నటీనటులు : వెంకటేష్,శ్రద్దా శ్రీనాథ్ ,నవాజుద్దీన్ సిద్దిఖీ,ఆర్య
ఎడిటింగ్ : గ్యారీ బిహెచ్
సినిమాటోగ్రఫీ :మణికందన్
సంగీతం : సంతోష్ నారాయణన్
దర్శకత్వం :శైలేష్ కొలను
నిర్మాత : వెంకట్ బోయనపల్లి
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసంక్రాంతికి మూడో సినిమాగా బరిలోకి దిగింది సైంధవ్.సీనియర్ హీరో వెంకటేష్ నటించిన ఈసినిమా ఈరోజే థియేటర్లలోకి వచ్చింది.హిట్ ఫేమ్ శైలేష్ కొలను డైరెక్ట్ చేశాడు.వెంకీకి ఇది 75వ సినిమా కూడా. విడుదలకు ముందు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ సినిమాకు హైప్ తీసుకొచ్చింది.చాలా కాలం తరువాత వెంకటేష్ నుండి వచ్చిన ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్టైనర్ కూడా ఇదే.మరి ఈ సైంధవ్ ఎలా వుందో ఇప్పుడు చూద్దాం.
కథ :
సైంధవ్ కోనేరు (వెంకటేష్) హార్బర్ లో పనిచేస్తూ తన కూతరు గాయత్రి (బేబీ సారా)తో కలిసి జీవనం సాగిస్తుంటాడు.అయితే గాయత్రి ప్రాణాంతకమైన వ్యాధి తో బాధపడుతూ ఉంటుంది.ఆజబ్బు నయం కావాలంటే 17కోట్ల ఇంజక్షన్ అవసరం అవుతుంది.ఈ ఇంజక్షన్ ను సంపాదించడానికి సైంధవ్ ఏం చేశాడు.అసలు తన గతం ఏంటి? పిల్లల ను అక్రమణ రవాణాచేసే గ్యాంగ్ తో ఎందుకు తలపడాల్సివచ్చింది? చివరికి వాటికీ ఎలా చెక్ పెట్టాడు అనేది మిగితా కథ.
విశ్లేషణ :
కథగా చూస్తే సైంధవ్ చాలా ఇంట్రెస్ట్ ను క్రీయేట్ చేస్తుంది.తన కూతురి కోసం ఓ తండ్రి ఏం చేశాడు అనేది మెయిన్ పాయింట్.దానికి మిగితా పాయింట్లను కూడా జోడించి రాసుకున్నాడు డైరెక్టర్ శైలేష్ కొలను.ఇక తను రాసుకున్నది అలాగే తెర మీదకు తీసుకురావడంలో సక్సెస్ అయ్యాడు.దీనికి వెంకటేష్ చాలా సహాకారం అందించాడు.
ఫస్ట్ హాఫ్ ఎమోషనల్ గా సాగుతూ మధ్యలో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ వావ్ అనిపిస్తూ ఆకట్టుకుంటుంది.దాంతో సెకండ్ హాఫ్ ఫై ఆసక్తి పెరుగుతుంది. అయితే మొదటి భాగంలో కథ పూర్తిగా రివీల్ చేయడంతో సెకండ్ హాఫ్ లో పెద్దగా చెప్పడానికి ఏం లేకుండా పోయింది.అయితే కథనంతో ఎంగేజింగ్ చేసి డీసెంట్ అనిపించడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు.ముఖ్యంగా క్లైమాక్స్ ఫైట్ సీన్స్ అదుర్స్ అనిపించాయి.చివర్లో సైంధవ్ 2 కూడా రానుందని హింట్ ఇచ్చాడు డైరెక్టర్.
ఇక ఈసినిమాలో వెంకీ పాత్ర తరువాత విలన్ గా నటించిన హిందీ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ పాత్ర హైలైట్ అయ్యింది.దాదాపు డైలాగుల ఎక్కువ శాతం హిందీలో నే వున్నాయి అవి అతను పలికినతీరు నవ్వు తెప్పిస్తుంది.ఓవరాల్ గా సైంధవ్ డీసెంట్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్.వెంకటేష్ నటనకు తోడు యాక్షన్ సీక్వెన్స్ సినిమాను నిలబెట్టాయి.
నటీనటల విషయానికి వస్తే వెంకటేష్ నటన గురించి కూడా ప్రత్యేకించి చెప్పేదేముంది.ఇలాంటి పాత్రలు తనకు కొత్తేమి కాదు.చాలా సెటిల్డ్ గా చేసి తెర మీద సైంధవ్ మాత్రమే కనబడేలా చేశాడు.ముఖ్యంగా యాక్షన్ సీన్స్ ను చాలా ఈజ్ తో చేశాడు.ఇక మిగితా పాత్రల్లో నటించిన శ్రద్దా శ్రీనాథ్,రుహాణి శర్మ , ఆండ్రియా జెర్మియా,ఆర్య వారి పాత్రలకు న్యాయం చేశారు.
ఇక టెక్నికల్ కూడా సైంధవ్ మెప్పిస్తుంది.ముఖ్యంగా సినిమాటోగ్రఫీ సినిమాకు చాలా ప్లస్ అయ్యింది.విజువల్స్ అదిరిపోయాయి.సంతోష్ నారాయణన్ సంగీతం డీసెంట్ గా వుంది.బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఓకే.ఎడిటింగ్ షార్ప్ గా వుంది.నిర్మాత వెంకట్ బోయనపల్లి ఖర్చుకు వెనకాడలేదు.సినిమాకు భారీగా ఖర్చు పెట్టి క్వాలిటీతో నిర్మించారు.
ఓవరాల్ గా మంచి అంచనాల మధ్య వచ్చిన సైంధవ్ మెప్పిస్తాడు.ఇందులో వెంకటేష్ నటన,యాక్షన్ సీక్వెన్స్,నవాజుద్దీన్ సిద్దిఖీ పాత్ర హైలైట్ అయ్యాయి.ఓ మంచి యాక్షన్ ఎంటర్టైనర్ ను చూడాలనుకుంటే సైంధవ్ చూసేయొచ్చు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: