ప్రభాస్-మారుతి మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్ టైమ్ ఫిక్స్

prabhas maruthi movie title and first look poster release date and time fixed

ప్రభాస్ ప్రస్తుతం పలు పాన్ ఇండియా, పాన్ వరల్డ్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వస్తున్న సినిమా కల్కి2898ఏడీ. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఫ్యూచరిస్ట్ గా ఈసినిమా వస్తుంది. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను ముగించుకుంటుంది. ఈసినిమాను మే 9వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు తాజాగా ప్రకటించారు. దీనితో పాటు సలారు పార్ట్ 2 లైన్ లో ఉంది. ఇంకా సందీప్ వంగా తో స్పిరిట్, మారుతి తో మరో సినిమా లిస్ట్ లో ఉన్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ప్రభాస్-మారుతి ఈసినిమా టైటిల్ ను ఫస్ట్ లుక్ ను పొంగల్ కు రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. తాజాగా రిలీజ్ డేట్ ను టైమ్ ను ఫిక్స్ చేస్తూ అప్ డేట్ ఇచ్చారు. జనవరి 15వ తేదీన ఉదయం 7 గంటల 8 నిమిషాలకు రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ తో ప్రభాస్ పొంగల్ ఫీస్ట్‌కు సిద్ధంగా ఉండండి అంటూ ట్వీట్ లో తెలిపారు.

కాగా ఈసినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఇక చాలా ఏళ్ల తర్వాత ప్రభాస్ మళ్లీ ఫుల్ ఫన్ ఉండే క్యారెక్టర్ చేస్తున్నారని తెలుస్తోంది. అయితే ఈసినిమా సెట్స్ పైకి వెళ్లడానికి మాత్రం ఇంకాస్త టైమ్ పడుతుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve − 8 =