టాలీవుడ్ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో తేజ సజ్జా, క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబోలో రూపొందిన ‘హనుమాన్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. సోషియో ఫాంటసీ జానర్‌లో తెరకెక్కిన ఈ సినిమాపై విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొనగా.. అందుకు తగ్గట్లే ప్రీమియర్స్ తోనే బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఈ పండుగకు మహేష్ బాబు-త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన ‘గుంటూరు కారం’, వెంకటేష్-శైలేష్ కొలను తీసిన ‘సైంధవ్’, నాగార్జున-విజయ్ బిన్నీ కాంబోలో రూపొందిన ‘నా సామిరంగ’ సినిమాలు బాక్సాఫీస్ బరిలో ఉన్నా.. వాటిని తట్టుకుని మరీ హనుమాన్ సూపర్ హిట్ అవ్వడం సినీ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరిచింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ క్రమంలో తొలి మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్‌ను సాధించి, ఆపై 4వ రోజునే 100 కోట్ల మైలురాయి చేరుకుంది. ఈ నేపథ్యంలో హనుమాన్ రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా దేశవ్యాప్తంగా సత్తా చాటుతోంది. హిందీ బెల్ట్ బాలీవుడ్‌లో సైతం ఈ మూవీ దుమ్ము రేపుతోంది. నిజానికి రెండో రోజు ఈ సినిమా కత్రినా కైఫ్-విజయ్ సేతుపతి జంటగా నటించిన ‘మెర్రీ క్రిస్మస్’, ధనుష్ హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ‘కెప్టెన్ మిల్లర్’ చిత్రాల కలెక్షన్లను అధిగమించింది. కేవలం ఐదు రోజుల్లోనే అక్కడ రూ.20 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టుకుంది. ఇందుకు సంబంధించి ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరుణ్ ఆదర్శ్ కలెక్షన్ల వివరాలను సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
#HanuMan stands tall, finds APPRECIATION and ACCEPTANCE, both… Continues to set cash registers ringing on Day 5… Several Tier-2 and Tier-3 centres are FANTASTIC… Fri 2.15 cr, Sat 4.05 cr, Sun 6.17 cr, Mon 3.80 cr, Tue 2.60 cr. Total: ₹ 18.77 cr. #India biz. Note: #Hindi… pic.twitter.com/qIZikAilTB
— taran adarsh (@taran_adarsh) January 17, 2024
చిన్న సినిమాగా విడుదలై ఘనవిజయం సాధించిన ‘హనుమాన్’పై పలువురు సినీ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే కన్నడ స్టార్ హీరోలు శివ రాజ్‌కుమార్ , రిషబ్ షెట్టి, ధనుంజయ, కోలీవుడ్ నుంచి మాధవన్, రాధిక, శరత్ కుమార్ దంపతులు.. మళయాళ చిత్రపరిశ్రమ నుంచి ఉన్ని ముకుందన్ ఈ సినిమాను వీక్షించి అభినందించారు. టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి రవితేజ, రామ్ పోతినేని, మంచు విష్ణు, నారా రోహిత్, గోపీచంద్, ఆర్జీవీ, సాయిధరమ్ తేజ్, నాని, వరుణ్ తేజ్, రాఘవేంద్రరావు వంటి వారు ఈ చిత్రాన్ని ప్రశంసించారు. ఇక టాలీవుడ్ అగ్రహీరో నందమూరి బాలకృష్ణ అయితే ఏకంగా స్పెషల్ స్క్రీనింగ్ వేయించుకుని మరీ హనుమాన్ మూవీని వీక్షించారు.
కాగా హనుమాన్ చిత్రంలో అమృత అయ్యర్ హీరోయిన్‌గా నటించగా.. వరలక్ష్మి శరత్ కుమార్, వెన్నెల కిశోర్, సత్య, గెటప్ శ్రీను తదితరులు ఇతర కీలక పాత్రల్లో కనిపించారు. శ్రీమతి చైతన్య సమర్పణలో ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై కె నిరంజన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: