మాస్ మహారాజాా రవితేజ సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. గత ఏడాది మూడు సినిమాలతో వచ్చిన రవితేజ ఈ ఏడాది పలు సినిమాలను లైన్ లో పెట్టాడు. ముందుగా రిలీజ్ కాబోతున్న సినిమా ఈగల్. ఈసినిమా సంక్రాంతికే రిలీజ్ అవ్వాలి కానీ వాయిదా పడింది. ఫిబ్రవరి 9వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈసినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా తాజాగా రవితేజ ఇంకా హరీష్ శంకర్ మధ్య సోషల్ మీడియా వేదికగా జరిగిన చర్చ ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇంతకీ రవితేజ-హరీష్ శంకర్ మధ్య జరిగిన సంభాషణ ఏంటంటే.. సినిమా రిజల్ట్ ల గురించి హరీష్ శంకర్ తన ట్విట్టర్ ద్వారా.. ఇక్కడ ఎవరికీ ఎవరి మీద నెగెటివిటీ ఉండదు. ఒకవేళ ఉన్నా ఏదో ఒక శుక్రవారం ఎవరో ఒకరు దొరికేస్తారు. ఎవడన్నా, పక్కోడి అపజయానికి సోలో డాన్స్ ఏస్తే, రేపు వాడి, అపజయానికి గ్రూప్ డాన్సర్లు రెడీ అవుతారు అంటూ రవితేజ చేసిన కామెంట్స్ ను పోస్ట్ చేశారు. ఇక హరీష్ శంకర్ చేసిన ట్వీట్ ను ట్యాగ్ చేస్తూ రవితేజ రిప్లై ఇస్తూ దీనికి నీ ఎక్స్ టెన్షన్ (కొనసాగింపు) ఎంట్రా అంటూ ట్వీట్ చేశాడు. మరలా దీనికి హరీష్ శంకర్ రిప్లై ఇస్తూ.. మీకు అన్నీ గుర్తుంటాయి అన్నయ్య.. అంతే అన్నయ్య యువర్ రైట్ మారుతున్న ఆడియన్స్ టెస్ట్ కి సర్దుకుంటూ పోవడం లేదా మొత్తం సర్దేసుకొని వెళ్ళిపోవడమే అని పోస్ట్ ల పేర్కొన్నారు. ఇప్పుడు వీరి ట్వీట్ లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
“ఇక్కడ ఎవరికీ ఎవరి మీద నెగెటివిటీ ఉండదు. ఒకవేళ ఉన్నా ఏదో ఒక శుక్రవారం ఎవరో ఒకరు దొరికేస్తారు
ఎవడన్నా,పక్కోడి అపజయానికి సోలో డాన్స్ ఏస్తే, రేపు వాడి,
అపజయానికి గ్రూప్ డాన్సర్లు….. రెడీ అవుతారు….. “Golden words from… Massmaharaaj….. thats why you are the most happiest…
— Harish Shankar .S (@harish2you) January 16, 2024
Lol… meeku anni gurthuntay Annayya….
“అంతే అన్నయ్య యువర్ రైట్ మారుతున్న ఆడియన్స్ టెస్ట్ కి సర్దుకుంటూ పోవడం
లేదా
మొత్తం సర్దేసుకొని వెళ్ళిపోవడం”That was my extension 🤣🤣 https://t.co/9A286bV8NX
— Harish Shankar .S (@harish2you) January 16, 2024
కాగా ఇప్పుడు వీరిద్దరి కంబినేషన్ లో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. మిస్టర్ బచ్చన్ అనే టైటిల్ తో ఈసినిమా వస్తుంది. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది. కాగా ఇప్పుడు వీరిద్దరి కంబినేషన్ లో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. మిస్టర్ బచ్చన్ అనే టైటిల్ తో ఈసినిమా వస్తుంది. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది. ఈసినిమాలో భాగ్యశ్రీ బోర్స్ హీరోయిన్ గా నటిస్తుండగా.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తుండగా, అయనంక బోస్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: