సూపర్ స్టార్ హీరోగా వచ్చిన సినిమా గుంటూరు కారం. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఫుల్ మాస్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా తెరకెక్కింది. ఇక ఈసినిమా జనవరి 12వ తేదీన రిలీజ్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈసినిమా హిట్ టాక్ ను అయితే సొంతం చేసుకుంది. ముఖ్యంగా మహేష్ నటనకు అందరూ ఫిదా అవుతున్నారు. కలెక్షన్స్ పరంగా కూడా ఈసినిమా సాలిడ్ కలెక్షన్స్ ను అందుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాకు అంత క్రేజ్ రావడానికి కారణం బీజం వేసింది ఫస్ట్ గ్లింప్స్ అని చెప్పడంలో ఎలాంది సందేహం లేదు. మహేష్ మాస్ లుక్ అందులోనూ మహేష్ నోట్లో బీడీ. అప్పుడే ఈసినిమాపై అంచనాలు తారా స్థాయికి వెళ్లాయి. నిజానికి మహేష్ బాబు నుండి ఊరమాస్ అంటేనే ఫ్యాన్స్ కు పండగ.. అలాంటిది ఇక నోట్లో బీడీ కూడా అంటే ఊరుకుంటారా.. పండగ చేసుకుంటున్నారు. ఇక ఇప్పుడు ఆ బీడీ సీక్రెట్ ఏంటో చెప్పాడు మహేష్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మహేష్ ను బీడీ గురించి అడుగగా.. నేను స్మోక్ చేయను.. స్మోక్ చేసేవాళ్లను కూడా ఎంకరేజ్ చేయను.. అయితే ఈసినిమాలో ముందు ఒరిజినల్ బీడీ ఇచ్చారు త్రివిక్రమ్ కానీ అది తాగినప్పుడు మైగ్రెయిన్ లాగా తలనొప్పి వచ్చేసింది.. దాంతో ఆయుర్వేదం బీడీని తీసుకొచ్చారు. లవంగం ఆకులతో చేశారు.. మింట్ ప్లేవర్ తో బాగుంది అంటూ తను వాడిన బీడీ సీక్రెెట్ గురించి చెప్పుకొచ్చారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























