టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున అక్కినేని కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘నా సామిరంగ’. ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. . ‘ఆస్కార్’ అవార్డ్ విన్నర్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి అందించిన పాటలు ఇప్పటికే చార్ట్ బస్టర్‌గా నిలిచాయి. ఇక ఈ సినిమాలో ఆషిక రంగనాథ్ హీరోయిన్‌గా నటించగా.. టాలీవుడ్ ట్యాలెంటెడ్ నటులు అల్లరి నరేష్, రాజ్ తరుణ్, రుక్సర్ ధిల్లాన్, మిర్నా మీనన్ కీలక పాత్రలు పోషించారు. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీని శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌పై శ్రీనివాస చిట్టూరి హై బడ్జెట్‌తో నిర్మించారు. కాగా ‘నా సామిరంగ’ చిత్రం సంక్రాంతి కానుకగా ఈ నెల 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ‘నా సామిరంగ’ చిత్రం సంక్రాంతి కానుకగా రేపు.. అనగా ఆదివారం (జనవరి 14, 2024) ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో విడుదలకు ఒక్కరోజు ముందు చిత్రబృందం నాగ్ అభిమానులకు ఒక సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన కొన్ని పాటలు సంగీత ప్రియులను అలరించగా.. తాజాగా ఈ చిత్రం నుంచి మరో పాటను రిలీజ్ చేసింది. దీనిలో భాగంగా ‘సీసా మూత ఇప్పు’ అంటూ సాగే లిరికల్ సాంగ్‌ను ఈరోజు విడుదల చేసింది. ఇందులో.. నాగార్జున, అల్లరి నరేష్, రాజ్ తరుణ్ ముగ్గురూ కలిసి పార్టీలో మందేస్తూ చిందేశారు.
“పిల్ల సిగ్నల్ ఇచ్చిందంటే, ప్రేమ బండి చలో అంటే.. రైస్ మిల్లు నెల జీతం, రయి రయి మని పెరిగిందంటే, ఫేవరేట్ హీరో బొమ్మ హౌస్ ఫుల్ పడిందంటే, ఇండియా కప్పు కొట్టుకొస్తే ఇల్లాలే రాజీకొస్తే.. పక్కింటోడికి లాస్ వస్తే.. వాడిని ఓదార్చే ఛాన్స్ వస్తే.. ఏం సెయ్యాలి సెప్పు.. సీసా మూత ఇప్పు.. ఏం సెయ్యాలి సెప్పు.. సీసా మూత ఇప్పు” అంటూ ఫుల్ ఎనర్జీటిక్‌గా ఈ పాట సాగింది. కాగా ఈ పాటకు ఆస్కార్ అవార్డు విన్నర్ చంద్రబోస్ సాహిత్యం అందించగా.. మల్లికార్జున్, రేవంత్, సాయిచరణ్, లోకేష్, హైమత్. అరుణ్ కౌండియా తదితరులు ఆలపించారు. ఈ పార్టీ సాంగ్‌కు కీరవాణి ఫుల్ మాస్ బీట్ అందించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: