
ట్యాగ్ · 17286 కథనాలు · పేజీ 219


హనుమాన్ మూవీపై సమంత ప్రశంసలు

ఆశిష్-వైష్ణవి చైతన్య మూవీ షూటింగ్ కంప్లీట్

విశ్వంభర టీమ్ కు చరణ్ బెస్ట్ విషెస్

100కోట్ల షేర్ మార్క్ ను దాటిన గుంటూరు కారం

హనుమాన్ హిందీ కలెక్షన్స్

ధనుష్-నాగార్జున-శేఖర్ కమ్ముల మూవీ గ్రాండ్ లాంచ్

క్రేజీ కాంబో వచ్చేస్తుంది

యూఎస్ లో దేశీ హనుమాన్ హవా.. 4M డాలర్ల క్లబ్

అయలాన్ 5డేస్ కలెక్షన్స్

కెప్టెన్ మిల్లర్ తెలుగు ట్రైలర్ రిలీజ్

నాగ్ సంక్రాంతి హ్యాట్రిక్

అయలాన్ తెలుగు రిలీజ్ డేట్ ఫిక్స్

ఊరు పేరు భైరవకోన.. ఎలా ఉంటుందంటే? - సందీప్ కిషన్
టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో సందీప్ కిషన్, క్రియేటివ్ డైరెక్టర్ విఐ ఆనంద్ కాంబోలో రూపొందుతోన్న మోస్ట్ అవైటెడ్ ఫాంటసీ అడ్వెంచర్ మూవీ ‘ఊరు పేరు భైరవకోన’. కావ్య థాపర్, వర్ష బొల్లమ్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు. హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా నిర్మిస్తుండగా, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర సమర్పిస్తున్నారు. బాలాజీ గుత్తా ఈ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. శేఖర్ చంద్ర సంగీతం అందిస్తుండగా.. రాజ్ తోట సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం టీజర్, పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఫిబ్రవరి 9న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపధ్యంలో…

హనుమాన్ మూవీపై సమంత ప్రశంసలు
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా వచ్చిన పాన్ ఇండియా సినిమా హనుమాన్ . హనుమంతుడి స్పూర్తితో సూపర్ హీరోస్ నేపథ్యంలో ఈసినిమా వచ్చింది. ఇక ఈసినిమా ఇప్పుడు ఎంత ప్రభంజన సృష్టిస్తుందో చూస్తూనే ఉన్నాం. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈసినిమా జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఫస్ట్ షో నుండే ఈసినిమా హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక చిన్న పిల్లల దగ్గర నుండి పెద్ద వారివరకూ అందరూ ఈసినిమా కోసం బ్రహ్మరధం పడుతున్నారు. ప్రశాంత్ వర్మ మేకింగ్, తేజ సజ్జా నటన ఈసినిమాకు హైలెట్ గా నిలిచాయి.

ఆశిష్-వైష్ణవి చైతన్య మూవీ షూటింగ్ కంప్లీట్
అరుణ్ భీమవరపు దర్శకత్వంలో ఆశిష్ హీరోగా ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. యూత్ ఫుల్ మాస్ ఎంటర్‌టైనర్ ఈసినిమా రాబోతుంది. ఇక ఈసినిమా షూటింగ్ ను ఎప్పుడో మొదలుపెట్టారు మేకర్స్. ఆశిష్3 అనే వర్కింగ్ టైటిల్ తోనే ఈసినిమా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక తాజాగా ఈసినిమాకు సంబంధించిన అప్ డేట్ ఇచ్చాడు ఆశిష్. ఈసినిమా షూటింగ్ పూర్తయిందని.. అరుణ్ గారు నామీద నమ్మకం ఉంచి నేను ఈ రోల్ చేయగలనని నమ్మి నాకు ఇచ్చినందుకు చాలా థాంక్స్.. మరోసారి మీతో పనిచేసే అవకాశం వస్తుందని కోరుకుంటున్నాను.. ఇంకా కీరవాణి సార్, పీసీ శ్రీరామ్ లాంటి లెజెండ్స్ తో కలిసి పనిచేయడం గొప్ప ఆపర్చునిటీ.. వైష్ణవి చైతన్య నీతో కలిసి స్క్రీన్ షేర్…

విశ్వంభర టీమ్ కు చరణ్ బెస్ట్ విషెస్
మెగాస్టార్ చిరంజీవి కూడా ఒక సినిమా తరువాత మరొక సినిమాను చేసుకుంటూ వెళుతున్నారు. గత ఏడాది వాల్తేరు వీరయ్య, భోళా శంకర్ సినిమాలు రిలీజ్ చేయగా అందులో భోళా శంకర్ బ్లాక్ బస్టర్ ను అందించగా.. భోళా శంకర్ పరాజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు మరో సినిమాతో బిజీ అయిపోయారు. బింబిసార సినిమాతో మంచి క్రేజ్ ను సొంతం చేసుకున్న మల్లిడి వశిష్ట దర్శకత్వంలో చిరు హీరోగా ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా.

100కోట్ల షేర్ మార్క్ ను దాటిన గుంటూరు కారం
సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం 100కోట్ల షేర్ ను టచ్ చేసింది.నిన్న కూడా ఈసినిమా స్ట్రాంగ్ గా హోల్డ్ చేయడంతో 100కోట్ల మార్క్ ను చేరుకుంది.ముఖ్యంగా ఆంధ్రాలో ఎక్స్ట్రా ర్డినరీ రన్ ను కొనసాగిస్తోంది.ఇదే రన్ ను కొనసాగిస్తే వచ్చే వారంలో బ్రేక్ ఈవెన్ మార్క్ ను చేరుకోనుంది.ఇక మహేష్ కు ఇది 5వ 100కోట్ల షేర్ సినిమా.భరత్ అనే నేను,మహర్షి ,సరిలేరు నీకెవ్వరు,సర్కారు వారి పాటతో ఇంతకుముందు ఈ ఫీట్ సాధించాడు.ఇవన్నీ రీజినల్ మూవీస్ కావడం గమనార్హం.పాన్ ఇండియా రిలీజ్ లేకుండా మహేష్ ఈ ఘనత సాధించాడు.

నెట్ ఫ్లిక్స్ ఖాతాలో తంగలాన్, ఇండియన్ 2
ప్రస్తుతం ఓటీటీల డిమాండ్ ఎంత పెరిగిందో చూస్తూనే ఉన్నాం. నిజానికి కరోనా ముందు కరోనా తరువాత అన్నట్టు ఉంది ఓటీటీ ప్రభావం. కరోనాకు ముందు ఓటీటీల ప్రభావం పెద్దగా ఉండేది కాదు. అప్పట్లో వెబ్ సిరీస్ లు ఎక్కువగా వచ్చేవి. సినిమాలు రిలీజ్ అయిన తరువాత ఎప్పటికో కానీ వచ్చేవి కాదు. కానీ లాక్ డౌన్ లో పరిస్థితి మొత్త మారిపోయింది. జనాలు ఇంట్లోనుండి బయటకు వెళ్లలేని పరిస్థితి వచ్చింది. థియేటర్లు కూడా మూతపడటంతో చాలా సినిమాలు కూడా డైరెక్ట్ గా ఓటీటీలోనే రిలీజ్ అయ్యాయి. దాంతో ఓటీటీలకు డిమాండ్ పెరిగిపోయింది. ఇక ఇప్పుడు సినిమా రిలీజ్ అయిన కొద్ది రోజులకే ఓటీటీల్లోకి వచ్చేస్తుండటంతో కొంతమంది ఓటీటీలోకి వచ్చిన తరువాత…

హనుమాన్ హిందీ కలెక్షన్స్
హనుమాన్ గ్లోబల్ వైడ్ గా దుమ్మురేపుతుంది.ఎక్కడా డ్రాప్ అవ్వకుండా సాలిడ్ హోల్డ్ ను కొనసాగిస్తూ వసూళ్లను రాబట్టుకుంటుంది.నిన్నటితో ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 128కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది.తెలుగు రాష్ట్రాల్లో అయితే మరోసారి అద్భుతమైన రన్ ను కొనసాగించింది దాంతో 6వ రోజు 5కోట్ల షేర్ ను రాబట్టుకుంది.6రోజుల్లో ఈసినిమా 35కోట్ల షేర్ ను క్రాస్ చేసింది.అటు ఓవర్సీస్ లో అయితే డ్రీం రన్ ను కొనసాగిస్తోంది.స్టార్ హీరోలకు సైతం సాధ్యం కానీ ఫిగర్స్ ను క్రాస్ చేసి సెన్సేషన్ సృష్టిస్తుంది.నిన్నటివరకు అక్కడ 4మిలియన్ డాలర్ వసూళ్లతో రికార్డు సృష్టించింది.

ఎన్టీఆర్, పౌరాణిక పాత్రలపై.. ప్రశాంత్ వర్మ కామెంట్స్ వైరల్
దేశవ్యాప్తంగా ప్రస్తుతం ‘హనుమాన్’ నామస్మరణ ప్రతిధ్వనిస్తోంది. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా, భాషతో సంబంధం లేకుండా అన్ని రాష్ట్రాలలో ‘హనుమాన్’ సినిమా ఆబాలగోపాలాన్ని ఆకట్టుకుంటోంది. నాడు హనుమంతుడు సూక్ష్మరూపం నుంచి స్థూలరూపం ధరించినట్లు చిన్న సినిమాగా విడుదలై అతి పెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది. దేశంలోనే కాకుండా ఒవర్సీస్‌లో సైతం ప్రభనజనం సృష్టిస్తోంది. ఈ క్రమంలో సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ మూవీ నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లకుపై పైగా వసూలు చేసింది. ఈ నేపథ్యంలో చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మకు దేశవ్యాప్తంగా గుర్తింపు లభించింది.

ధనుష్-నాగార్జున-శేఖర్ కమ్ముల మూవీ గ్రాండ్ లాంచ్
ప్రస్తుతం ఇండస్ట్రీలో డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ ను చూస్తున్నాం. ఒకప్పుడు ఒక హీరో సినిమాలో మరో హీరో చేయడం చాలా అరుదుగా ఉండేది. ఎన్టీఆర్, ఏఎన్నార్ టైమ్ లో అలాంటి సినిమాలు చూశాం. ఆ తరువాత జనరేషన్ లో ఎవరి సినిమాలో వారే చేసుకునేవారు. కానీ ఇప్పుడు మళ్లీ పంథా మారింది. స్టార్ హీరోలు సైతం వేర హీరోల సినిమాల్లో చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు. పాత్ర నిడివి ఎంత ఉంది అనే విషయాన్ని కూడా పట్టించుకోవట్లేదు. విక్రమ్ సినిమాలో సూర్య కనిపించేది లాస్ట్ పది పదిహేను నిమిషాలు మాత్రమే కానీ తన పాత్ర ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో చూశాం కదా.. అందుకే అతిథి పాత్రలకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు.

థ్రిల్లింగ్ అంశాలతో ఆకట్టుకుంటున్న ఊరు పేరు భైరవకోన ట్రైలర్
టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ నుండి రాబోతున్న మోస్ట్ వాంటెడ్ సినిమా ఊరు పేరు భైరవ కోన. మిస్టరీ థ్రిల్లర్ నేపథ్యంలో ఫాంటసీ అడ్వంచర్ గా ఈసినిమా వస్తుడటంతో ఈసినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈసినిమా కాన్సెప్టే సినిమాపై క్యూరియాసిటీని పెంచుతుంది. గరుడ పురాణంలో మిస్సయిన నాలుగు పేజీల్లో ఏముంది అనే సస్పెన్స్ తో ఈ సినిమా వస్తుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. రిలీజ్ డేట్ పై కూడా రీసెంట్ గానే క్లారిటీ కూడా ఇచ్చేశారు. ఫిబ్రవరి 9వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను షురూ చేసింది.

ఎన్టీఆర్ వర్ధంతి.. నివాళులు అర్పించిన బాలకృష్ణ, జూ. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) వర్ధంతి నేడు (గురువారం, జనవరి 18, 2024). ఈ సందర్భంగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన కుటుంబసభ్యులు నివాళులర్పించారు. ఈ మేరకు ఎన్టీఆర్ కుమారుడు, టాలీవుడ్ సీనియర్ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, మనవళ్లు జూ. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఈ ఉదయమే అక్కడికి చేరుకొని ఘనంగా అంజలి ఘటించారు. అలాగే ఎన్టీఆర్ ఇతర కుటుంబ సభ్యులు రామకృష్ణ, దివంగత హరికృష్ణ కుమార్తె సుహాసిని తదితరులు విచ్చేసారు. ఇక వీరితోపాటుగా పలువురు నందమూరి అభిమానులు, టీడీపీ సానుభూతిపరులు…

క్రేజీ కాంబో వచ్చేస్తుంది
తమిళ్ స్టార్ హీరో ధనుష్ మాత్రం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. అంతేకాదు అలానే విజయాలను కూడా అందుకుంటున్నాడు. ఈ ఏడాది అలా స్టార్ట్ అయిందో లేదో అప్పుడే ఒక హిట్ ను అందుకున్నాడు. సంక్రాంతికి కెప్టెన్ మిల్లర్ అనే సినిమాతో వచ్చాడు. పీరియాడిక్ డ్రామాగా వచ్చిన ఈసినిమాలో ధనుష్ తన నటనతో మరో మెట్టు ఎక్కాడు. ఈసినిమా తమిళ్ లో రిలీజ్ అవ్వగా అక్కడ సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. తెలుగులో జనవరి 25వ తేదీన రిలీజ్ కాబోతుంది

యూఎస్ లో దేశీ హనుమాన్ హవా.. 4M డాలర్ల క్లబ్
ప్రస్తుతానికి ఎక్కడ చూసినా హనుమాన్ ప్రభంజనమే కనిపిస్తుంది. భాషతో సంబంధం లేకుండా ఈసినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ప్రశాంత్ వర్మ మొదటినుండీ తన మార్క్ ను చూపిస్తూనే ఉన్నాడు. అ! సినిమా ఒక డిఫరెంట్ జోనర్.. కల్కి థ్రిల్లర్, జాంబిరెడ్డి తో హాలీవుడ్ లోనే వినే జాంబీస్ ను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశాడు. ఇక ఇప్పుడు సూపర్ హీరోస్ నేపథ్యంలో హనుమాన్ సినిమాను తీసి ఆ విషయంలో కూడా సక్సెస్ అయ్యాడు. అంతేకాదు తక్కువ బడ్జెట్ తో కూడా అబ్బురపరిచే విజువల్స్ ను సిల్వర్ స్క్రీన్ పై చూపించి శభాష్ అనిపించుకోవచ్చని కూడా నిరూపించాడు.

అయలాన్ 5డేస్ కలెక్షన్స్
కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ నటించిన అయలాన్ బాక్సాఫీస్ వద్ద హావ చూపిస్తుంది.ఈ పొంగల్ కు తమిళ్ లో ఈసినిమాతో పాటు ధనుష్ కెప్టెన్ మిల్లర్ కూడా రిలీజ్ అయ్యింది.రెండు సినిమాలకు పాజిటివ్ టాక్ వచ్చింది.అయితే అయలాన్ డామినేషన్ చూపిస్తుంది.ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తుండడంతో అయలాన్ స్ట్రాంగ్ హోల్డ్ ను కొనసాగిస్తుంది.5రోజుల్లో ఈసినిమా 50కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది.చివరి 24గంటల్లో బుక్ మై షో లో 100.64k టికెట్స్ బుక్ అయ్యాయి.ఫుల్ రన్ లో అయలాన్ 100కోట్ల మార్క్ ను చేరుకోనుంది.

కెప్టెన్ మిల్లర్ తెలుగు ట్రైలర్ రిలీజ్
అరుణ్ మాథేశ్వర్ దర్శకత్వంలో ధనుష్ హీరోగా వస్తున్న సినిమా కెప్టెన్ మిల్లర్. వరల్డ్ వార్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈసినిమా జనవరి 12వ తేదీన రిలీజ్ అయింది. ఈసినిమాను తమిళ్ తో పాటే తెలుగులో కూడా రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ అది కుదరకపోవడంతో కేవలం తమిళ్ లోనే రిలీజ్ చేశారు. అక్కడైతే ఈసినిమాకు అక్కడ మంచి ప్రశంసలే దక్కాయి. టీజర్, ట్రైలర్ ను చూసినప్పుడే మరోసారి పాత్ర ప్రధానమైన రోల్ తో వస్తున్నట్టు అర్థమయింది. ఇక సినిమా రిలీజ్ తరువాత ధనుష్ తన నటనతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చాడంటూ విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్నాడు. కలెక్షన్స్ పరంగా కూడా ఈసినిమా సాలిడ్…

నాగ్ సంక్రాంతి హ్యాట్రిక్
కింగ్ నాగార్జునకు సంక్రాంతి బాగా కలిసొచ్చింది.ఈసీజన్ లో విడుదలైన దాదాపు అన్ని సినిమాలు బ్లాక్ బాస్టర్ అయ్యాయి అందుకే ఈసారి పట్టు బట్టి మరీ సంక్రాంతి రేస్ లో దిగాడు.నాగ్ నటించిన నా సామి రంగ గత ఆదివారం విడుదలైన సంగతి తెలిసిందే.మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈసినిమా హిట్ దిశగా దూసుకుపోతుంది.మూడు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 25కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది.రేపటి తో బ్రేక్ ఈవెన్ ను క్రాస్ చేయనుంది.పండుగ సెలవులను పర్ఫెక్ట్ గా వాడుకొని వారం రోజుల్లోపే బ్రేక్ ఈవెన్ ను క్రాస్ చేసి లాభాలను తీసుకురానుంది.

నెట్ ఫ్లిక్స్ లో రానున్న తెలుగు సినిమాలు ఇవే
ప్రముఖ ఓటిటి నెట్ ఫ్లిక్స్ రానున్న రోజుల్లో టాలీవుడ్ నుండి 11 తెలుగు సినిమాలను స్ట్రీమింగ్ చేయనున్నామని ప్రకటించింది.అందులో దాదాపు అన్ని క్రేజీ సినిమాలే వున్నాయి.నెట్ ఫ్లిక్స్ పండగ పేరుతో థియేట్రికల్ రన్ తరువాత ఏ సినిమాలను స్ట్రీమింగ్ చేయనుందో చెప్పేసింది.ఆ సినిమాలను ఒకసారి చూస్తే ..రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ పార్ట్ 1 ఇటీవలే విడుదలై బ్లాక్ బాస్టర్ అయిన సంగతి తెలిసిందే.ఈసినిమాను నెట్ ఫ్లిక్స్ తెలుగు తోపాటుతమిళ ,కన్నడ ,మలయాళ భాషల్లో త్వరలోనే స్ట్రీమింగ్ లోకి తీసుకురానుంది.ఇక మచ్ అవైటెడ్ మూవీ దేవర అన్ని భాషల ఓటిటి హక్కులను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది.థియేట్రికల్ రిలీజ్ తరువాత…

NBK 109.. బాలకృష్ణ రోల్ పై బాబి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
నందమూరి బాలకృష్ణ హీరోగా బాబి దర్శకత్వంలో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతానికి ఎన్బీకే 109 అనే వర్కింగ్ టైటిల్ తోనే ఈసినిమా తెరకెక్కుతుంది. ఇక బాలకృష్ణ వరుస హిట్ల తరువాత, అలానే వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై ఇప్పటినుండే క్రేజ్ పెరిగింది. ఈమధ్యనే ఈసినిమా షూటింగ్ ను మొదలుపెట్టారు మేకర్స్.

అయలాన్ తెలుగు రిలీజ్ డేట్ ఫిక్స్
ఆర్ రవికుమార్ దర్శకత్వంలో శివ కార్తికేయన్ హీరోగా వచ్చిన సినిమా అయలాన్. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా కాబట్టి సినిమాపై మొదటి నుండీ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈసినిమా తమిళ్ లో ఇప్పటికే రిలీజ్ అయిపోయింది. పొంగల్ సందర్భంగా అక్కడ రిలీజ్ చేశారు. హీరో, ఏలియన్ కలిసి ఏం చేశారు అనే కాన్సెప్ట్ తో వచ్చింది. ఇక అక్కడ ఈసినిమా మంచి టాక్ నే సొంతం చేసుకుంది. మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. ఎప్పుడూ డిఫరెంట్ సినిమాలు తీసే శివ కార్తికేయన్ కు ఈసినిమాతో మరో హిట్ దక్కింది. హీరోకి, ఎలియన్ కు మధ్య వచ్చే సన్నివేశాలు ముఖ్యంగా విఎఫ్ఎక్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

ఆపరేషన్ వాలెంటైన్ ఫస్ట్ సింగిల్ వందేమాతరం సాంగ్ రిలీజ్
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమా ఆపరేషన్ వాలెంటైన్. సినిమాటోగ్రాఫర్ వీఎఫ్ఎక్స్ నిపుణుడు అయిన శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఈసినిమా ఇప్పటికే షూటింగ్ ను పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. నిజానికి ఈసినిమా కూడా గత ఏడాడి డిసెంబర్ లోనే రిలీజ్ చేయాల్సింది. అయితే షూటింగ్ ఆలస్యంగా ముగియడం.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు లేట్ అవడంతో సినిమా రిలీజ్ ను వాయిదా వేసుకున్నారు. ఫైనల్ గా ఫిబ్రవరి 16వ తేదీన ప్రేక్షకుల ఈముందుకు రానుంది. ఈనేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను షురూ చేశారు.