సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ ఫిలిం గుంటూరు కారం. వీరిద్దరి కాంబినేషన్ పై ఎలాంటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈనేపథ్యంలోనే ఈసినిమాపై రిలీజ్ కు ముందే టీజర్, ట్రైలర్, పాటలతో మంచి బజ్ ను క్రియేట్ చేశారు. దానికితోడు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు యూఎస్ లో కూడా ఈసినిమాకు ఓ రేంజ్ లో అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఎన్నో అంచనాల మధ్య ఈసినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా నిన్న రిలీజ్ అయి ప్రేక్షకుల ముదుకు వచ్చింది. ఇక సినిమా మొత్తం మహేష వన్ మ్యాన్ షోగా నే నడించిందన్న ప్రశంసలు అందుకుంది. మహేష్ యాక్టింగ్, మహేష్ స్లాంగ్, మహేష్ డ్యాస్ అన్నీ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఇప్పుడు కలెక్షన్స్ లో కూడా కొత్త రికార్డులు క్రియేట్ చేయడం మొదలుపెట్టింది ఈసినిమా. అన్ని ఏరియాల్లో సాలిడ్ ఓపెనింగ్స్ ను అందుకున్నాయి. తాజాగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో రికార్డ్ ఓపెనింగ్స్ ను అందుకున్నాయి. ఫస్ట్ డే న 81.1 లక్షల కలెక్షన్స్ ను రాబట్టుకుంది. ఆర్ఆర్ఆర్ 75.87 లక్షలు, ఆదిపురుష్ 57 లక్షలు, సర్కారు వారి పాట 54.23 లక్షలు, కే.జి.యఫ్2 ని 50.71 లక్షలను సొంతం చేసుకోగా ఇప్పుడు గుంటూరు కారం అత్యధిక కలెక్షన్స్ ను రాబట్టుకొని కొత్త రికార్డ్ క్రియేట్ చేసుకుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: