రీసెంట్ గానే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సలార్ తో సాలిడ్ బ్లాక్ బస్టర్ ను అందుకున్నాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ఈసినిమా వచ్చింది. ఈ సినిమా రెండు పార్ట్ లుగా వస్తుండగా మొదటగా సలార్.. సీజ్ ఫైర్ తో మొదటి పార్ట్ ను రిలీజ్ చేశారు. ఇక ఈసినిమా ఏ రేంజ్ లో హిట్ అయిందో చూశాం. ఎప్పటినుండో ప్రభాస్ ను ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో చూడాలని వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ నే అందించాడు ప్రశాంత్ నీల్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా కటీలులో కొలువైన దుర్గా పరమేశ్వరి అమ్మవారిని నిన్న దర్శించుకున్నారు ప్రభాస్. సలార్ సినిమా నిర్మాత విజయ్ కిరంగదూరుతో కటీలు వచ్చిన ఆయన అమ్మవారిని దర్శించి ఆశీస్సులు తీసుకున్నారు. ప్రభాస్‌కు ఆలయ ప్రతినిధులు అమ్మవారి పటాన్ని బహూకరించారు. ఈ ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
Rebel 🌟 #Prabhas & director #PrashanthNeel visited Sri Durga Parameshwari Temple, Kateel, near Mangalore today & took the divine blessings! 😍✨#Salaar #SalaarCeaseFire #TeluguFilmNagar pic.twitter.com/C08yev2vGg
— Telugu FilmNagar (@telugufilmnagar) January 12, 2024
కాగా ప్రభాస్ ప్రస్తుతం పలు పాన్ ఇండియా, పాన్ వరల్డ్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వస్తున్న సినిమా కల్కి 2898ఏడి. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఫ్యూచరిస్ట్ గా ఈసినిమా వస్తుంది. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను ముగించుకుంటుంది. ఈసినిమాను మే 9వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు తాజాగా ప్రకటించారు. దీనితో పాటు సలారు పార్ట్ 2 లైన్ లో ఉంది. ఇంకా సందీప్ వంగా తో స్పిరిట్, మారుతి తో మరో సినిమా లిస్ట్ లో ఉన్నాయి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: