హనుమాన్ జోరు ఇప్పట్లో ఆగేలాలేదు.చిన్న సినిమాగా సంక్రాంతి పోటీలో దిగి ఊహించని వసూళ్లను రాబట్టుకుంటూ బాక్సాఫీస్ వద్ద హావ కొనసాగిస్తోంది.నిన్నఈసినిమా 100కోట్ల మార్క్ ను క్రాస్ చేసి సాలిడ్ హోల్డ్ ను కొనసాగించింది.దాంతో 5రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 114కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకుంది.ఇందులో షేర్ 60కోట్లు.ఇక30 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈసినిమా 5రోజుల్లోనే అంతకు రెట్టింపు కలెక్ట్ చేసి డబుల్ బ్లాక్ బాస్టర్ అనిపించుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
హనుమాన్ కేవలం తెలుగులోనే కాదు అన్ని భాషల్లోనే సాలిడ్ గ్రోత్ ను చూపిస్తుంది.ముఖ్యంగా హిందీలో అయితే షాకింగ్ వసూళ్లను రాబడుతుంది.5రోజుల్లోనే 18.77కోట్ల నెట్ ను రాబట్టుకుంది.ఫుల్ రన్ లో అక్కడ 50కోట్ల వరకు రాబట్టిన ఆశ్చర్యపోనక్కర్లేదు.ఓవరాల్ గా చూస్తే హనుమాన్ ఫుల్ రన్ లో 200కోట్ల క్లబ్ లో చేరడం ఖాయంగా కనిపిస్తుంది.
ఇక ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ అదిరిపోయాయి దాంతో 6వ రోజు కూడా సాలిడ్ షేర్ ను రాబట్టనుంది.మొత్తానికి పెద్ద సినిమాలతో సంక్రాంతి బరిలో నిలిచి రిస్క్ చేసిన హనుమాన్ మేకర్స్ కు రిజల్ట్ మాత్రం ఊహించని ఆనందాన్ని ఇస్తుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: