచనాల మధ్య ఈసినిమా నిన్న రిలీజ్ అయింది. ఫస్ట్ షో నుండే ఈసినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకొని హిట్ ను అందుకుంది. ఇక ఈసినిమాలో మహేష్ బాబును ఇంతకు ముందు ఎప్పుడూ చూడని మాస్ లుక్ లో చూపించారు త్రివిక్రమ్. మహేష్ క్యారెక్టరైజేషన్ సినిమాకు హైలైట్ గా నిలిచింది. మహేష్ బాబు ఎనర్జిటిక్ పెర్ఫామెన్స్, డైలాగ్ డెలివరీ అన్నీ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.

ప్రభాస్-మారుతి మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్ టైమ్ ఫిక్స్
ప్రభాస్ ప్రస్తుతం పలు పాన్ ఇండియా, పాన్ వరల్డ్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వస్తున్న సినిమా కల్కి2898ఏడీ. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఫ్యూచరిస్ట్ గా ఈసినిమా వస్తుంది. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను ముగించుకుంటుంది. ఈసినిమాను మే 9వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు తాజాగా ప్రకటించారు. దీనితో పాటు సలారు పార్ట్ 2 లైన్ లో ఉంది. ఇంకా సందీప్ వంగా తో స్పిరిట్, మారుతి తో మరో సినిమా లిస్ట్ లో ఉన్నాయి.

రివ్యూ : సైంధవ్
ఓవరాల్ గా మంచి అంచనాల మధ్య వచ్చిన సైంధవ్ మెప్పిస్తాడు.ఇందులో వెంకటేష్ నటన,యాక్షన్ సీక్వెన్స్,నవాజుద్దీన్ సిద్దిఖీ పాత్ర హైలైట్ అయ్యాయి.ఓ మంచి యాక్షన్ ఎంటర్టైనర్ ను చూడాలనుకుంటే సైంధవ్ చూసేయొచ్చు.

గుంటూరు కారం.. రికార్డ్ బ్రేకింగ్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ఓపెనింగ్ కలెక్షన్స్
సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ ఫిలిం గుంటూరు కారం. వీరిద్దరి కాంబినేషన్ పై ఎలాంటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈనేపథ్యంలోనే ఈసినిమాపై రిలీజ్ కు ముందే టీజర్, ట్రైలర్, పాటలతో మంచి బజ్ ను క్రియేట్ చేశారు. దానికితోడు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు యూఎస్ లో కూడా ఈసినిమాకు ఓ రేంజ్ లో అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి.

నా సామిరంగ నుంచి.. ‘సీసా మూత ఇప్పు’ లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్
టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున అక్కినేని కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘నా సామిరంగ’. ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. . ‘ఆస్కార్’ అవార్డ్ విన్నర్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి అందించిన పాటలు ఇప్పటికే చార్ట్ బస్టర్‌గా నిలిచాయి. ఇక ఈ సినిమాలో ఆషిక రంగనాథ్ హీరోయిన్‌గా నటించగా.. టాలీవుడ్ ట్యాలెంటెడ్ నటులు అల్లరి నరేష్, రాజ్ తరుణ్, రుక్సర్ ధిల్లాన్, మిర్నా మీనన్ కీలక పాత్రలు పోషించారు. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీని శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌పై శ్రీనివాస చిట్టూరి హై బడ్జెట్‌తో నిర్మించారు. కాగా ‘నా సామిరంగ’ చిత్రం సంక్రాంతి కానుకగా ఈ…

కటీలు దుర్గా పరమేశ్వరిని దర్శించుకున్న ప్రభాస్
రీసెంట్ గానే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సలార్ తో సాలిడ్ బ్లాక్ బస్టర్ ను అందుకున్నాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ఈసినిమా వచ్చింది. ఈ సినిమా రెండు పార్ట్ లుగా వస్తుండగా మొదటగా సలార్.. సీజ్ ఫైర్ తో మొదటి పార్ట్ ను రిలీజ్ చేశారు. ఇక ఈసినిమా ఏ రేంజ్ లో హిట్ అయిందో చూశాం. ఎప్పటినుండో ప్రభాస్ ను ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో చూడాలని వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ నే అందించాడు ప్రశాంత్ నీల్.

మాట నిలబెట్టుకున్న హనుమాన్ టీమ్.. అయోధ్య రామమందిరానికి విరాళం అందజేత
'హనుమాన్' చిత్రయూనిట్ చేసిన వాగ్దానాన్ని నిలుపుకుంది. సినిమా విడుదలకు ముందు చెప్పినట్లుగానే హనుమాన్ సినిమా కలెక్షన్లలో నుంచి కొంత మొత్తాన్ని అయోధ్య రామమందిరానికి విరాళంగా ఇచ్చింది. కాగా 'హనుమాన్' సినిమాకు అమ్ముడయ్యే ప్రతీ టికెట్ నుంచి రూ.5ను అయోధ్య రామమందిరానికి విరాళంగా ఇస్తామని చిత్రబృందం ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిప్రకారం.. ఇచ్చినమాట నిలబెట్టుకుంటూ రిలీజ్‍కు ముందురోజు ప్రదర్శించిన ప్రీమియర్ షోల ద్వారా వచ్చిన ఆదాయంలో నుంచి రూ.14.85 లక్షలను విరాళంగా అందించింది. ఈ మేరకు ప్రీమియర్ల నుంచి వచ్చిన కలెక్షన్లలో రూ.14,85,810 మొత్తాన్ని చెక్ రూపంలో తొలి విడతగా అయోధ్య శ్రీ రామ జన్మభూమి తీర్థ్…