‘హనుమాన్’ చిత్రయూనిట్ చేసిన వాగ్దానాన్ని నిలుపుకుంది. సినిమా విడుదలకు ముందు చెప్పినట్లుగానే హనుమాన్ సినిమా కలెక్షన్లలో నుంచి కొంత మొత్తాన్ని అయోధ్య రామమందిరానికి విరాళంగా ఇచ్చింది. కాగా ‘హనుమాన్’ సినిమాకు అమ్ముడయ్యే ప్రతీ టికెట్ నుంచి రూ.5ను అయోధ్య రామమందిరానికి విరాళంగా ఇస్తామని చిత్రబృందం ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిప్రకారం.. ఇచ్చినమాట నిలబెట్టుకుంటూ రిలీజ్‍కు ముందురోజు ప్రదర్శించిన ప్రీమియర్ షోల ద్వారా వచ్చిన ఆదాయంలో నుంచి రూ.14.85 లక్షలను విరాళంగా అందించింది. ఈ మేరకు ప్రీమియర్ల నుంచి వచ్చిన కలెక్షన్లలో రూ.14,85,810 మొత్తాన్ని చెక్ రూపంలో తొలి విడతగా అయోధ్య శ్రీ రామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్‌కి పంపింది. కాగా పెయిడ్ ప్రీమియర్ల ద్వారా మొత్తం 2,97,162 టికెట్లు అమ్ముడైనట్లు సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా.. హనుమాన్ సినిమా థియేటర్లలో ప్రదర్శించినన్ని రోజులూ ప్రతీ టికెట్‍పై రూ.5 చొప్పున అయోధ్య రామమందిరానికి ఇవ్వనున్నారు. దీనిలోభాగంగా ప్రతీ రోజు ఎంత మొత్తం విరాళం ఇస్తున్నది తెలిపేందుకు ఓ వెబ్‍సైట్‍ను కూడా లాంచ్ చేయనున్నట్లు సినిమా యూనిట్ వెల్లడించింది. ఇక టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో తేజ సజ్జా ప్రధానపాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘హను-మాన్’. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా భారీ అంచనాల మధ్య శుక్రవారం (జనవరి 12) ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి ప్రదర్శించిన పెయిడ్ ప్రీమియర్లతోనే ఈ మూవీకి అద్భుతమైన టాక్ రాగా.. నిన్న విడుదలైన అన్నిచోట్లా పాజిటివ్ రెస్పాన్స్‌తో దూసుకెళుతోంది.
A Promise was made and it is kept ❤️🔥
Team #HANUMAN offered a Grand Cheque to Ayodhya Ram Mandir per ₹5 on every ticket sold till now 🤗
A website launch is also announced to track the amount that will be donated till the Blockbuster full run of HanuMan 😍
— Primeshow Entertainment (@Primeshowtweets) January 12, 2024
కాగా ‘హనుమాన్’ సినిమాలో తేజ సజ్జా సరసన అమృత అయ్యర్ హీరోయిన్‍గా నటించింది. అలాగే కోలీవుడ్ ప్రముఖ నటి వరలక్ష్మి శరత్‍కుమార్ కీలక పాత్రలో కనిపించగా.. వినయ్ రాయ్ విలన్‍గా నటించారు. వీరితోపాటు వెన్నెల కిశోర్, గెటప్ శ్రీను, రాజ్‍దీపక్ శెట్టి, సత్య తదితరులు కీరోల్స్ పోషించారు. ప్రైమ్ షో ఎఎంటర్‌టైన్‍మెంట్ బ్యానర్‌పై నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా బ్లాక్‍బాస్టర్ టాక్ దక్కించుకుంది. ప్రస్తుతం అయోధ్యలో రాముడి విగ్రహ ప్రతిష్టాపన క్రతువు ప్రారంభమైన నేపథ్యంలో.. ‘హనుమాన్’ చిత్రం రిలీజవడం, అందునా చాలా బావుందనే టాక్ రావడంతో హిందీ రాష్ట్రాలలో అధిక మొత్తంలో వసూళ్లు సాధించవచ్చని సినీ పండితులు అంచనాలు వేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: