ఒకే ఫ్రేమ్‌లో మెగా హీరోలు.. చిరు, నాగబాబు సెల్ఫీ వైరల్

Nagababu Selfie With Megastar Chiranjeevi and Ram Charan Goes Viral

తెలుగునాట సంక్రాంతి పండుగకు ఉన్న ప్రత్యేకత అంతా ఇంతా కాదు. విద్య, ఉద్యోగ, జీవనోపాధికోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లినవారంతా ఈ పండుగ వేళ సొంతూర్లకు చేరుకోవడం సర్వసాధారణం. ఈ నేపథ్యంలో ఈ ఏడాది సాధారణ ప్రజలతోపాటు పలువురు సినీ ప్రముఖులు సైతం ఈ పండుగను అద్భుతంగా జరుపుకున్నారు. ఇక ప్రతి పండుగను వేడుకలా సెలబ్రేట్ చేసుకోవడం మెగా ఫ్యామిలీకి అలవాటన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా వారు సంక్రాంతి పండుగను ప్రత్యేకంగా జరుపుకున్నారు. బెంగుళూరులోని ఫాంహౌస్‏లో మెగా ఫ్యామిలీ ఈ పర్వదినాన్ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈ వేడుకలలో మెగా ఫ్యామిలీతో పాటుగా అల్లు కుటుంబం కూడా పాల్గొంది. ఇరు కుటుంబాల వారసులంతా ఈ వేడుకలో పాల్గొని సందడి చేశారు. మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్, శిరీష్, అల్లు అర్జున్, అకీరా నందన్, ఆద్య, నిహారికా, ఉపాసన, స్నేహారెడ్డి ఇలా అందరూ ఒక్కచోట చేరి సంక్రాంతి పండగను జరుపుకున్నారు. ఇక ఈవేడుకలలో రామ్ చరణ్, ఉపాసనల ముద్దులపట్టి క్లింకారా స్పెషల్ అట్రాక్షన్ గా నిలవగా.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్ కూడా సందడి చేయడం విశేషం.

ఈ నేపథ్యంలో మెగా హీరోలు అందరూ ఒకే ఫ్రేమ్‌లో కనిపించి సందడి చేశారు. చిరంజీవి, నాగబాబు ఇద్దరూ సెల్ఫీ తీసుకోగా.. అందులో వెనుకవైపు రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, శిరీష్ సహా పలువురు మెగా ఫ్యామిలీ మెంబర్స్ కూర్చుని కనిపించారు. ఇక ఇందుకు సంబంధించిన ఫోటోను నాగబాబు సోషల్ మీడియాలో షేర్ చేశారు. అందులో ఆయన ఇలా తెలిపారు.. “నా హఈ హృదయానికి అత్యంత దగ్గరైన మనషుల సమక్షంలో ఈ పండుగను జరుపుకోవడం చెప్పలేనంత ఆనందాన్ని నింపిందని ఇది నా జీవితంలో మధుర జ్ఞాపకంగా నిలిచి ఉంటుంది” అని పేర్కొన్నారు.

ఈ పోస్టును ఆయన చిరంజీవి, వరుణ్ తేజ్, లావణ్య, నిహారికలకు ట్యాగ్ చేశారు. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట వైరల్ అవుతోంది. మెగాభిమానులు దీనిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. మెగాస్టార్ ప్రస్తుతం ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ మల్లిడి దర్శకత్వంలో సోషియో ఫ్యాంటసీ జోనర్‌లో తెరకెక్కుతోన్న ‘విశ్వంభర’లో నటిస్తుండగా.. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న ‘గేమ్ ఛేంజర్’ చిత్రం ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × one =